How to get out of the cellphone craze?
సెల్‌ఫోన్ వ్యామోహం నుంచి బయట పడడం ఎలా? How to get out of the cellphone craze?
మన ఫోన్ మన దృష్టిని మళ్లిస్తుందని మనమనుకుంటే ఎలా? మొబైల్ ఫోన్ మన సౌకర్యార్ధమే ఉంది.
మన ఫోన్ మన దృష్టిని మళ్లిస్తుందని మనమనుకుంటే ఎలా? మొబైల్ ఫోన్ మన సౌకర్యార్ధమే ఉంది.
సాంకేతికంగా మనకు సాధికారాన్ని అందించి, మన కార్యకలాపాలను సులభం చేసి, మన జీవనాన్ని మెరుగుపరిచేది ఫోను. దాని సహాయంతో చేయవలసిన పని మనం తొందరగా చేస్తే మిగిలిన పనులకు ఎక్కువ సమయం లభిస్తుంది కదా. రెండు దశాబ్దాల కిందట మన భారత దేశంలో ఒక లాంగ్ డిస్టన్స్ కాల్ చేయాలంటే ఎంత కష్టంగా ఉండేదో మరి ఆ రోజుల్లో చేత్తో డయల్ చేయవలసిన అవసరం. ఇవ్వాళ ఫోన్‌కాల్స్ చేయాలి అని నిర్ణయించుకున్నతరువాత డయల్ చేయవలసిన అవసరం కూడా లేదు పేరు చెప్తే చాలు ఫోన్ కాల్ చేస్తుంది.
ఇటువంటి సౌకర్యం వలన ఆనందించడానికి బదులు, మనం ఫిర్యాదు చేస్తున్నాము. అదొక సమస్యగా ఇప్పుడు పరిణమిస్తుందంటే, ఏదైనా చేయడం ప్రారంభించిన తరవాత దానిని ఎక్కడ ఆపాలో అన్నది మనకు తెలియక పోవడం వల్లనే అవి ఎంత చిన్న పనులైనా సరే. ఉదాహరణకు మనం తినడం మొదలుపెడితే ఎక్కడ ఆపాలో మనకు తెలియదు. అసలు సమస్య మనకున్న సౌకర్యాలతో కాదు అసలు సమస్య, మనకు స్పృహ లేకపోవడమే.
మన జీవితాలను మెరుగుపరిచే పరిష్కారాలుగా ఉండవలసిన విషయాలను, మనం మన అజ్ఞానం వల్ల సమస్యలుగా మార్చుకుంటున్నాం.
వాట్స్ యాప్ నిరంతరం మోగుతూ ఉంటే
వాట్స్ యాప్ నిరంతరం మోగుతూ ఉంటే మనం కదలకుండా కూర్చోవడం సాధ్యమా అన్నది ఇప్పుడు మన ప్రశ్న? ఇది సాధ్యమే. మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవచ్చు. మన జోక్యం లేకుండా ప్రపంచం ఎంతో చక్కగా నడుస్తుంది.
మనం మన ఫోన్ ఆపివేస్తే ఈ విషయం మనకు ఇప్పుడే అర్థమవుతుంది. మనం ఇది అర్థం చేసుకుంటే మరింత అర్థవంతంగా చాలా పనులు చేస్తాము. మనం ప్రపంచంతో ఎక్కువ జోక్యం చేసుకోకుండా ఉంటే ప్రజలు సంతోషిస్తారు. మనం అతిగా జోక్యం చేసుకుంటూ ఉంటే, మనం మరణించినప్పుడు సంతోషిస్తారు.
మనం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాం ఉదాహరణకు ఇంటిలో ఉంటే టి వి చూడాలి లేదా టివి మోగుతూ ఉండాలి అని అనుకుంటం ఆన్ చేసి వదిలేస్తాం, ఒకవేళ ఇంటిలో ఆ సమయం లో పిల్లలు ఉంటే వాళ్ళూ అలానే అలవాటయి ఆటలు చదువు మాని దృష్టి మొత్తం టివి వైపు వెళుతుంది. ఎదో వార్తలో లేక ప్రత్యేక కార్యక్రమాలో ఇంకా ఎవో మంచి కార్యక్రమాలు చూడటానికి టివి తప్ప రోజంతా టివి చూడటానికి టివి కాకూడదు దాని వలన దాన్ని కనుక్కొన్న వారి విలువ తగ్గించినట్టవుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు అనేకం ఉన్నాయి మన ఆలోచన ద్వారా వాటిని అదుపులో పెట్టుకోవచ్చు అది మన చేతుల్లోనే ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి ఏది ఎంత వరకు ఉపయోగించుకోవాలి అనే స్పృహ మనకు ఉంటే చాలు అన్నీ మన అధీనంలో ఉంటాయి.
0 Response to "How to get out of the cellphone craze?"
Post a Comment