How to change the mobile number in Aadhaar card?
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోవడం ఎలా...?
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందటానికి, ఐటీఆర్ దాఖలు, అధిక విలువ కలిగిన లావాదేవీలు, ఐడెంటిటీ గుర్తింపునకు ఆధార్ కార్డు చాలా అవసరం అవుతుంది. ఆధార్ కార్డుతో ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉండొచ్చు. ఎన్‌రోల్‌మెంట్ సమయంలో ఆధార్ వివరాల్లో తప్పులు దొర్లే అవకాశముంది. అయితే ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకు రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటేమో ఆన్‌లైన్ ప్రాసెస్. రెండోదేమో ఆధార్ కేంద్రానికి వెళ్లడం. ఆధార్ కార్డులో వివరాలను ఎక్కువసార్లు అప్‌డేట్ చేసుకోవడం కుదరదు. పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలను కేవలం 1 లేదా రెండు సార్లు మాత్రమే మార్చుకోవడానికి వీలవుతుంది.
అటుపైన మార్చుకోవాలంటే ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఇతర వివరాలను ఎన్నిసార్లైనా మార్చుకునే వీలుంది. ఆధార్ వివరాల అప్‌డేట్‌కు కొంత మేర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.50 వరకు చెల్లించాలి.
ఆధార్ నెంబర్‌కు కచ్చితంగా మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఆధార్ నెంబర్‌కు కచ్చితంగా మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉండాలి. దీంతో పలు ప్రయోజనాలు లభిస్తాయి. ఐటీఆర్ ఇవెరిఫికేషన్‌కు ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఆధార్‌తో లింక్ అయిన నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఆధార్ నెంబర్‌తో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే అప్పుడు వ్యక్తిగత వివరాలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవడం ఆన్‌లైన్‌లో కుదరదు. గతంలో ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఆధార్ నెంబర్‌లో మొబైల్ నెంబర్ ఆన్‌లైన్‌లో మార్చుకోవడం కుదరదు.
ఆధార్ సెంటర్‌కు వెళ్లి మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఆధార్ సెంటర్‌కు వెళ్లి మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవలసి ఉంటుంది. ఆధార్ అప్‌డేట్/కరెక్షన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ సెంటర్‌లో అందించాలి.
మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఇందులో అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్ అప్‌డేట్‌కు దాదాపు 10 రోజులు పట్టొచ్చు. యూఐడీఏఐ వెబ్ పోర్టల్‌లకు వెళ్లి ఆధార్ నెంబర్‌తో మొబైల్ నెంబర్ అనుసంధానమయ్యిందా?లేదా? అని సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం మై ఆధార్ ట్యాబ్‌లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్‌లోకి వెళ్లి వెరిఫై ఈమెయిల్/మొబైల్ నెంబర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి.తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ నెంబర్ వెరిఫై అవుతుంది. యూఐడీఏఐ సర్క్యూలర్ ప్రకారం.. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, పేరు, అడ్రస్, జెండర్ వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటే రూ.50 చెల్లించాలి. ఇది వరకు వీటి అప్‌డేట్‌కు రూ.25 వసూలు చేసేవారు. అంటే ఇప్పుడు చార్జీలు డబుల్ అయ్యాయి. ఆధార్ కార్డులో ఫోటో లేదా ఫింగర్‌ప్రింట్స్ అప్‌డేట్‌కు రూ.50 చెల్లాంచాలి.
0 Response to "How to change the mobile number in Aadhaar card?"
Post a Comment