Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Indian railways: Indian Railways good news for young people. . . 50 per cent discount on train tickets

Indian Railways : యువతకు భారతీయ రైల్వే శుభవార్త . . . రైలు టికెట్లపై 50 శాతం తగ్గింపు
Indian railways: Indian Railways good news for young people. . . 50 per cent discount on train tickets

Indian Railways Ek | Bharat Shrestha | Bharat programme | ఒక స్టేషన్ దగ్గర్నుంచి మరో స్టేషను 300 కిలోమీటర్ల పైన సెకండ్ , స్లీపర్ క్లాస్ మెయిల్ , ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో ప్రయాణించేవారికి రాయితీతో టికెట్లను ఆఫర్ చేయనుంది భారతీయ రైల్వే .

యువతకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించే యువతీయువకులకు రైలు టికెట్ల బేసిక్ ధరపై 50% రాయితీని ప్రకటించింది. నెలకు రూ.5,000 కన్నా తక్కువ సంపాదిస్తున్నవారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ రైలు టికెట్లపై ఈ రాయితీని ఉపయోగించుకోవచ్చు. అది కూడా సాధారణ రైలు సర్వీసులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక కోచ్‌లకు ఈ రాయితీ వర్తించదు. ఒక స్టేషన్ దగ్గర్నుంచి మరో స్టేషన్‌కు 300 కిలోమీటర్ల పైన సెకండ్, స్లీపర్ క్లాస్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రయాణించేవారికి రాయితీతో టికెట్లను ఆఫర్ చేయనుంది భారతీయ రైల్వే. రాయితీ కేవలం బేసిక్ ఫేర్‌పైన మాత్రమే. రిజర్వేషన్ ఛార్జీలు, ఇతర ఛార్జీలు యథాతథంగా ఉంటాయి.

ఆయా రాష్ట్రాలకు చెందిన మానవ వనరుల అభివృద్ధి శాఖ సెక్రెటరీ నుంచి సూచించిన ఫార్మాట్‌లో సర్టిఫికెట్ పొందినవారు మాత్రమే రాయితీపై టికెట్లను పొందొచ్చు. ఆ సర్టిఫికెట్‌ను చీఫ్ కమర్షియల్ మేనేజర్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లాంటి రైల్వే అధికారులకు సమర్పించాలి. ఆ తర్వాత రాయితీ కల్పిస్తూ ఆదేశాలు వస్తాయి. ఆ తర్వాత రైళ్లల్లో రాయితీపై టికెట్లు తీసుకోవచ్చు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాల రవాణా ఖర్చులతో ప్రయాణించేవారికి ఈ రాయితీ వర్తించదు.


Ministry of Railways
@RailMinIndia


In order to facilitate the travel of youth participants of “Ek Bharat Shrestha Bharat” program, IR has decided to grant 50%concession in basic fares to youths with earnings of not more than Rs.5000/-per month for travelling from one State to another 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Indian railways: Indian Railways good news for young people. . . 50 per cent discount on train tickets"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0