Expectations for the 11th PRC
ఉద్యోగుల్లో ఆశలు రేపుతున్న పే రివిజన్ లో
భారీ అంచనాల్లో ఉద్యోగులు
11వ పీఆర్ సీ కోసం ఎదురుచూపులు
భారీ అంచనాల్లో ఉద్యోగులు
11వ పీఆర్ సీ కోసం ఎదురుచూపులు
రాష్ట్రంలో ఉద్యోగులు , ఉపాధ్యాయుల వేతన సవరణ జరగడానికి నియమించిన పేరివిజన్ కమిషనర్ అందించే నివేదిక కోసం ఉద్యోగులు , ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు . ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగుల వేతనాలను పెంపుదల చేయడా నికి విశ్రాంత ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం పీఆర్సీ కమిషనర్‌గా నియమిస్తుంది . వీరు రాష్ట్రంలో ధరలు , పెరిగిన నిత్యావసర సరకుల ధరలు వంటి విషయాలను అధ్యయనం చేసి ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను ఏ మేరకు పెంపు దల చేయాలన్న విషయాన్ని అంచనా వేసి ప్రభుత్వా నికి నివేదిక అందిస్తారు . ఈ నివేదికను ఆమోదించిన త ర్వాత కమిషనర్ సిఫారసు మేరకు ఎప్పటి నుంచి ఈ వేత నాల పెంపుదల అవసరమో గుర్తించి అప్పటి నుంచి పెంపుదల చేస్తుంది . ఈ పెంపుదల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనపు భారం పడుతుంది . అయిన్పటికీ ప్రతి ఐదేళ్లకొకసారి ఈ విధంగా వేతనాల పెంపుదల జరుగుతుం ది . అందువల్ల పీఆర్సీ కమిషనర్ అందించే నివేదిక కోసం ఉద్యోగులు , ఉపాధ్యాయులు , ఇతర కార్పొరేషన్ ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు . పీఆర్సీ అమలు జరి గిన ప్రతిసారి ప్రస్తుతం ఉన్న జీతాల కన్నా కనీసం పది శాతం అయినా అదనంగా వేతనాలు పెరుగుతాయి . కొన్ని పీఆర్సీ ల సమయంలో సగానికి సగం వేతనాలు పెరిగిన సందర్భాలు కూడా ఉన్నా యి . అందువల్ల ఉద్యోగులు ఈ కమిషనర్ అందించే నివేదిక కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు . రాష్ట్ర ప్రభుత్వ పేరివిజన్ ఇప్పటి వరకు పదిసార్లు జరిగింది . ప్రతి ఐదేళ్లకొకసారి రివిజన్ జరుగుతుంది . అయితే కొంతమంది కమిషనర్ల నియామకం జరిగిన తర్వాత ఆలస్యంగా నివేదిక అందించడం వల్ల కూడా ఒకోసారి ఆలస్యం జరుగుతుంది . ప్రస్తుత కమిషనర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి అసుతోశ్ మిశ్రా నియామకం జరిగి ఏడాది పూర్తయింది . రెండు నెలల పాటు అతని ప దవీ కాలాన్ని పొడిగించారు . తాజాగా రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు అతని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిం ది . పదవీ కాలం పూర్తయ్యే లోపల ఆయన ప్రభు త్వానికి నివేదిక అందించవలసి ఉంటుంది . ఇప్పటి వరకు జైరాంబాబు , శంకర గురుస్వామి , సీఎరావు , గోనెల వంటి సీనియర్ అధికారులు కమిషనర్లుగా పని చేశారు . ఉద్యోగులకు సంబం ధించి వివిధ విషయాలను అధ్యయనం చేసి వారికి ఏది అవసరమో దానిని మంజూరు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంటారు . వారు సిఫారసు చేసిన అంశాలను తప్పనిసరిగా ప్రభుత్వం అమలు చేయవలసి ఉంటుంది . అందు వల్ల ఈ కమిషనర్లకు వారి పదవీ కాలంలో ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించవలసిన ఆర్థిక సమస్యలను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నివేదికల రూపంలో అందిస్తుంటారు . వీటిని పరిశీలించి అందులో సాధక బాధలు , ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి సిఫా రసులో పేర్కొంటారు . ఈ కమిషనర్లకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించి అవసరమైన సిబ్బందిని , కేంద్ర , రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యాలయాలు కేటాయిస్తుంది . రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను పర్యటించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది . ఈ కమిషనర్లు నివేదిక సమర్పించే వరకు , వీరి పదవీ కాలం ఉంటుంది . నివేదిక అందించిన తర్వాత నుంచి ఉండదు . ప్రస్తుత కమిషనర్ నివేదిక ఎప్పుడు అందిస్తారోనని ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు .
మధ్యంతర భృతితో అందజేత
ప్రస్తుతం అమలు చేయవలసిన 11వ వేతన సవరణ వాస్తవానికి 2018 జూలై నుంచి అమలు చేయాలి . కాని నివేదిక ఆలస్యం కావడం వల్ల ఇప్పటి వరకు అమలు కాలేదు . ఈ కమిషనర్ , పదవీ కాలం కొత్త ఏడాది ఫిబ్రవరి వరకు ఉంటుంది . ఈలోగా ఎప్పుడైనా నివేదిక అందించాలి . లేదా పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా అందించవచ్చు . ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదం తీసుకు న్న తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది . ఇవన్నీ జరగడానికి 2020 ఫిబ్రవరి నెలా ఖరు తర్వాత మరో రెండు నెలలు కాలం పట్టే అవకాశం ఉంది . అందువల్ల ఈ పీఆర్సీ సిఫారసులు అమలు చేయడానికి నియామకం జరిగిన తర్వాత రెండేళ్ల కాలం పట్టే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు . పీఆర్సీ ఆలస్యం జరుగుతున్నందున అంతవరకు ఉద్యోగుల మూల వేతనం ఎంత వస్తుందో , అందులో 27 శాతం తాత్కాలిక భృతి ( ఇంటీరియం రిలీఫ్ ) గా ఇస్తారు . పీఆర్సీ కమిషనర్ నివేదిక అందించిన తర్వాత పెరిగిన వేతనాలకు ఈ ఇంటీరియం రిలీఫ్ ను అంతవ రకు పొందుతున్న కరవు భత్యాన్ని కలిపి వేతనాన్ని నిర్ణయించవలసి ఉంటుంది . అందువల్ల ప్రస్తుతం ఉద్యోగులు పొందుతున్న వేత నాలు 27 శాతం పైబడి పెంపుడల జరిగే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి .
0 Response to "Expectations for the 11th PRC"
Post a Comment