Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

lIC: LIC is good news for those with policies

LIC: పాలసీలు ఉన్నవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్
lIC: LIC is good news for those with policies

మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? మీరు గడువులోగా ప్రీమియం చెల్లించలేదా? అయితే మీకు శుభవార్త. ఇకపై క్రెడిట్ కార్డుతో ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. 2019 డిసెంబర్ 1 నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. గతంలో క్రెడిట్ కార్డుతో ఎల్ఐసీ పేమెంట్స్ చేస్తే కన్వీనెన్స్ ఫీజ్ చెల్లించాల్సి వచ్చేది. ఈ ఫీజును తొలగించింది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్. క్రెడిట్ కార్డులు మాత్రమే కాదు... ఆన్‌లైన్‌లో మీరు జరిపే పేమెంట్స్‌కి ఈ ఫీజు ఉండదు. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుమార్లు ఆదేశాలు జారీ చేయడంతో ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రీమియం, రెన్యూవల్ ప్రీమియం, లోన్ రీపేమెంట్, రుణాలపై వడ్డీ చెల్లించేందుకు క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తే ఇకపై ఛార్జీలు ఉండవు.
ఎల్ఐసీ ప్రీమియం చెల్లించే ప్రతీ కౌంటర్‌లో ఇది వర్తిస్తుందని స్పష్టత ఇచ్చింది ఎల్ఐసీ.

సో... ఇకపై మీరు క్రెడిట్ కార్డుతో లేదా ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ ప్రీమియం చెల్లించాలనుకుంటే కన్వీనెన్స్ ఫీజు ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక మరోవైపు ఎల్ఐసీ త్వరలో కొత్త పాలసీలను తీసుకురానుంది. ఇప్పుడు ఉన్న కొన్ని పాలసీలను కొత్త నియమనిబంధనలతో పునరుద్ధరించనుంది. వాస్తవానికి డిసెంబర్ 1 నుంచే కొత్త పాలసీలు రావాల్సి ఉంది. కానీ పాత పాలసీలు నిలిపివేసేందుకు ఇన్స్యూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI మరో రెండు నెలలు గడువు ఇచ్చింది. 2020 జనవరిలో కొత్త పాలసీలు వస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "lIC: LIC is good news for those with policies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0