SBI that told the good news. Draw Money with OTP at ATM
SBI : గుడ్ న్యూస్ చెప్పిన SBI. ఏటీఎంలో ఓటీపీతో డబ్బులు డ్రా చేయండి ఇలా ఒక కొత్త విధానం.
SBI OTP - based cash withdrawal ATM లలో అనధికార లావాదేవీలు పెరిగిపోతుండటంతో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది SBI. 10 వేల రూపాయల కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే OTP తప్పనిసరి చేసింది SBI.
SBI OTP - based cash withdrawal ATM లలో అనధికార లావాదేవీలు పెరిగిపోతుండటంతో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది SBI. 10 వేల రూపాయల కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే OTP తప్పనిసరి చేసింది SBI.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయాలంటే వన్ టైమ్ పాస్‌వర్డ్-OTP తప్పనిసరి. 2020 జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. ఇప్పటికే కెనరా బ్యాంకు ఏటీఎంలల్లో ఇదే విధానం ఉంది. దేశంలోని ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఇది వర్తిస్తుంది. 2020 జనవరి 1 నుంచి మీరు ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ నియమం వర్తిస్తుంది. ఏటీఎంలల్లో అనధికార లావాదేవీలు పెరిగిపోతుండటంతో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఎస్‌బీఐ. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి చేసింది SBI
ఉదాహరణకు మీరు ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు రాత్రి 8 గంటల తర్వాత వెళ్లారనుకుందాం. మీరు కార్డు ఇన్సర్ట్ చేసి పిన్ ఎంటర్ చేస్తే సరిపోదు. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయి. అంటే మీరు కార్డు ఇన్సర్ట్ చేసి ఓటీపీ తప్పనిసరిగా టైప్ చేయాలి. అప్పుడే డబ్బులు డ్రా అవుతాయి. దీని వల్ల కస్టమర్ల ఖాతాలకు మరింత సెక్యూరిటీ లభించినట్టే. మీ కార్డు పోగొట్టుకున్నా, వారికి పిన్ తెలిసినా డబ్బులు డ్రా చేయలేరు. అయితే ఈ విధానం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది.
0 Response to "SBI that told the good news. Draw Money with OTP at ATM"
Post a Comment