Premium of Rs. 1 / - per day. Coverage of Rs. 2 Lakhs. Let us know about this central government scheme.
రోజుకు రూ.1/- లోపే ప్రీమియం.. రూ.2 లక్షల కవరేజీ.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసుకుందాం.
2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత.. సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా సోషల్ స్కీమ్స్.. ముఖ్యమైనవి. అందులో భాగంగా.. దేశంలోని నిరు పేదల కోసం పలు బీమా పథకాలను ప్రకటించింది. అందులో ముఖ్యంగా.. అందరికీ జీవిత బీమా ఉండాలన్న ఉద్దేశంతో.. కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకంలోని లాభాలేంటి.. ఈ బీమాను ఏలా పొందాలి అన్నదాని గురించి తెలుసుకోండి.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేవై)
పీఎంజేజేవై.. ఇది ఒక జీవిత బీమా పథకం. ఈ బీమా స్కీంలో చేరాలంటే..
18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఈ బీమా ప్రీమియం రోజుకు ఒక్క రూపాయి కంటే తక్కువే. ఈ స్కీంలో చేరాలంటే.. ఆ వ్యక్తికి ఏదైనా బ్యాంకులో ఖాతా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా జన్ ధన్ యోజన అకౌంట్ ఉన్న వారికి ఇంకా సులభం. ఎందుకంటే.. పీఎంజేడీవై అకౌంట్స్ ఉన్న వారు.. బ్యాంకు మిత్ర ద్వారా.. సులభంగా ఈ స్కీంలో చేరవచ్చు. ఈ ప్రీమియం ధర కేవలం ఏడాదికి రూ.330 మాత్రమే. బీమీ కవరేజ్ రూ.2లక్షలు. ఈ బీమా పథకంలో చేరిన వ్యక్తి.. కవరేజ్ ఉన్న సమయంలో ఏ కారణం వల్లనైనా చనిపోతే.. నామినీకి రూ. 2లక్షలు అందజేస్తారు. అయితే ఈ బీమా ప్రీమియం ఒక అకౌంట్ నుంచి మాత్రమే చెల్లించాలి. మూడు నాలుగు సేవింగ్స్ అకౌంట్స్ ఉండి.. అన్ని అకౌంట్ల నుంచి ప్రీమియం కట్టినా.. క్లెయిమ్ మాత్రం ఒకటే ఉంటుంది. కాబట్టి.. ఒకే అకౌంట్ నుంచి ఈ ప్రీమియం కట్టాలి. ఇక రూ.330/- ప్రతి ఏడాది చెల్లించాలి. ప్రీమియం చెల్లించిన ఏడాది మాత్రమే.. ఈ బీమా కవరేజీ ఉంటుంది. బీమా కవరేజీ పీరియడ్.. జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది. ఇక ప్రీమియం చెల్లింపుకు బ్యాంకు ఖాతాలో అటో డెబిట్ సదుపాయం ఉంటుంది. మొత్తానికి ఈ బీమా పథకం.. సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
0 Response to "Premium of Rs. 1 / - per day. Coverage of Rs. 2 Lakhs. Let us know about this central government scheme."
Post a Comment