Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Degree .. RBI invitation! 926 Notification for replacement of Assistant Posts

డిగ్రీ ఉంటే.. ఆర్బీఐ ఆహ్వానం!
926 అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన
Degree .. RBI invitation!  926 Notification for replacement of Assistant Posts

దేశంలోనే అత్యున్నత బ్యాంకులో అసిస్టెంట్‌ పోస్టును సాధించుకునే అవకాశం వచ్చింది. సాధారణ డిగ్రీతో లభించే మంచి ఉద్యోగాల్లో ఇదొకటి. రాత పరీక్షలో ప్రతిభ చూపితే కొత్త సంవత్సరంలో కొలువు సొంతం చేసుకోవచ్చు.

బ్యాంకుల లావాదేవీలను పరిశీలించడం ఆర్‌బీఐ అసిస్టెంట్ల ప్రధాన విధి. వారానికి అయిదు పని దినాలు, తక్కువ పనివేళలు, ఒత్తిడి లేని విధులు ఆర్‌బీఐ ప్రత్యేకత. అసిస్టెంట్‌ ఉద్యోగంలో చేరినవారికి రూ. 36,000 ప్రారంభ వేతనం లభిస్తుంది. మూడేళ్ల అనుభవం తర్వాత శాఖాపరమైన పరీక్షల ద్వారా గ్రేడ్‌ ఎ, అనంతరం గ్రేడ్‌ బి స్థాయిని అందుకోవచ్చు.

డిగ్రీ ఉంటే.. ఆర్బీఐ ఆహ్వానం!

ముందుగా ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ప్రధాన పరీక్ష ఉంటుంది. ఈ దశను దాటినవారు భాషా నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాల్సివుంటుంది. ఈ మార్కులను తుది నియామకాల్లో పరిగణనలోకి తీసుకోరు. ప్రధాన పరీక్ష స్కోరుతో ఉద్యోగాలు భర్తీ అవుతాయి.

ప్రాథమిక పరీక్ష

ఈ పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. వీటిని 3 విభాగాల నుంచి అడుగుతారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 30, న్యూమరికల్‌ ఎబిలిటీలో 35, రీజనింగ్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. ఒక్కో విభాగానికి 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఇందులో అర్హత సాధించినవారికి ప్రధాన పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.

ప్రధాన పరీక్ష

200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ల్లో ప్రశ్నలు అడుగుతారు. విభాగాలవారీ కేటాయించిన సమయాల్లో వీటిని పూర్తిచేయాలి. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగానికి 25 నిమిషాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌కు 20 నిమిషాలు ఉన్నాయి. మిగిలిన ఒక్కో విభాగానికీ 30 నిమిషాల చొప్పున కేటాయించారు. మొత్తం పరీక్ష వ్యవధి 135 నిమిషాలు.
ప్రాథమిక, ప్రధాన రెండు పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నలు ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు.

లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌

మెయిన్స్‌లో అర్హత సాధించినవారికి భాషా నైపుణ్య పరీక్ష (ఎల్‌పీటీ) నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కార్యాలయానికి కేటాయించిన భాషలో ఈ పరీక్ష రాయాలి. హైదరాబాద్‌లోని 25 ఖాళీలకు మాత్రమే తెలుగు భాష పరీక్ష రాసే అవకాశం ఉంది. ముంబయి కార్యాలయంలో 419 ఖాళీలు ఉన్నాయి. వీటికి పోటీ పడడానికి మరాఠీ లేదా కొంకణి భాషలో ఉత్తీర్ణత తప్పనిసరి.

ఎలా సిద్ధం కావాలి?

ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఆ ప్రిపరేషన్‌తో ఆర్‌బీఐ పరీక్షకు హాజరుకావచ్చు. ప్రతి విభాగానికీ నిర్ణీత సమయాన్ని కేటాయించారు. అందువల్ల రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉన్న వ్యవధిలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ముందస్తు సాధన ఎంతో అవసరం. కనీసం 15 నుంచి 20 వరకు మాక్‌ పరీక్షలు రాయడం మంచిది.
ఇంగ్లిష్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ ఈ మూడు అంశాలూ ప్రాథమిక, ప్రధాన పరీక్ష రెండింటిలోనూ ఉన్నాయి కాబట్టి ఒకే ప్రిపరేషన్‌ సరిపోతుంది. జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ విభాగాలపై ప్రాథమిక పరీక్ష తర్వాత దృష్టిపెట్టవచ్చు. న్యూమరిల్‌ ఎబిలిటీ ప్రశ్నలు సులువుగా ఉన్నప్పటికీ సమాధానం రాబట్టడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. అందువల్ల తక్కువ వ్యవధిలో సమాధానం గుర్తించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సమయం మిగిలితే మిగిలినవాటి గురించి ఆలోచించాలి. కూడికలు, తీసివేతలు, భాగహారం, గుణింతాలపై పట్టు సాధించాలి. అంకెలు, సూక్ష్మీకరణపై ప్రావీణ్యం పొందితే ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు. రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి తెలియని ప్రశ్నలను వదిలేయడమే మంచిది.
జనరల్‌ మ్యాథ్స్‌, ఆంగ్లంలోని ప్రాథమికాంశాలను క్షుణ్ణంగా చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేసినవారు ప్రిలిమ్స్‌ గట్టెక్కవచ్చు. మెయిన్స్‌లో మెరవడానికి ఇవే అంశాలను లోతుగా అధ్యయనం చేస్తూ జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన అంశాలు, కంప్యూటర్స్‌పై దృష్టి పెట్టాలి.

మరికొన్ని ముఖ్యాంశాలు

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు డిగ్రీ పూర్తిచేస్తే సరిపోతుంది.
వయసు: డిసెంబరు 1, 2019 నాటికి 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే డిసెంబరు 2, 1991 కంటే ముందు; డిసెంబరు 1, 1999 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 16
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మన్‌కు రూ.50. మిగిలిన అభ్యర్థులకు రూ.450.
ప్రిలిమినరీ పరీక్షలు: ఫిబ్రవరి 14, 15 తేదీల్లో.
ప్రాథమిక పరీక్ష కేంద్రాలు:
ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, చీరాల, విజయనగరం.
తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.
మెయిన్స్‌ పరీక్షలు: మార్చిలో.
వెబ్‌సైట్‌: www.rbi.org.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Degree .. RBI invitation! 926 Notification for replacement of Assistant Posts"

Post a comment