3441 jobs in Transco
ట్రాన్స్‌కోలో 3441 ఉద్యోగాలు!
ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ ఆపరేటర్లు కావాలి: ట్రాన్స్‌కో
భర్తీకి అనుమతి కోసం ప్రభుత్వానికి సీఎండీ లేఖ
2023 కల్లా 21,113 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్స్‌ట్రా హైవోల్టేజీ(ఈహెచ్‌టీ) సబ్‌స్టేషన్‌లతో పాటు లైన్ల కోసం 3441 మంది సబ్‌స్టేషన్ ఆపరేటర్లు కావాలని ట్రాన్స్‌కో లెక్క తీసింది. ఆయా ఉద్యోగాల భర్తీకి అనుమతివ్వాలని కో రుతూ ప్రభుత్వానికి సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు లేఖ రాశారు. ప్రభుత్వ అనుమతిరాగానే వీటిని భర్తీ చేసా ్తరు. పదో తరగతి ఉత్తీర్ణులై ఐటీఐ(ఎలక్ట్రిషీయన్)లేదా పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన అభ్యర్థులతో ఈ పోస్టులను నింపనున్నారు.
మరోవైపు 4361 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఆర్టిజన్లుగా మార్చి, ఇటీవల సంస్థలో విలీనం చేసుకున్న విష యం తెలిసిందే. కాగా, 2019-20లో 7907పోస్టులను మంజూ రుచేసిన ట్రాన్స్‌కో 4284 పోస్టులను భర్తీ చేసింది. 2020-21లో 8097 పోస్టులు మంజూరు చేసి 5308 పోస్టులను భర్తీ చేయనుంది. 2023-24లో 8535 పోస్టులను మంజూరు చేసి 6698 పోస్టులను భర్తీ చేయనుంది. కాగా, తెలంగాణలో విద్యుత్తు డిమాండ్ 2023-24 కల్లా 21,113 మెగావాట్లకు చేరనుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఎత్తిపోతల పథకాలతో పాటు గృహ, వాణిజ్య వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే ఐదేళ్లలో డిమాండ్ రెట్టింపు కానుందని లెక్క వేశారు. రానున్న ఐదేళ్ల డిమాండ్‌ను అందుకునేందుకు వివిధ సామర్థ్యం గల సబ్‌స్టేషన్ల నిర్మాణానికి రూ.11,366.63 కోట్లు ఖర్చవుతుందని ట్రాన్స్‌కో లెక్క తీసింది.

0 Response to "3441 jobs in Transco"
Post a Comment