Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

srinivasa ramanujan biography in telugu

శ్రీనివాస రామానుజం -srinivasa ramanujan biography in telugu

దేశం గర్వించదగ్గ మేధావి శ్రీనివాస రామానుజన్

20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత మేధావుల్లో శ్రీనివాస రామానుజన్ ఒకరు. అతి అపార ప్రతిభాపాటవాలతో గణిత శాస్త్రంలో అనేక కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు.
20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా పేరు సంపాందించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్. తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు. 

జీఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్‌మెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. ఆ పుస్తకంలో ఆల్‌జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్‌లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించేవాడు. 

కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ తన దృష్టి కేవలం గణితంపై కేంద్రీకరించడంతో ఎఫ్.ఎ. పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. ఆ తర్వాత మద్రాస్‌లోని వచ్చయ్యప్ప కళాశాలలో చేరి అక్కడ అధ్యాపకుడు ఎన్.రామానుజాచారి గణిత సమస్యలను కఠినంగా చెప్తుంటే, రామానుజన్ వాటిని సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించే వాడు. రామానుజన్‌ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు. 
1909లో జానకి అమ్మాళ్‌ను అనే మహిళను రామానుజన్ వివాహం చేసుకున్నారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు. 1913లో మద్రాస్ వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశాడు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్టీకి పంపాడు. 

మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్టీ రామానుజన్‌ను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్‌కు వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు. బ్రిటన్ నుంచి 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు. 

మనదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33 వ ఏట కన్నుమూశారు. బ్రిటన్‌లో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్కచేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన   ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి. 

వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. గణితశాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవం గా ప్రకటించింది. 

తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నపుడు కూడా హార్డీకి 1729 సంఖ్య ప్రత్యేకతను తెలిపి ఆయన్ని ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటన గురించి హార్డీ తన మాటల్లో ఇలా చెప్పారు: నేనోసారి రామానుజన్‌ను చూసేందుకు ట్యాక్సీలో వెళ్ళాను. దాని నెంబరు 1729. ఈ నెంబరు చూడటానికి డల్‌గా కనిపిస్తోంది ఇది దుశ్శకునమేమీ కాదుగదా అని అన్నాను. దానికి బదులుగా రామానుజన్ ఇలా అన్నాడు ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య; రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నది అని దాన్ని ఈ విధంగా విశదీకరించారు 1729 = 103+93 = 123+13. వీటిని ట్యాక్సీక్యాబ్ సంఖ్యలు అని పిలుస్తారు. గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం.
★★★★★★★★●★★★★★★★★★★★★★
శ్రీనివాస రామానుజం : గొప్ప గణితశాస్త్రవేత్త. గణితమే జీవితంగా గడిపాడు. తమిళనాడులో తంజావూరు జిల్లాలోని కుంభకోణంలో జన్మించాడు. క్రీ.శ. 1887 నుండి 1920 వరకు జీవించి ఉన్నాడు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ స్వాభిమానధనుడు, నాలుగవ తరగతి చదువుతున్నప్పుడే (Trigonometry)కి సంబంధించిన విషయాలను గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడేవాడు.
విద్యార్థి దశలోనే స్వయంకృషితో గణితశాస్త్ర సంబంధమైన అనేక కొత్త కొత్త సూత్రాలను కనిపెట్టి తెలియజెప్పేవాడు. 15 ఏండ్ల వయసులో జార్జ్ స్కూచ్ నిడ్జ్ కార్ రూపొందించిన 6000 గణిత సిద్ధాంతాలను తులనాత్మకంగా పరిశీలించాడు. గణితశాస్త్రంలో ఈయనకు గల ప్రజ్ఞను చూసి మద్రాసు విశ్వవిద్యాలయం ఈయనకు ఏ డిగ్రీ లేకపోయినాగాని నెలకు 75 రూపాయలు ఫెలోషిప్ మంజూరు చేసింది. అప్పుడే రామానుజన్ 120 గణిత సిద్ధాంతాలను కొత్తగా పొందుపరచి కేంబ్రిడ్జ్ విశ్వవిధ్యాలయం కి చెందిన ప్రొఫెసర్ జి.హచ్.హార్డీకి పంపాడు. ఆ ప్రతిభను చూసి ముగ్ధుడైన హార్టీ రామానుజంనుఇంగ్లండుకు ఆహ్వానించాడు.
1918 ఫిబ్రవరి 18న రామానుజంను ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీగా ఎన్నుకున్నారు. ఆ సంవత్సరమే రామానుజంను చాలా అరుదైన “ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్” గా కూడా ఎన్నుకున్నారు. బీజగణితంలో ఈయన సాధించిన సమీకరణాలు ప్రపంచ ప్రఖ్యాతిని పొందాయి.  ఆచార సంపన్నమైన కుటుంబంలో జన్మించిన రామానుజానికి ఇంగ్లండులో సరియైన సదుపాయాలు లేక ఆరోగ్యం దెబ్బతిని క్షయ వ్యాధిసోకి 1920లో మరణించాడు. గణితంలో ఎప్పటికప్పుడు చిత్రవిచిత్రమైన అంశాలను ఆవిష్కరిస్తూ ఉండేవాడు.ఈయనకు ఎనలేని దైవభక్తి ఉండేది. సైంటిస్ట్ అంటే నాస్తికుడే అయి ఉండాలనుకునే వారికి వీరి జీవితం కనువిప్పు కలిగిస్తుంది. గణితశాస్త్రంలో సంఖ్యా సిద్ధాంతం, అంకెల విభజన సిద్ధాంతము, భిన్నముల సిద్ధాంతమును రామానుజమే రూపొందించాడు.
మరణించే సమయంలో కూడ ఆయన బుద్ధి గణితశాస్త్ర విషయంలో కూడా చాలా చురుకుగా పనిచేసిందని చెప్పడానికి ఈ ఉదంతం తార్కాణంగా కనిపిస్తుంది. తానెక్కిన 1729 నెంబరుగల కారు పనికి మాలినదని చాలా నెమ్మదిగా నడిచిందని ఎవరో గుర్తు చేస్తే కారు ఎలాంటిదైనా, ఆ సంఖ్య చాలా మంచిది. రెండు ఘనముల మొత్తంగా ఈ సంఖ్య రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఇటువంటి సంఖ్యలో ఇదే చిన్నదని (101+91) మరియు (12×417) అనే సమీకరణాన్ని సూచించాడు. ఈయన గౌరవార్థం మద్రాసు విశ్వవిద్యాలయమువారు వారి పేరుతో ఒక అవార్డును, రామానుజం ఇనిస్టిట్యూట్ ను నెలకొల్పారు.

శ్రీనివాస రామానుజన్ గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ తెలుసుకోదగ్గ కొన్ని విషయాలు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "srinivasa ramanujan biography in telugu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0