Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Appointments for 2018 DSC candidates.


 2018 డీఎస్సీ అభ్యర్థులకు అపాయింట్ మెంట్లు..
కోర్టు కేసుల్లేని 2654 మందికి ఆర్డర్లు..

Appointments for 2018 DSC candidates.

 జిల్లాల వారీగా అపాయింట్ మెంట్లు అందుకున్న వారి జాబితా ఇలా..

 2018 డీఎస్సీలో , అర్హత సాధించి పోస్టింగుల కోసం ఎదురుచూస్తు న్న అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందిం చింది . కోర్టు కేసుల చిక్కుల్లేని 2 వేల 654 మంది అభ్యర్థులకు ఆదివారం జిల్లాల వారీగా అపాయిం ట్మెంట్ ఆర్డర్లు అందించారు . ఈ కార్యక్రమాన్ని కడప జిల్లాలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా , విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ లాంఛనంగా ప్రారంభించారు . కడప జిల్లాలో 2018 డీఎస్సీలో అర్హత సాధించిన వారిలో కోర్టు కేసుల్లేని 94 పోస్టులకు సంబంధించి మంత్రులు , స్థానిక అధికారులు అపాయింట్ మెంట్ ఆర్డర్ కాపీలను అందజేశారు . మొత్తం 7 వేల 902 పోస్టులకు సంబంధించి 2018లో డీఎస్సీ నిర్వహించగా . . అప్పటి నుంచి వివిధ కారణాలు , కోర్టు కేసుల వల్ల ఇప్పటి వరకు అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వలేదు . - 2018 డీఎస్సీకి సంబంధించి అన్ని పోస్టులకు దాదాపుగా ప్రొవిజినల్ సెల క్షన్ లిస్ట్ సిద్ధమైనా కోర్టుల్లో ఉన్న కేసుల కారణంగా అడుగు ముందుకు పడటం లేదు . అయితే . . శీతాకాల అసెంబ్లీ సమా వేశాలు జరుగుతున్న సమయంలోనే హైకోర్టులో 2 వేల 654 పోస్టులకు సంబంధించి క్లియరెన్స్ రావడంతో వాటి వరకు నియామక ప్రక్రియ జరిపే అవకాశం లభించింది . అదే సమయంలో శాసనసభ , శాసనమండలి సాక్షిగా విద్యాశాఖ మంత్రి డా . ఆదిమూలపు సురేష్ కోర్టు కేసులో క్లియర్ అయిన పోస్టుల నియామక పత్రాలను పది రోజుల్లోగా అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు . ఈ నేపథ్యంలో జిల్లాల సెలక్షన్ కమిటీలు , రాష్ట్ర అధికారులు కలిసి అర్హుల జాబితా రూపొందించారు . అలాగే శుక్రవారం ఎంపికైన అభ్యర్థులందరికీ సమాచారం అందజేశారు . ఆదివారం జిల్లాల వారీగా అభ్యర్థులకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ఆధ్వర్యంలో నియామకాల పత్రాలు అందజేశారు

 . జిల్లాల వారీగా అపాయింట్ మెంట్లు అందుకున్న వారి జాబితా

 ఆర్ట్ అండ్ డ్రాయింగ్ , క్రాఫ్స్ లాంగ్వేజ్ పండిట్ , మ్యూజిక్ , స్కూల్ అసిస్టెంట్ , సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులన్నింటికీ కలిపి అన్ని జిల్లాల్లో మొత్తం 1544 మంది ఎంపిక య్యారు . ఇవి కాక ఏపీఎంఎస్ , బీసీ వెల్ఫేర్ , ఏపీఆర్ఈఐఎస్ పాఠశాలల్లో భర్తీ అయిన టీచర్ల పోస్టులతో కలిపి మొత్తం 2 వేల 654గా ఉంది . అన్ని కేటగిరీల్లో కలిపి
 శ్రీకాకుళం జిల్లాలో 127 , 
విజయనగరం జిల్లాలో 70 , 
విశాఖపట్నం జిల్లాలో43 , 
పశ్చిమ గోదావరి జిల్లాలో 157 , 
తూర్పు గోదావరి జిల్లాలో 203 ,
 కృష్ణా జిల్లాలో 89 , 
గుంటూరు జిల్లాలో 116 ,
 ప్రకాశం జిల్లాలో 59 . 
 నెల్లూరు జిల్లాలో 140 , 
చిత్తూరు జిల్లాలో 169 , 
కడప జిల్లాలో 94 , 
అనంతపురము జిల్లాలో 145 , 
కర్నూలు జిల్లాలో 132 
మంది అభ్యర్థులకు ఆదివారం నియామక పత్రాలు అందజేశారు . ఈ ఏపీఎంఎస్ పాఠశాలలకు సంబంధించి 
జోన్ - 1లో పీజీటీ 55  టీజీటీ 100 , 
జోన్ - 2లో పీజీటీ 5    టీజీటీ 9 ,
 జోన్ - 3లో పీజీటీ 36  టీజీటీ 87 , 
జోన్ - 4లో పీజీటీ 111  టీజీటీ 242 
మొత్తం 645 పోస్టులను అధికారులు భర్తీ చేశారు . బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో ఆర్ట్ అండ్ డ్రాయింగ్ , క్రాఫ్ట్ మ్యూజిక్ , పీజీటీ , టీజీటీ కలిపి 
జోన్ - 1లో 76 ,
 జోన్ - 2లో 24 , 
జోన్ - 3లో 59 , 
జోన్ - 4లో 164 
మొత్తం   323 
 అభ్యర్థులకు అపాయింట్‌మెంట్లు అందించారు .ఏపీఎంఎస్ పాఠశాల లలో రాష్ట్రమంతా కలిపి పీజీటీ 55 , టీజీటీ 87 పోస్టులను భర్తీ చేశారు . ఇదిలా ఉండగా . . తొలి విడతలో దాదాపునాలుగోవంతు పోస్టులు భర్తీ చేయడంతో ప్రభుత్వం మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు . కోర్టుల్లో ఉన్న కేసులకు కౌంటర్లు వేసి త్వరితగతిన తమకు కూడా నియామకపత్రాలు అందిం చాలని అర్హత సాధించిన మిగిలిన అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Appointments for 2018 DSC candidates."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0