Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

WhatsApp Pay Launch in India, revealed by Zuckerberg

ఇండియాలో వాట్సప్ పే లాంచ్, వెల్లడించిన జుకర్ బర్గ్
WhatsApp Pay Launch in India, revealed by Zuckerberg

అంతర్జాతీయంగా అంత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇండియాలో వాట్సప్ పే సేవలను త్వరలో లాంచ్ చేయబోతోంది.ఈ విషయాన్ని ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తెలియజేశారు. కాగా Data compliance issues వల్ల ఈ సేవలు లేట్ అవుతున్నాయని అన్నీ పరీక్షలు పూర్తయిన తరువాత వాట్సప్ పే సేవలు ఇండియాలో పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని తెలిపారు. టెస్టింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉందని దేశంలో వన్ మిల్లియన్ యూజర్లకు ఈ సేవలను అందిస్తామని ఫేస్ బుక్ అధినేత తెలిపారు.
WhatsApp Pay Launch in India, revealed by Zuckerberg

అనుమతులు లభించడమే ఆలస్యం
ఈ పేమెంట్ సేవలు అందించడానికి అవసరమైన అనుమతులు లభించడమే ఆలస్యం వెంటనే ఈ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పేమెంట్ సేవలు అందించడానికి అవసరమైన యూపీఐ ప్రమాణాలు, పలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
భారత్‌లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగవంతంగా దూసుకుపోతున్నదని, ఈ నేపథ్యంలో ఆర్థిక సేవలు కూడా వీటిద్వారానే జరుగుతుండటంతో ఈ నూతన సేవలపై దృష్టి సారించినట్లు చెప్పారు.

భారత్ నుంచి 40 కోట్ల మంది

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, వీరిలో భారత్ నుంచి 40 కోట్ల మంది ఉన్నారు. ఇప్పటికే దేశంలో పేటీఎం, ఫోన్-పే, గూగుల్ పే వంటి సంస్థలు అందిస్తుండగా, వీటికి పోటీగా వాట్సప్ రానున్నది. వచ్చే మూడేండ్ల కాలంలో ఈ సంఖ్య 100 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
వీటికే పోటీ

వాట్సప్ పే ఇండియాలో లాంచ్ అయితే ప్రధానంగా వీటికే పోటీ కానుంది. 

Alphabet's , Walmart-owned PhonePe, Amazon Pay and Alibaba-backed Paytm వంటి సంస్థలకు వాట్సప్ పే సవాల్ విసరనుంది. ఈ కంపెనీలు ఇండియాలో డిజిటల్ పేమెంట్ రంగాన్ని శాసిస్తున్నాయి. 2020 నాటికి వీటి మార్కెట్ విలువ సుమారుగా 1 trillionను చేరుకోనుందని అంచనా

దూసుకుపోతున్న వాట్సప్

కాగా ఇండియాలో వాట్సప్ కాల్స్ దూసుకుపోతున్నాయి. వాట్సప్ కాల్ చేసే డైలీ యాక్టివ్ యూజర్స్ సుమారుగా 1.62 billion మంది ఉన్నారని అంచనా. గతేడితో పోలిస్తే ఇది 9 per cent పెరిగింది. India, Indonesia and the Philippines వంటి దేశాల్లో వాట్సప్ కాల్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "WhatsApp Pay Launch in India, revealed by Zuckerberg"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0