Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

'Amma Vodi must complete the registration of details • Once again complete the inquiry

అర్హులందరికీ ' అమ్మ ఒడి '
'Amma Vodi must complete the registration of details • Once again complete the inquiry

 వివరాల నమోదును పూర్తి చేయాలి 
 మరోసారి పూర్తిస్థాయిలో విచారణ చేయండి 
ఏ ఒక్కరికీ అన్యాయం జరగరాదు 
 నాడు - నేడు కింద 1 , 039 స్కూళ్లలో వసతులు వీడియో కాన్ఫరెన్స్ లో పాఠశాల విద్య కమిషనర్ చిన వీరభద్రుడు


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు చేయనున్న జగనన్న అమ్మ ఒడి పథకం అర్హులైన విద్యార్థుల తల్లులందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్య కమిషనర్ చిన వీరభద్రుడు విద్యాశాఖ | అధికారులను ఆదేశించారు . ఇప్పటికే దాదాపు అర్జులను గుర్తించామని , మరో సారి పూర్తిసా యిలో విచారించి , మిగిలిపోయిన విద్యార్థుల తల్లుల వివరాలు సేకరించాలన్నారు . ఓ ఒక్క విద్యార్థి తల్లికీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉం దన్నారు . శుక్రవారం అమరావతి నుంచి నాడు - నేడు , అమ్మ ఒడి , డీఎస్సీ - 2018 తదితర అంశాలపై ఆయన డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నాడు - నేడు కార్యక్ర మాన్ని వెంటనే అమలు చేసేందుకు అధి కారులు ప్రతి స్కూల్ పేరెంట్ కమిటీలకు శిక్షణ ఇవ్వాలని , వచ్చే నెలలో కచ్చితంగా పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు . జిల్లాలో 1 , 039 పాఠశాలల్లో నాడు - నేడు కార్య క్రమం అమలు కానుందని , ప్రతి స్కూల్లో 9 రకాల వసతులు కల్పించేందుకు నిర్దేశించిన పనులను నాణ్యతతో చేయించేలా పేరెంట్స్ కమిటీల శిక్షణలో తెలియజేయాలన్నారు . అమ్మ ఒడి పథకంలో భాగంగానే ప్రొఫార్మ - 1లోని విద్యార్థుల వివరాలను నమోదు చేసేందుకు శనివారం ఆఖరు రోజు అని , కచ్చితంగా పూర్తి చేయాలని కమిషనర్ ఆధి కారులకు సూచించారు . గ్రామ సభలను ఈ నెల 26 , 27 , 28 తేదీల్లో నిర్వహించి , జాబితా లను 29న ఎంఈఓలు , 30న డీఈఓ , 31న జిల్లా కలెక్టర్ ఆమోదం పూర్తి కావాలన్నారు . ఇంకా ఎక్కడైనా తప్పిపోయినట్లు అయితే విచారణ చేసి , వివరాలను మరోసారి చెక్ చేసి అందించాలన్నారు . తల్లిదండ్రులు లేని పిల్లలు , అనాథలు వంటి వారి వివరాలను పక్కగా నమోదయ్యేలా చూడాలన్నారు . జిల్లాలో ప్రొఫార్మా - 1లో 82 శాతం పూర్తయిం దని , ప్రొఫార్మా - 2లో 100 శాతం పూర్తయింద ని , నేటి సాయంత్రంలోపు పూర్తి చేస్తామని డీఈఓ సాయిరామ్ కమిషనర్‌కు వివరించారు . అమ్మ ఒడి వివరాల నమోదులో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల కంటే ముందుగా ఉండడంపై కమిషనర్ జిల్లా విద్యాశాఖ అధికారులను , సిబ్బందిని అభినందించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "'Amma Vodi must complete the registration of details • Once again complete the inquiry"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0