Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Gold Scheme:  Interest can be earned if your jewelery is deposited in SBI Let us know about this scheme

SBI Gold Scheme: మీ నగలు డిపాజిట్ చేస్తే ఎస్‌బీఐ నుంచి వడ్డీ... ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం.
www.APEdu.in 6.:30AM 31.12.2019
SBI Revamped Gold Deposit Scheme మీరు మీ అమ్మాయి పెళ్లి కోసం ఇప్పుడే బంగారం కొని పెట్టుకున్నారా? భవిష్యత్తులో అవసరం ఉంటుందని గోల్డ్ కొని పెట్టుకున్నారా? ఆ బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే మీకు వడ్డీ లభిస్తుంది. ఆ బంగారాన్ని లాకర్‌లో భద్రపర్చుకోవడం కంటే ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే ఏటేటా వడ్డీ పొందొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ స్కీమ్ గురించి తెలుసుకొందాం

  • 1. బంగారం... భారతీయులకు పెట్టుబడి సాధనం మాత్రమే కాదు సెంటిమెంట్ కూడా. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సందర్భంలో బంగారం కొనుగోలు తప్పనిసరి. పిల్లల పెళ్లిళ్ల కోసం కొన్నేళ్ల ముందే బంగారం కొని భద్రపర్చుకోవడం చాలామందికి అలవాటు
  • 2. మీ ఇంట్లో వాడుకలో లేని బంగారాన్ని బీరువాలో భద్రపర్చడం కంటే బ్యాంకులో దాచుకుంటే ఇంకా భద్రంగా ఉండటంతో పాటు వడ్డీ కూడా లభిస్తుంది. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేకమైన డిపాజిట్ స్కీమ్‌ను అందిస్తోంది
  • 3. ఎస్‌బీఐ అందిస్తున్న ఈ స్కీమ్‌ గురించి తెలిసినవాళ్లు తక్కువే. మామూలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే మీ దగ్గరున్న డబ్బును డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ వస్తుంది. అలాంటిదే గోల్డ్ స్కీమ్ కూడా. మీ దగ్గర అవసరం లేకుండా ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ పొందొచ్చు. అదే రివాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్.
  • 4.డిపాజిట్ స్కీమ్‌లో ఎవరైనా బంగారాన్ని డిపాజిట్ చేయొచ్చు. మరి R-GDS స్కీమ్‌ గురించి, దాని వల్ల మీకు వచ్చే లాభాలేంటో వివరంగా తెలుసుకోండి.
  • 5. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం R-GDS స్కీమ్‌‌లో ఎవరైనా కనీసం 30 గ్రాముల బంగారాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. బంగారం బిస్కెట్లు, నగల రూపంలో బంగారాన్ని దాచుకోవచ్చు. ఈ స్కీమ్ మూడు రకాలుగా ఉంటుంది.
  • 6. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (STBD): 1-3 ఏళ్ల కాలవ్యవధి. ఇందులో ఏడాదికి 0.50 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల వరకు 0.55 వడ్డీ, 2-3 ఏళ్ల వరకు 0.60 శాతం వడ్డీ పొందొచ్చు.
  • 7. మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (MTGD): 5-7 ఏళ్ల కాలవ్యవధి. ఇందులో వార్షికంగా 2.25 శాతం వడ్డీ పొందొచ్చు.
  • 8. లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (LTGD): 12-15 ఏళ్ల కాలవ్యవధి. ఇందులో వార్షికంగా 2.5 శాతం వడ్డీ పొందొచ్చు.
  • 9. ఈ స్కీమ్‌లో వచ్చే వడ్డీని మార్చి 31న లేదా మెచ్యూరిటీ తర్వాత పొందొచ్చు. R-GDS స్కీమ్‌‌లో ఇప్పటివరకు ఎస్‌బీఐ చెల్లించిన వడ్డీ వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.
  • 10. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (STBD) స్కీమ్‌లో ఒక ఏడాది, మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (MTGD) స్కీమ్‌లో మూడేళ్లు, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (LTGD) స్కీమ్‌లో ఐదేళ్లు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.
  • 11. లాక్-ఇన్ పీరియడ్ తర్వాత ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. పిల్లల పెళ్లిళ్ల కోసమో, లేదా పెట్టుబడి రూపంలోనో ఇంట్లో బంగారం దాచుకున్న వారికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Gold Scheme:  Interest can be earned if your jewelery is deposited in SBI Let us know about this scheme"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0