Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PAN - Aadhaar Link: Lost date of 31st December to make PAN - Aadhaar link

PAN - Aadhaar Link : పాన్ - ఆధార్ లింక్ చేయడానికి డిసెంబర్ 31 లాస్ట్ డేట్
pAN - Aadhaar Link: Lost date of 31st December to make PAN - Aadhaar link

PAN - Aadhaar Linking | డిసెంబర్ 31 లోగా ఎవరైనా పాన్ - ఆధార్ లింక్ చేయాల్సిందే . లేకపోతే ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని , వాటిని ఉపయోగించడానికి వీల్లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యా క్సెస్ - CBDT  ప్రకటించే అవకాశముంది .

  • మీరు మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారా? 
  • ఇంకా లింక్ చేయలేదా? పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. పాన్ కార్డు ఉన్నవాళ్లందరూ తమ ఆధార్ నెంబర్లను పాన్ కార్డుతో లింక్ చేయాల్సిందే. పాన్-ఆధార్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా చెబుతోంది. 
  •  అనేక సార్లు డెడ్ లైన్స్ విధించింది. ఇప్పటికే 7 సార్లు చివరి తేదీలను పొడిగించింది.
  •  డిసెంబర్ 31 చివరి తేదీ అని కొంతకాలం క్రితమే ప్రకటించింది. అయినా ఇప్పటివరకు పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయనివాళ్లున్నారు.
  •  ఈసారి ప్రభుత్వం చివరి తేదీ పొడిగించే అవకాశం కనిపించట్లేదు. 
  • డిసెంబర్ 31 లోగా ఎవరైనా పాన్-ఆధార్ లింక్ చేయాల్సిందే. లేకపోతే ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని, వాటిని ఉపయోగించడానికి వీల్లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT ప్రకటించే అవకాశముంది.
  •  డెడ్‌లైన్ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 'పనిచేయనివి'గా గుర్తించాలని ఫైనాన్స్ బిల్లులో సైతం వెల్లడించింది ప్రభుత్వం
  • పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి 4 మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోండి

1. SMS: 

మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు 567678 లేదా 56161 నెంబర్లకు కింద సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి.

UIDPAN<12 అంకెల ఆధార్><10 అంకెల పాన్>
ఉదాహరణ: UIDPAN 111122223333 AAAPA9999Q

2. Online: 

incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయొచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 'Linking Aadhaar' లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో ఆధార్‌కార్డుపై ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.

3. Income Tax Returns (ITR):

 మీరు ఇ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా మీ పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. NSDL (tin-nsdl.com), UTIITSL (utiitsl.com) వెబ్‌‌సైట్లల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసేప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలి.

4. PAN Card Application: 

ఇక కొత్తగా పాన్ కార్డు తీసుకునేవాళ్లు, పాన్ కార్డులో మార్పులు చేయించేవాళ్లు దరఖాస్తులోనే ఆధార్ నెంబర్ వివరిస్తే సరిపోతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PAN - Aadhaar Link: Lost date of 31st December to make PAN - Aadhaar link"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0