Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Increase the cost of construction of village secretaries

 గ్రామ సచివాలయాల నిర్మాణ వ్యయం పెంపు..
Increase the cost of construction of village secretaries

 ఒక్కొక్క యూనిట్ కు రూ.40 లక్షలు..
ఆదేశాలు జారీ చేసిన పంచాయతీ రాజ్ కమీషనర్..

 గ్రామ సచివాలయాల నిర్మాణ వ్యయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . ఒక్కొక్క గ్రామ సచివాలయ నిర్మాణ వ్యయం రూ . 35 లక్షలుగా ప్రభుత్వం నిర్ధారించింది . అయితే , 1 , 394 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్తోపాటు మొదటి అంతస్తును కూడా నిర్మించాల్సి వస్తోంది . దీంతో నిర్మాణ వ్యయం సరి పోదని నివేదికలు అందడంతో ప్రభుత్వం నిర్మాణ వ్యయాన్ని రూ . 40 లక్ష లకు పెంచింది . ఈ మేరకు పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ కమి షనర్ గిరిజాశంకర్ ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేశారు . రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 , 065 పంచాయతీలు ఉన్నాయి . ఇందులో 2 వేల జనాభా దాటిన గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యించింది . దీంతో రాష్ట్రవ్యాప్తంగా 11 , 162 సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి . ఇందులో మొదటి దశలో 3 , 710 గ్రామ సచివాలయాలకు కొత్త భవనాల నిర్మాణం ప్రారంభమైంది . ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ భవనాల నిర్మాణ వ్యయం రూ . 35 లక్షల నుంచి రూ . 40 లక్షలకు పెరిగిం ది . ఇక టైప్ - 2లో ఇప్పటికే ఉన్న సచివాలయాలపై మొదటి అంతస్తును నిర్మించనున్నారు . వీటి వ్యయాన్ని గతంలో రూ . 25 లక్షలుగా నిర్ధారించ గా . . ఆ వ్యయాన్ని మాత్రం పెంచలేదు . ఇప్పటికే ఉన్న సచివాయాలపై మొదటి అంతస్తు నిర్మించేందుకు వీలు లేనిచోట సమాంతరంగా భవనాన్ని నిర్మించడంతోపాటు దానిపై మొదటి అంతస్తు కూడా కడతారు . ఇలాంటి భవనాలను టైప్ - 3గా పేర్కొన్నారు . ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా టైప్ - 2లో 313 భవనాలు నిర్మిస్తుండగా . . . టైప్ - 3లో 24 భవనాలు కడుతున్నారు . టైప్ - 3 నిర్మాణాల వ్యయాన్ని రూ . 30 లక్షల నుంచి రూ . 35 లక్షలకు పెంచారు . మొత్తంగా రెండు దశల్లో రాష్ట్రంలోని అన్ని సచివాలయ భవనా లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Increase the cost of construction of village secretaries"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0