Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Collection of details directly in schools, like the Aadhaar troubles for students .. Correction of mistakes

 విద్యార్థులకు ఆధార్‌ కష్టాలు తీరినట్లే నేరుగా పాఠశాలలలోనే   వివరాల సేకరణ.. తప్పుల సవరణ
Collection of details directly in schools, like the Aadhaar troubles for students .. Correction of mistakes

విద్యార్థులకు ఆధార్‌ కష్టాలు అన్నీఇన్నీ కావు.. పాఠశాలలో నమోదైన వివరాలతో పొంతన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యా శాఖ కూడా గందరగోళానికి గురవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రచించింది. ప్రతి పాఠశాలకు సంచార ఆధార్‌ కార్డు నమోదు, సరిచేయడానికి అవసరమైన యంత్ర సామగ్రితో నిపుణులను పంపుతోంది. కార్డులో పేర్కొన్న పేరు.. వాస్తవానికి పిలిచే పేరులో తేడాలుంటే ఏ పేరును ఖాయం చేయాలో అడిగి సరిచేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను గమనంలోకి తీసుకుని ఆధార్‌ నమోదు, తేడాలుంటే సరిచేయడంతో పాటు వేలి ముద్రలు, ఐరీష్‌ నమోదు చేస్తున్నారు. సంచార ఆధార్‌ బృందం ఏ రోజు పాఠశాలను సందర్శించేది మూడు రోజుల ముందే సమాచారం ఇస్తున్నారు.
ప్రతి విద్యార్థి ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. కాకపోతే అంతర్జాల సదుపాయం లేక పోవడం సరైన సాంకేతిక సహాయం అందక వివరాల నమోదులో కాసింత జాప్యం జరుగుతుందని సంగీత అనే నిపుణురాలు చెప్పారు. రోజుకు పాతిక మంది వివరాలు సరిచేయడమో.. నమోదు చేయడమో జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం ట్యాప్‌ట్యాప్‌, ప్రింటర్‌, వేలి ముద్రలు సహా ఐరిష్‌ గుర్తుల సేకరణ కు అవసరమయ్యే ఆధునిక యంత్ర సామగ్రి అందించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Collection of details directly in schools, like the Aadhaar troubles for students .. Correction of mistakes"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0