Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Special GPF for municipal staff

మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక జీపీఎఫ్..
 ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగం..
 పాత పీఎఫ్ విధానానికి కొత్త మెరుగులు..
 ఉపయోగాలు ఇవే..

ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలో సొమ్మును దాచుకుంటే పదవీ విరమణ సమయంలో ఎంతగానో ఉపయోగపడు . తుంది . ఈలోగా ఏ అవసరం వచ్చినా అందులోనుంచి అప్పుగా కొంత సొమ్మును వినియోగించుకోవడానికి కూడా వీలుంటుంది . కానీ ఈ విధానం ప్రైవేటు సంస్థలలో పని చేసేవారికి , జిల్లా పరిషత్తు యాజమాన్యాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేకంగా ఉంటుంది . మునిసిపాలిటీలలో పనిచేస్తున్న వారికి ఆయా యాజమాన్యాల దయాదాక్షి జ్యాలపై అందించేవారు . మునిసిపల్ కౌన్సిలర్ల దయాదాక్షి ణ్యాలపై కౌన్సిల్ లో చేసిన తీర్మానం మేరకు వీరికి చెల్లిం పులు చేసేవారు . అయితే తాజాగా మునిసిపల్ ఉద్యోగులు , ఉపాధ్యాయులకు కూడా ఇతర సిబ్బంది మాదిరిగా జీపీఎఫ్ ( జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ) దాచుకునే అవకాశాన్ని కొత్తగా కల్పించారు . దీని కోసం కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు . జిల్లా పరిషత్ , మండల పరిషత్ యాజమాన్యాల్లో పని చేసే సిబ్బంది . ప్రతినెలా జీతాల నుంచి దాచుకున్న సొమ్మును ఆయా శాఖలు నిల్వ చేసేవి . ఈ మొత్తం నుంచి అప్పుగా తీసుకోవడం , పార్టీ పేమెంట్ పొందడం వంటి సదుపాయాలు ఉండేవి . ఈ విధానాన్ని మునిసిపల్ ఉపాధ్యాయులు , ఉద్యోగులకు ప్రత్యేక వ్యవస్థ ద్వారా వర్తింపజేయడంతో చాలా ప్రయోజనాలున్నాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు . అన్ని మునిసిపాలిటీలు , కార్పొరేషన్లలో దీనిని అమలు చేసేందుకు విధి విధానాలను రూపొందించారు . వీటిని ఈ వారం ' ఉద్యోగ పర్వం ' లో తెలుసుకుందాం .

జీపీఎఫ్ లో ఎవరు దాచుకోవాలి

మునిసిపాలిటీలు , కార్పొరేషన్లు , ఇతర జోనల్ కార్యాల యాల పరిధిలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు , ఉపా ధ్యాయులు , మునిసిపల్ , పారిశుధ్య , ప్రజారోగ్య సిబ్బంది అందరూ పొదుపు చేసుకోవచ్చు . - మునిసిపల్ ఉద్యోగులకు గతంలో విడుదలయ్యే గ్రాంట్లమేరకు జీతాలను చెల్లించేవారు . ఇప్పుడు 10 ట్రెజరీ ఖాతా ద్వారా జీతాలు పొందుతున్నారు . ఇటువంటి వారందరికీ ఈ విధానం వర్తిస్తుంది . -    జీపీఎఫ్పొ , నెలవారీ కటింగ్ ను ముందస్తుగా శాఖాధిపతులకు లిఖితపూర్వకంగా తెలపాలి . వారు జీతాల నుంచి జీపీఎఫ్ కు జమ చేస్తుంటారు . - మునిసిపల్ ఉద్యోగులు కనీసం రూ . 500 పొదుపు చేసుకోవాలి . ఎక్కువ దాచుకోవాలంటే పరిమితిని విధిం దారు . వారు ప్రతినెలా మూల వేతనంలో పది శాతం మించకుండా జీపీఎఫ్ ఖాతాలో జమ చేసుకోవచ్చు . - జీపీఎఫ్ లో ఎప్పుడైనా దాచుకున్న మొత్తాన్ని పెంపుదల చేసుకోవచ్చు . చాలామంది . జీతాలు పెరిగిన సమయంలో ఈ విధంగా చేస్తుంటారు . ఏటా ఏప్రిల్ లో మాత్రమే మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు . * ఖాతా ప్రారంభించిన తర్వాత మునిసిపల్ సిబ్బందికి ప్రభుత్వం ఒక కోడ్ నంబర్‌ను కేటాయిస్తుంది . ప్రతీనెలాఆ నంబరు జమ చేస్తుండాలి . - ఉద్యోగులు ఏ మునిసిపాలిటీలో పనిచేస్తున్నారో ఆ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఖాతాలు నిర్వహిస్తుంటారు . - ఉద్యోగులు , ఉపాధ్యాయులకు వేర్వేరుగా కాకుండా అంద రికీ ఒకే విధానంలో క్రమపద్ధతిలో దీన్ని నిర్వహిస్తారు .

 నూతన విధానంలో సదుపాయాలు »

 కొత్త విధానంతో . దాచుకున్న సొమ్ముకు ఉద్యోగులకు జవాబుదారీతనం ఏర్పడింది . - గతంలో దాచుకున్న సొమ్మును మునిసిపాలిటీలలో సక్రమంగా జమ చేసేవారు కాదు . చాలా మునిసిపాలిటీ లలో వారి సాధారణ ఖాతాలో ఈ సొమ్మును కలిపేసేవారు . - మునిసిపల్ చైర్మన్లు ఇష్టానుసారం చెల్లింపులు చేసే వారు . కొత్త విధానంలో ప్రత్యేక పద్ధతి ఉంది . . . . - మునిసిపల్ ఉపాధ్యాయులు , ఉద్యోగులకు సీఏఎంఎస్ ద్వారా జీతాలు చెల్లిస్తుండడం . . . 010 ఖాతా ద్వారా జీతాలు ఇస్తుండటంతో ఈ విధానం సాధ్యపడింది .
- మునిసిపల్ సిబ్బంది . సర్వీసులను ప్రావిన్సిలైజేషన్ చేయడంతో వీరు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాది రిగా అన్ని సదుపాయాలకు అర్హత సాధించారు . + సర్వీస్ రూల్స్ అమలు చేస్తుండటంతో ఈ జీపీఎఫ్ విష యంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి . రుణాల మంజూరుకు స్థానికంగానే అన్ని పనులు చేయడానికి అవకాశం లభించింది . - మునిసిపాలిటీల పరిధిలో ఉద్యోగులు , ఉపాధ్యాయు లకు వారు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ముని చెల్లించే అధికారాన్ని ఆయా మునిసిపల్ కమిషనర్లకు అప్పగించారు . ఇంతవరకు ఈ విధానం పీఎఫ్ వ్యవహారాలు చూసే ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ అధికారులకు ఉండేది . గతంలో జాప్యమయ్యేది . ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు . - మునిసిపాలిటీలకు సిబ్బంది విషయంలో , చెల్లింపులపై వారికే పూర్తి అధికారాలను అప్పగిస్తూ మెమో నంబర్ 25967ను ప్రభుత్వ డిప్యూటీ సెక్రెటరీ జారీ చేయడం వల్ల ఎంతో వెసులుబాటు కలిగింది . - మునిసిపాలిటీలలో పనిచేసే సిబ్బంది , ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి ప్రతీనెలా మినహాయిస్తూ దాచుకుం టున్న సొమ్మును పొందాలనుకున్నా , అందులో పార్ట్ పేమెంట్ ( కొంత మొత్తం ) లేదా పీఎఫ్ రుణాన్ని పొందాల నుకున్నా కమిషనరుకు దరఖాస్తు చేస్తే సరిపోతుంది . కమిషనర్ ఆ సిబ్బంది వివరాలను చూసి మంజూరు చేసే అవకాశం ఈ ఉత్తర్వుల ద్వారా ఏర్పడింది . " మునిసిపాలిటీలలో పడవీ విరమణ చేసే ఉద్యోగులు , ఉపాధ్యాయులు మునిసిపాలిటీపరంగా రావాల్సిన అన్ని రాయితీలను వెంటనే పొందుతుండగా జీపీఎఫ్ ఖాతా సొమ్ము పొందడానికి మాత్రం పీఎఫ్ కమిషనర్ కార్యాల యానికి దరఖాస్తు చేయాల్సి వచ్చేది . ఈ ఉత్తర్వుల వల్ల పదవీ విరమణ నాడే మునిసిపల్ కమిషనర్లు సిబ్బందికి వారి ఖాతాలలో దాచుకున్న ఈ సొమ్మును నేరుగా చెల్లించే వెసులుబాటు కలిగినట్టయింది .

ఇవీ ఉపయోగాలు . . - 



  • సొమ్మును పొదుపు చేసుకున్న ఉద్యోగులు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం కొంత అప్పుగా తీ సుకునే అవకాశం ఉంది . 
  • దీనికి వడ్డీ లేకుండా 20 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది . 
  • చదువులు , ఫీజుల వివరా లను శాఖాధిపతులకు సమర్పించవలసి ఉంటుంది . 
  • పిల్లల పెళ్లిళ్లు , ఇతర శుభకార్యాలకు కూడా అప్పు తీసుకునే వెసులుబాటు ఉంది .
  •  అయితే పెళ్లి కార్డుతో ఉద్యోగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది .
  •  ఉద్యోగి కానీ అతని కుటుంబ సభ్యులు గానీ దీర్ఘకాలిక రోగాలపాలైనప్పుడు వైద్య ఖర్చులకు రుణం పొందవచ్చు . 
  •  ఉద్యోగులుగా ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు రుణాన్ని పొందవచ్చు . 
  • నిర్మాణం కోసం రుణం తీసుకుంటే ఇంటి ప్లాన్ , నిర్మాణ వ్యయం ఎంతవుతుంది . 
  • ఎంతసొమ్ము అవసరమో దరఖాస్తు ద్వారా వివరించాలి . 
  • ఇతర ఆర్థిక అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో అన్ని ఆధారాలు , వివరాలు ఇవ్వాలి . 
  •  దాచుకున్న జీపీఎఫ్ నుంచి ఈ రుణాన్ని పొందినా తిరిగి జమ చేయాల్సి ఉంటుంది . 
  • దాచుకున్న సొమ్ము నుంచే అప్పు తీసుకున్నందున వడ్డీ ఉండదు . 
  •  జీపీఎఫ్ వల్ల ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థికపరంగా ఎంతో ప్రయోజనం కలుగుతుంది

 ఏ విధంగా తీసుకోవచ్చునంటే . 

మునిసిపల్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన జీపీ ఎస్లో ప్రతీనెలా జమ చేసిన మొత్తం నిల్వగా ఉంటుంది . దీని నుంచి సిబ్బంది రుణం కూడా తీసుకో వచ్చు . అయితే అప్పటి వరకు దాచుకున్న సొమ్ములో మూడో వంతు మాత్రమే రుణంగా ఇస్తారు . దీనికి అసలు జమ చేస్తూ , రుణ వాయిదాలను కూడా చెల్లి స్తుండాలి . సర్వీసులో మూడుసార్లు మాత్రమే ఈ విధంగా రుణం తీసుకునే అవకాశం ఉంటుంది . రుణం కావాల్సిన వారు తమ అవసరాలను పేర్కొంటూ శాఖాధి పతులకు దరఖాస్తు చేస్తే వారు పరిశీలించి జీపీఎస్ విభాగానికి సిఫారసు చేస్తారు . అప్పుడు వారు రుణం మంజూరు చేస్తారు . పదవీ విరమణ సమయంలో అంత వరకూ దాచుకున్న మొత్తాన్ని లెక్కగట్టివడ్డీని కలిపి ఉద్యోగులకు చెల్లిస్తారు . ఈ విధానాన్ని ముని సిపల్ శాఖాధిపతులు చేస్తుంటారు . ఉద్యోగులకు కేటాయించిన ఖాతా నంబర్ల ఆధారంగా వారెంత పొదుపు చేశారన్న విషయాన్ని ఏ నెల నెల తెలుసుకునే వీలుంటుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Special GPF for municipal staff"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0