ISRO Jobs 2019: ISRO releases new notification with 63 more vacancies.
ISRO Jobs 2019 : మరో 63 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన ఇస్రో.
ISRO Jobs 2019 దరఖాస్తుకు 2020 జనవరి 1 చివరి తేదీ . ఆసక్తిగల అభ్యర్థులు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అధికారిక వెబ్సైట్ www . vssc . gov . in ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు .
ISRO Jobs 2019 దరఖాస్తుకు 2020 జనవరి 1 చివరి తేదీ . ఆసక్తిగల అభ్యర్థులు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అధికారిక వెబ్సైట్ www . vssc . gov . in ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు .
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్-VSSC సంస్థలో 63 ఖాళీలను భర్తీ చేస్తోంది ఇస్రో. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ లాంటి విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 1 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అధికారిక వెబ్సైట్ www.vssc.gov.in ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 63
టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్- 28
టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్- 20
టెక్నికల్ అసిస్టెంట్ కెమికల్- 3
టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్- 2
టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్- 1
టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్- 1
టెక్నికల్ అసిస్టెంట్ సినిమాటోగ్రఫీ / ఫోటోగ్రఫీ- 1
సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్- 2
సైంటిఫిక్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్- 1
సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీ- 1
లైబ్రరీ అసిస్టెంట్ ఏ- 3
ISRO RECRUITMENT 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 18 ఉదయం 10 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 1 సాయంత్రం 5 గంటలు
వయస్సు- 2019 డిసెంబర్ 30 నాటికి 18 ఏళ్లు నుంచి 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.250. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజులో మినహాయింపు.
0 Response to "ISRO Jobs 2019: ISRO releases new notification with 63 more vacancies."
Post a Comment