Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Educational tools for students

విద్యార్థుల కోసం కొత్త సాధ‌నాలు
New Educational tools for students

  ఆధునిక సాంకేతికత అందుబాట్లోకి వచ్చిన తర్వాత అనేక అధునాతన ఫీచర్లు వస్తూనే ఉన్నాయి.

విద్యార్థులకు అవసరమైన అనేక ఫీచర్లు వస్తున్నాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం విద్యార్థులకు టెక్నాలజీ వడ్డించిన విస్తరిలా మారింది. చదువుకు టెక్నాలజీ ముఖ్యమైన పాత్ర వహిస్తోంది. విద్యార్థులను దేశ భవిష్యత్తుగా, దేశానికి పెద్ద సంపదగా భావిస్తారు. ఈ కారణంగానే శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలతో కొత్తకొత్త టెక్నిక్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలా వచ్చిన వాటిలో కొన్ని...

1. Muzo : ఇదొక కాంపాక్ట్‌ డివైజ్‌. ఈ డివైజ్‌ మీ చుట్టుపక్కల ఉన్న నాయిస్‌ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అద్భుతమైన డివైజ్‌ విద్యార్థులకు ఒక వరం లాంటిది. ఈ డివైజ్‌ని ఏదైనా గోడకి అతికిస్తే చాలు. ఈ డివైజ్‌ యాక్టివ్‌ నాయిస్‌ని తగ్గించడంతో పాటు నాయిస్‌ వైబ్రేషన్స్‌ని కూడా అబ్జార్బ్‌ చేసుకుంటుంది. బయటి శబ్దాలను లోపలికి రానీయకుండా, లోపల నిశ్శబ్ద వాతావరణాన్ని ఇది కల్పిస్తుంది. దీన్నొక ప్రత్యేకమైన యాప్‌ ద్వారా మేనేజ్‌ చేస్తారు. దీని ఖరీదు దాదాపు 119 డాలర్ల వరకూ ఉంది.

2. Remarkable : ఈ డివైజ్‌ ద్వారా పేపర్‌ని పూర్తిగా రీప్లేస్‌ చేసేయవచ్చు. దీన్ని రిమార్కబుల్‌ క్యాన్వస్‌ అని కూడా అంటారు. దీన్ని ఈ-ఇంక్‌ టెక్నాలజీ కార్టర్‌ని ఆధారం చేసుకొని, రూపొందించారు. దీని డిస్‌ప్లే సైజ్‌ 10.3 అంగుళాల వరకూ ఉంటుంది. దీని రిజల్యూషన్‌ 1800ఞ1600 పిక్సెల్స్‌. దీనిమీద రాస్తున్నప్పుడు పేపర్‌పై రాస్తున్నట్టే ఉంటుంది. మనం రాసిన పేజీలన్నీ పిడిఎఫ్‌ ఫార్మెట్‌లో సేవ్‌ అవుతాయి. దాదాపు లక్ష పిడిఎఫ్‌ ఫైల్స్‌ని సేవ్‌ చేసుకోగలిగినంత కెపాసిటీ ఈ డివైజ్‌లో ఉంటుంది. దీన్ని కావాలనుకుంటే, దీని అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ చేసుకోవచ్చు.

3. Pup Scaner : మనం ఎక్కడున్నా, ఎలాంటి సందర్భంలోనైనా డాక్యుమెంట్లను స్కాన్‌ చేసుకోవచ్చు. 5.5 అంగుళాల పొడవుండే దీని ఆకారం సిగార్‌ లైటర్‌ని పోలి వుంటుంది. దీని ద్వారా స్కాన్‌ చేసిన డాక్యుమెంట్లను ఫోన్‌లోకైనా, కంప్యూటర్‌లోకైనా హైక్వాలిటీలో పంపించవచ్చు. అన్ని సోషల్‌మీడియా మాధ్యమాల్లోనూ పోస్ట్‌ చేయొచ్చు. దీనిలో ఎల్‌ఇడి లైట్‌, లేజర్‌ స్కానర్‌ వుంటుంది. లేజర్‌ లైట్‌ డాక్యుమెంట్‌ సైజ్‌ని గుర్తిస్తుంది. ఆ తర్వాత లేజర్‌ స్కానర్‌ ద్వారా స్కాన్‌ చేసుకుంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 12గంటల వరకూ ఏకధాటిగా స్కాన్‌ చేసుకోవచ్చు. దీనిలో సుమారు 10వేల స్కాన్‌ పేజీలను నిక్షిప్తం చేసుకోవచ్చు. దీని ఖరీదు 170 డాలర్ల వరకూ వుంటుంది. ముఖ్యంగా ఈ గాడ్జెట్‌ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది.

4. Mother Box : ఇదొక ఛార్జర్‌ డివైజ్‌. మన మొబైల్‌ను ఈ డివైజ్‌కు 20అంగుళాల దూరంలో వుంచినా ఛార్జి చేసుకోవచ్చు. మాగటిక్‌ రెజినెన్స్‌ ప్రిన్సిపుల్‌ ఆధారితంగా పనిచేస్తుంది. 20 అంగుళాల దూరంలో వున్న మొబైల్‌ని ఇది ఛార్జ్‌ చేయగలదు. ఇదొకరకమైన వైర్లెస్‌ ఛార్జెర్‌. దీని ఖరీదు 79 డాలర్లు. ఈ డివైజ్‌ విద్యార్థులకే కాక మొబైల్‌ ఉపయోగించే అందరికీ ఉపయోగకరంగా వుంటుంది.

5. Mad Glass : ఇవి స్మార్ట్‌ గ్లాసెస్‌ (కళ్లద్దాలు) అని చెప్పాలి. ఆర్గ్యుమెంటల్‌ రియల్‌ టెక్నాలజీపై ఆధారపడి వుంటుంది. ఇది నేవిగేటర్‌లా పనిచేస్తుంది. ఈ అద్భుతమైన కళ్లద్దాలను మన వాయిస్‌ ద్వారా కూడా కంట్రోల్‌ చేయొచ్చు. స్మార్ట్‌ కాల్‌, టెక్ట్స్‌ మెసేజ్‌, మల్టీమీడియా మెసేజ్‌లు కూడా ఈ కళ్లద్దాల ద్వారా పంపించొచ్చు. దీనిలో 5 మెగా పిక్సెల్‌ కెమెరా అమర్చబడి వుంటుంది. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసేటప్పుడు ఇదెంతగానో ఉపయోగపడుతుంది. ఈ కళ్లద్దాలు స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్‌ అయి ఉంటాయి. దీని ఖరీదు 850 డాలర్ల వరకూ ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Educational tools for students"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0