Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

'YSR pension scheme is eligible for this scheme. . !

' వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి అర్హతలు ఇవే . . ! 
'YSR pension scheme is eligible for this scheme. . !

 రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది . 
ఇందులో భాగంగా ' వైఎస్సార్ పెన్షన్ కానుక ' పథకంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే . పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఫించను పెంచిన జగన్ . . . పింఛను అర్హత వయసును కూడా తగ్గించింది . పింఛనును రూ . 2250లకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన తొలి హామీకి సంబంధించి జీవోను కూడా విడుదలచేసింది . అయితే తాజాగా ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి . . ఇది వరకు జారీ చేసిన జీవోలో పేర్కొన్న కొన్ని అర్హత నిబంధనలను సవరించి సరికొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం . వైయస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల ఎంపికకు నిర్ధారించిన అర్హతలు.

అర్హతలు

  •  గ్రామీణ ప్రాంతాల వారికి ప్రతి నెలా రూ 10 వేలు , పట్టణ ప్రాంతాలలో రూ12 వేల లోపు నెలసరి ఆదాయం కలిగి ఉండాలి . 
  • నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల లోపు తరి , లేదా పది ఎకరాల మెట్ట , లేదా రెండూ కలిపి పది ఎకరాలలోగా కలిగి ఉండాలి . 
  •  టాక్సీ , ట్రాక్టర్లు , ఆటోలు మినహాయించి నాలుగు చక్రాల వాహనాలు ఉండరాదు .
  • కుటుంబంలో పెన్షనర్ గానీ ప్రభుత్వ ఉద్యోగి గానీ ఉండరాదు . 
  •  ప్రతి నెలా కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించరాదు .
  •  కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు . 
  • కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ కానుకకు అర్హులు . 
  • ఐతే 80 శాతం అంగవైకల్యం గల దివ్యాంగులు , డయాలసిస్ పేషంట్లు , మానసికంగా తీవ్రంగా బాధపడుతోన్న వారు ఫ్యామిలీలో ఉంటే,వారికి కూడా పింఛన్ లభిస్తుంది . 
  • ఆయా కెటగిరీల వారీగా అర్హతలు. 60 సంవత్సరాల వయసు పైబడిన నిరుపేదలు 
  •  ఎస్సీ కేటగిరీకి చెందిన వారి వయసు 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి 
  • 18 ఏళ్లు దాటిన వితంతువులు . 
  •  చనిపోయిన భర్త గురించి ధృవీకరణ పత్రం విధిగా ఉండాలి . 
  • దివ్యాంగులకు నో ఏజ్ లిమిట్ . 
  • అయితే  40 శాతం పైగా దివ్యాంగులుగా ఉండాలి . 
  •  50 సంవత్సరాలు పై బడిన చేనేతలు . చేనేత శాఖ నుంచి ధృవీకరణ పత్రాన్ని విధిగా సమర్పించాలి . 
  • 50 సంవత్సరాల పైబడి వయసు కలిగిన గీతకార్మికులు . 
  • ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి .
  • ఆరు నెలలుగా యాంటీ రాజో వైరల్ తెరపీ ట్రీట్మెంటు తీసుకునే వారు కూడా పథకానికి అర్హులు . 
  • ప్రతి నెలా ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకుంటున్న రోగులు . 
  •  18 సంవత్సరాల వయసు పైబడిన ట్రాన్స్ జెండర్లు . 
  • వైద్య శాఖ సర్టిఫికెట్ విధిగా కలిగి ఉండాలి . 
  • మత్స్య శాఖ నుంచి సర్టిఫికెట్ పొందిన 50 సంవత్సరాల పైబడిన మత్స్యకారులు . 
  •  వివాహమై విడిపోయిన ఒంటరి మహిళలు . 
  • 35 సంవత్సరాల వయసు పై బడి , తరువాత విడిపోయిన మహిళలు , ఏడాది పాటు సెపరేషన్‌గా ఉన్న మహిళలు , 30 సంవత్సరాల వయసుండి వివాహం కాని వారు .
  •   50 సంవత్సరాల పైబడి వయసున్న డప్పు కళాకారులు . 
  • సంక్షేమ శాఖ ధృవీకరణ పత్రాలు కలిగిఉండాలి . 
  • 40 సంవత్సరాల వయసున్న చర్మకారులు . తలసేమిమా , సికిల్ సెల్ డిసీజ్ , మేమోఫీలియా వ్యాధిగ్రస్థులు 
  • వీల్ చేరే కే పరిమితమైన పెరాలిసిస్ రోగులు , ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు , మస్కులర్ డైస్ట్రోఫీ వ్యాధిగ్రస్థులు , క్రానిక్ కిడ్నీ పేషెంట్లు .  ' వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి అర్హతలు ఇవే . . !

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "'YSR pension scheme is eligible for this scheme. . !"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0