Delays on teachers' transfers?
- బదిలీలపై జాప్యమేల?
- సుదూర ప్రాంతాల్లో ఉన్న భార్యాభర్తలకు నిరాశ
- ఉపాధ్యాయ దంపతులకు మరింత ఎడబాటు!
- సంక్రాంతి సెలవుల్లో అన్న మంత్రి హామీ హుళక్కే?
- స్థానిక ఎన్నికల తర్వాతేనని ఇప్పుడు సంకేతాలు
- ఏప్రిల్ నుంచి జనగణన.. అప్పుడూ సాధ్యం కాదు
- ఉపాధ్యాయుల్లో ఆందోళన
ఈ ఏడాది జూన్-జూలై నెలల్లో సాధారణ బదిలీలకు తెరలేపిన ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల విషయాన్ని మాత్రం విస్మరించింది. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు కోరుకున్న ఉద్యోగులందరికీ బదిలీ అవకాశం కల్పించింది. కానీ సుదీర్ఘ కాలంగా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో భార్యాభర్తలు వేర్వేరు ప్రదేశాల్లో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న వేలాదిమంది ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ఊపడం లేదు. రాష్ట్రంలో 2017 సెప్టెంబరులో టీచర్ల బదిలీలు నిర్వహించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం బదిలీలు చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వరంగ యాజమాన్య పాఠశాలల్లో దాదాపు 1.80 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు ఉపాధ్యాయ దంపతులు ఒకే జిల్లాలో 100-150 కిలోమీటర్ల దూరంలోని వేర్వేరు పాఠశాలల్లో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
ఒకే పాఠశాలలో 8 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారు దాదాపు 40 వేల మంది ఉన్నారు. డీఎస్సీ-2008 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు కేటగిరీ-3, 4 పాఠశాలల్లో చేరి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలైంది. ఒకే పాఠశాలలో 9 ఏళ్లు పూర్తయిన వారికి కేటగిరీ-3, 4 పాఠశాలల వల్ల సర్వీసు పాయింట్లు ఎక్కువ వస్తాయి. దీనివల్ల తాము కోరుకున్న, సొంత మండలంలోని పాఠశాలకు స్పౌజ్ కేటగిరీలో రావచ్చనే ఆశతో ఎంతో మంది ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీల ద్వారా ప్రాతినిధ్యం చేయించగా 2020 సంక్రాంతి సెలవుల్లో టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. దీంతో పర్ఫార్మెన్స్ పాయింట్లు ఎత్తి వేయాలని, సర్వీస్ పాయింట్ల ప్రకారమే బదిలీలు చేపట్టాలంటూ ఉపాధ్యాయ సంఘాలు పలు సూచనలు చేశాయి. అధికారులు కసరత్తు చేస్తున్నారన్న ప్రచారమూ జరిగింది. కానీ, నెల దాటినా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. తాజాగా, బదిలీలకు సీఎం సానుకూలంగా లేరన్న సమాచారంతో ఉపాధ్యాయ లోకంలో అలజడి మొదలైంది. జనవరిలో సంక్రాంతి సెలవులకు ముందే స్థానికసంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, కోడ్ కారణంగా బదిలీలు చేపట్టరాదని సర్కారు భావిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జనాభా గణన జరగనున్నందున అప్పటి నుంచి టీచర్ల బదిలీలు చేపట్టే పరిస్థితులు ఉండవు. డీఎస్సీ-2018 ఉపాధ్యాయ నియామకాలు త్వరలో చేపట్టే అవకాశం ఉంది.
వాటి కంటే ముందే బదిలీలు చేపట్టాలని టీచర్లు కోరుతున్నారు. ప్రభుత్వం సంక్రాంతిలోగా బదిలీలు చేయాలనుకుంటే వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని అమలు చేయవచ్చు. ఫలితంగా ఆన్లైన్ లో దరఖాసులు స్వీకరించవచ్చు. ఏ ఒక్క ఉపాఽధ్యాయుడూ సెలవులు పెట్టాల్సిన అవసరం ఉండదు. బదిలీ చేపట్టినా రిలీవింగ్ ఏప్రిల్ 23న చేసేలా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ లోకం కోరుతోంది.
బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి
ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ను తక్షణమే ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో), ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశాయి. ప్రభుత్వం ఈ ఏడాదికి బదిలీలు లేవని గతంలో ప్రకటించిందని, కానీ సంక్రాంతి సెలవుల్లో బదిలీలు నిర్వహిస్తామని మంత్రి స్వయంగా ప్రకటించారని ఫ్యాప్టో చైర్మన్ జి.వి.నారాయణ రెడ్డి, సెక్రెటరీ జనరల్ కె.నరహరి పేర్కొన్నారు. అయితే సంక్రాంతి సెలవుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని కోరారు.
మూలం :ఆంధ్రజ్యోతి
ఒకేసారి సమ్మర్ హాలిడేస్ లో జరిపితే సరిపోతుంది
ReplyDeleteటీచర్స్ transfers long process start చేస్తే easy గా ayipodu ఏదో ఒక విషయం పై court కు వెళుతూనే ఉంటారు
ReplyDeleteRelease immediately transfers schedule.
ReplyDeleteAll are waiting for transfor notification be stand Resptd. Edu.Mntr.Adimula Suresh garu
ReplyDelete