Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Amaravathi Balotsavam on 6th of this month

6న అమరావతి బాలోత్సవం..!
250 పాఠశాలల నమోదు
10,500 మందికి పైగా పాల్గొననున్న విద్యార్థులు
వేదిక పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్‌ కళాశాల
Amaravathi Balotsavam on 6th of this month

 అమరావతి బాలోత్సవం పిల్లల పండగను 6 తేదీన రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌, రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావులు ప్రారంభిస్తున్నట్లు బాలోత్సవం గౌరవ అధ్యక్షుడు చలవాది మల్లికార్జునరావు తెలిపారు. విజయవాడ, కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాలలో అమరావతి బాలోత్సవం 3వ పండగ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనను వెలికి తీసేందుకు ఇలాంటి బాలోత్సవ పండగలు ఎంతగానో దోహదపడతాయన్నారు. 7వ తేదీన యువజనుల, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అమరావతి బాలోత్సవం కమిటీ కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ హైదరాబాదులో వైద్యురాలిని హత్య చేసిన వారు 25 ఏళ్ల లోపు యువకులేనని, ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతలో క్రమశిక్షణ, సహకారం, స్త్రీ, పురుష సమానం, సోదరి భావం, స్నేపూరితం వంటి వాతావరణం సంతరించుకుంటుందన్నారు. తద్వారా విద్యార్థుల్లో ఎలాంటి భేషజాలు, తప్పుడు ఆలోచనలు రాకుండా దోహదపడతాయని వివరించారు. అలాగే సమాజం కోసం పాటుపడిన మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు, కందుకూరి,గురజాడ, శ్రీశ్రీ, జాషువా, గిడుగు రామ్మూర్తి చిత్రపటాలతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల మరణించిన డాక్టర్‌ హేమాపరిమితో పాటు సినీ సాంస్కృతిక రంగ ప్రముఖుల పేర్లతో వివిధ వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 
250 పాఠశాలలు నమోదు చేయించుకున్నాయని, ఇప్పటి వరకు సుమారు 10,500 మంది విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా భోజన, అల్పాహారం (స్నాక్స్‌) అందజేస్తామని వివరించారు. బాలోత్సవం ప్రధాన కార్యదర్శి రామశెట్టి కొండలరావు మాట్లాడుతూ జానపద నృత్యం, కోలాటం, కూచిపూడి నృత్యం, విచిత్ర వేషధారణ, షార్ట్‌ఫిల్మ్‌, లఘు నాటికలు, మైమింగ్‌ వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాటి కోసం 7 వేదికలు, 20 గదుల్లో విద్యాపర అంశాలలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రధాన విద్యాసంస్థలు, సాహితీవేత్తలు, ప్రొఫెసర్లు, బాలల విద్యారంగ ప్రముఖులతో ఏర్పడిన అమరావతి బాలోత్సవం కమిటీి, ఈ ఉత్సవాల కోసం 2 నెలలుగా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబరు 6,7,8 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించే పిల్లల పండగను నగరవాసులు తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాల కార్యదర్శి రావూరి సుబ్బారావు, కోశాధికారి కొత్తమాసు వెంకటేశ్వరరావు, బాలోత్సవం ఉపాధ్యక్షులు గుమ్మా సాంబశివరావు, వెన్నా వల్లభరావు, విద్యాఖన్నా, కార్యదర్శి జ్యోత్స్న, సాంబిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Amaravathi Balotsavam on 6th of this month"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0