Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A description of how to apply for a duplicate card online when a PAN card is lost

పాన్ కార్డు పోయినప్పుడు  డూప్లికేట్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో వివరణ
A description of how to apply for a duplicate card online when a PAN card is lost

పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీలకమైన ఫైనాన్షియల్ డాక్యుమెంట్ ఇది. ఆదాయపు పన్ను శాఖ ఈ కార్డును జారీ చేస్తుంది. ఆధార్ కార్డు ఎంత కీలకమో ఇది కూడా అంతే. బ్యాంక్ అకౌంట్, పెద్ద మొత్తంలో మనీ డిపాజిట్ (రూ.50,000కు పైన) వంటి చాలా వాటికి పాన్ కార్డు ఉపయోగపడుతుంది. పన్ను చెల్లింపుదారులు అందరికీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయాలంటే పాన్ కార్డు అవసరం అవుతుంది.కీలకమైన డాక్యుమెంట్లలో పాన్ కార్డు ఒకటి.
ఒకవేళ పాన్ కార్డు పోతే? 
అప్పుడు వెంటనే డూప్లికేట్ కార్డు కోసం అప్లై చేసుకోవలసి ఉంటుంది. డూప్లికేట్ పాన్ కార్డు లేదా పాన్ కార్డు రిప్రింట్ కోసం మీరు డూప్లికేట్ పాన్ కార్డు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. 
పాన్ కార్డు అప్లై కోసం ఏం చేయాలి?

డూప్లికేట్ పాన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లోన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌ఎస్‌డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీస్ సర్వీసెస్ అనే రెండు సంస్థలు పాన్ కార్డులను ఇష్యూ చేస్తాయి. ఆదాయపు పన్ను శాఖ ఈ రెండింటికి మాత్రమే పాన్ కార్డు జారీ అధికారాన్ని అందించింది

డూప్లికేట్ పాన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం


డూప్లికేట్ పాన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం..
ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. www.tin-nsdl.com ద్వారా పోర్టల్‌కు వెళ్లొచ్చు. ఇప్పుడు రిప్రింట్ ఆఫ్ పాన్ కార్డు ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీకు ఈ ఆప్షన్ కనిపించకపోతే.. సర్వీసెస్‌పై క్లిక్ చేసి పాన్ ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. కిందకు వస్తే రిప్రింట్ ఆఫ్ పాన్ కార్డు ఆప్షన్ కనిపిస్తుంది

ఇప్పుడు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. పాన్ కార్డు రిప్రింట్ కోసం ఆధార్ కార్డు వివరాలు ఎంచుకోవచ్చనే ఆప్షన్‌పై టిక్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేయాలి. సబ్‌మిట్ చేయాలి. ఇప్పుడు మీకు సంబంధించిన మాస్క్‌డ్ వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి.

తర్వాత ఓటీపీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఈమెయిల్, మొబైల్ నెంబర్ లేదా రెండింటికీ అనే ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్న వివరాలతో పాన్ కార్డు ప్రింట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

జనరేట్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ 10 నిమిషాల వ్యాలిడిటినీ కలిగి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి.

ఓటీపీ ఓకే అయిన తర్వాత ఇప్పుడు పేమెంట్ చేయాలి. దీని కోసం పే కన్ఫార్మ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ గేట్‌వే పేజ్‌కు వెళ్తారు. రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

డబ్బు చెల్లించిన తర్వాత స్క్రీన్‌పై ట్రాన్సాక్షన్ వివరాలు కనిపిస్తాయి. కంటిన్యూ‌పై క్లిక్ చేయండి. పేమెంట్ రశీదును ప్రింట్ తీసుకోండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. దీని ద్వార ఇపాన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A description of how to apply for a duplicate card online when a PAN card is lost"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0