Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

health: How much sugar does a fruit contain?

Health : ఏ పండ్లలో ఎంత చక్కెర ఉందో తెలుసుకుందాం.


ఆరోగ్యానికి పండ్లు చాలా ఉపయోగం ఆ విషయం మానందసరికి తెలుసు కాకుంటే ఏ పండ్లు ఎలా తీసుకుంటే మంచిదో చూద్దాం
జామ

జామ : పోషకాలు పుష్కలంగా ఉండే జామకాయ తింటే ప్రొస్టేట్ కేన్సర్‌కు చెక్ పెట్టవచ్చు . పచ్చికాయలో ఫైబర్ వల్ల చిగుళ్లు , దంతాలు గట్టిపడతాయి . ఒక జామకాయలో 5 గ్రాముల చక్కెర ఉంటుంది .
మామిడిపండు

మామిడిపండు : పచ్చిదైనా , పండైనా , చివరికి ఎండిన మామిడైనా సరే . . . ఔషధ గుణాలు అలాగే ఉంటాయి . మామిడితో తయారు చేసే చూర్ణంతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి . చక్కెర మాత్రం ఇందులో ఎక్కువగానే ఉంటుంది . ఒక చిన్న మామిడిపండులో 23 గ్రాముల చక్కెర ఉంటుంది . 
దానిమ్మ

దానిమ్మ : వంద రోగాలకు ఒక్క పండు అని దానిమ్మను పిలుస్తారు . అంటే చాలా రోగాలకు దానిమ్మ చక్కగా పనిచేస్తుందని అర్ధం . అందువల్లే ఇది పండుగా కన్నా మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగపడుతోంది . 100 మిల్లీలీటర్ల దానిమ్మ రసంలో 12 . 65 గ్రాముల చక్కెర ఉంటుంది .
యాపిల్

 యాపిల్ : రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటారు కదా . అది చాలా వరకూ నిజమే . యాపిల్ గుజ్జులో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం ఆరోగ్యా నికి ఎంతో మేలు చేస్తుంది . 100 మిల్లీలీటర్ల యాపిల్ జ్యూస్లో 9.6 గ్రాముల చక్కెర ఉంటుంది .
ఆరెంజ్

ఆరెంజ్ : చూడగానే ఆకట్టుకుంటూ , రుచికరంగా ఉండే కమలాపండుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . 100 మిల్లీలీటర్ల ఆరెంజ్ జ్యూస్లో 8 . 4 గ్రాముల చక్కెర ఉంటుంది .
అవకాడో

అవకాడో : అవకాడో పండ్లు ఆరోగ్యా నికి ఎంతో మేలు చేస్తాయి . మెదడు పనితీరునే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి . వీటిలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుంది . ఒక అవకాడో పండులో కేవలం 1 గ్రాము చక్కెరే ఉంటుంది 
ద్రాక్ష

ద్రాక్ష : రుచికి రుచి . . . " ఆరోగ్యానికి ఆరోగ్యం . ఏ సీజన్లోనైనా దొరికే ఈ ద్రాక్ష. . . మనకు అవసరమైన ఐరన్ , కాపర్ , మెగ్నీషియం వంటి ఖనిజాల్ని అందిస్తుంది . చక్కెర మాత్రం ఎక్కువే . 100 మిల్లీలీటర్ల ద్రాక్ష జ్యూస్లో 14 . 2 గ్రాముల చక్కెర ఉంటుంది .
అరటి

అరటి : రోజుకో అరటి పండు తింటే శరీరానికి ఐరన్ బాగా లభిస్తుంది . అజీర్ణాన్ని తగ్గించడంలో , కడుపులోని అల్సర్లను పోగొట్టడంలో అరటి మేలు చేస్తుంది . అరటిలో ఉండే పొటాషియం నరాలను ఉత్తేజపరచి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది . కాకపోతే చక్కెర అధికం . ఒక అరటి పండులో 14 గ్రాముల చక్కెర ఉంటుంది .
స్ట్రాబెర్రీ

 స్ట్రాబెర్రీ : స్ట్రాబెర్రీ పండ్లలో ఫ్లేవనాయిడ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి . యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్టాబెర్రీసను తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు - అందుతాయి . స్ట్రాబెర్రీస్లో విటమిన్ సి , విటమిన్ ఎ , విటమిన్ కె , మెగ్నీషియం , అయోడిన్ , ఫాస్పరస్ , క్యాల్షియం , ఐరన్ వంటి పోషకాలున్నాయి . ఒక గుప్పెడు స్ట్రాబెర్రీలలో 7 గ్రాముల చక్కెర ఉంటుంది .
చెర్రీ

చెర్రీ : ఎరుపు రంగులో ఆకర్షిస్తూ , గుటుక్కుమని పించాలనిపించే చెర్రీ పండ్లు నచ్చనిదెవరికి ? నేరేడు జాతికి చెందిన ఈ పండ్లలో మంచి పోషకాలున్నాయి . మన శరీరంలో మంటలు , వాపులు , నొప్పులను తగ్గించే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు వీటిలో ఉన్నాయి . ఇవి గుండె సంబంధిత వ్యాధుల్ని దూరం చేస్తాయి . ఒక కప్పు చెర్రీస్లో 19 గ్రాముల చక్కెర ఉంటుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "health: How much sugar does a fruit contain?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0