Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Training of teachers on English .. Invitation for applications for Resource Persons ..

ఆంగ్లంపై ఉపాధ్యాయులకు శిక్షణ..
రిసోర్స్ పర్సన్స్ కోసం దరఖాస్తులకు ఆహ్వానం..
 6 నుంచి 8 తరగతుల ఉపాధ్యాయులకూ శిక్షణ..
డైట్ సెంటర్లలో శిక్షణ..
మ్యాథ్స్, సైన్సులోనూ శిక్షణ..
జిల్లాల వారీగా శిక్షణ తరగతులు...
Training of teachers on English ..  Invitation for applications for Resource Persons ..

 రాబోయే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభించ నున్నారు . అందుకోసం ఉపాధ్యాయులలో ఆంగ్ల భాషా బోధన నైపుణ్యాలు పెంచేం దుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది . విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన రీతిలో బోధించేలా చర్యలు చేపడుతోంది . ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . ఆంగ్ల మాధ్యమ ఇన్‌స్ట్రక్షన్ సెల్ ప్రత్యే కాధికారి కె . వెట్రిసెల్వి ఆంగ్ల మాధ్యమంలో బోధనా నైపుణ్యాలున్న అధ్యాపకులు రిసోర్స్ పర్సన్లుగా శిక్షణనిచ్చేందుకు దరఖాస్తు చేసు కోవాలని సూచించారు . ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖా ధికారులకు రిసోర్స్ పర్సన్ల ఎంపిక కోసం దరఖాస్తులు వచ్చేలా చూడాలని సూచనలు చేశారు . మరోవైపు ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యం లో ఉపాధ్యాయుల కోసం టీచర్ హ్యాండ్ బుక్స్ రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించింది . 

భాషా నైపుణ్యాల అంచనా కోసం ఆన్ లైన్ టెస్ట్ . . 


రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆంగ్ల భాషా నైపు ణ్యాలపై ఒక అంచనా రూపొందించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు . పాఠశాల విద్యా శాఖ కమిషనర్ , ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ సమన్వయంతో ఈ ఆన్లైన్ టెస్టు రూపకల్పన చేయనున్నారు . టెస్ట్ ఆధారంగా గడింగ్ చేసి అవసరమైన టెస్ట్ మెటీరియల్ అందించనున్నారు . అలాగే ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఉపాధ్యాయులందరికీ ఆంగ్ల భాషలో బోధనపై తరగతులు నిర్వహించనున్నారు . ప్రస్తుతం ఉన్న నైపుణ్యాల ఆధారంగానే శిక్షణ కార్యక్రమాల రూపకల్పన జరగనుంది .

 డైట్ సెంటర్లలో శిక్షణ

 ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల్లోని ఆంగ్ల బోధనా నైపుణ్యాలను పరిశీలించి , వారిని బోధనకు తగినట్లుగా సిద్ధం చేసేలా శిక్షణనిప్పిం చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు . ఇందుకోసం ప్రత్యేకంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు , డిస్ట్రిక్ట్ ఇంగ్లిష్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు . ఇప్పటికే జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఇన్స్టి ట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ ( డైట్ ) కళాశాలలను ఇంగ్లిష్ ట్రెయినింగ్ సెంటర్లుగా ఉపయోగించుకోనున్నారు . అలాగే శిక్షణ కార్య క్రమంలో ప్రభుత్వ ,మండల పరిషత్ , జిల్లా పరిషత్ , / మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయు లను భాగస్వాములను చేస్తున్నారు . ఈ నెల 9వ తేదీ నుంచి శిక్షణ కార్య క్రమాల్లో పాల్గొనా లని ఇప్పటికే విద్యా శాఖలోని ఆయా విభాగాల ఉన్నతాధి కారులకు సమాచారం అందించా రు . అన్ని జిల్లాల విద్యా శాఖాధి కారులు రెండు రోజుల్లో రిసోర్స్ పర్సన్స్ నుంచి దరఖాస్తులు అందేలా చూడాలని ఆంగ్ల మాధ్య మ ప్రత్యేకాధికారి వెట్రిసెల్వి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు . 

    మ్యాథ్స్ సైన్స్ లోనూ శిక్షణ -


 * ప్రాథమిక పాఠశాలల ఉపా ధ్యాయులకు ఆంగ్ల బోధనలో శిక్షణ కార్య క్రమాలకు రూపకల్పన చేస్తూనే . . మరోవైపు 6 నుంచి 8వ తరగ తులకు బోధించే ఉపాధ్యా యులకు  మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో శిక్షణ తరగతు లను జిల్లాలవారీగా ఈ నెల నుంచి ప్రారంభించనున్నారు . ఇందుకోసం ఇన్ఫోసిస్ , అగస్త్య ఫౌండేషన్లతో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది . ఒక్కో జిల్లా నుంచి అన్ని విభాగాల పాఠ శాలల నుంచి కలిపి 150 మంది ఉపాధ్యాయులు చొప్పున ఎంపిక చేసి నాలుగు రోజుల శిక్షణ అందించనున్నారు . 150 మంది ఉపాధ్యా యుల్లో 50 మంది మ్యాథ్స్ , 50 మంది ఫిజికల్ సైన్స్ , మరొక 50 మంది బయోలాజికల్ సైన్స్ బోధించేవారు ఉంటారు .

జిల్లాల వారీగా శిక్షణా తరగతులు


డిసెంబర్ 17 నుంచి 20 వరకు కడప జిల్లాలో , 26 నుంచి 29 వరకు చిత్తూరు జిల్లాలో , జనవరి 2 నుంచి 5 వరకు నెల్లూరు , 20 నుంచి 23 వరకు అనంతపురము , 27 నుంచి 30 వరకు కర్నూలు , ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు ప్రకాశం , 10 నుంచి 13 వరకు గుంటూరు , 17 నుంచి 20 వరకు కృష్ణా జిల్లాలో , 24 నుంచి 27 వరకు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి . పరీక్షలు , వేసవి సెలవుల అనంతరం జూన్ 22 నుంచి 25 వరకు + తూర్పుగోదావరి , జూన్ 29 నుంచి జూలై 2 వరకు విశాఖపట్నం , 6 నుంచి 9 వరకు విజయనగరం , 13 నుంచి 16 వరకు శ్రీకాకుళం జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Training of teachers on English .. Invitation for applications for Resource Persons .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0