Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teachers Transfers On pong al holidays ? ..


  • సంక్రాంతి సెలవుల్లో టీచర్ల బదిలీలు?..
  • వచ్చే ఏడాది వేసవిలో జనగణన ఉండడంతో బదిలీలు జరపాలని ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి.
  • ఈమేరకు సంక్రాంతిలో బదిలీలు జరుపుటకు నిర్ణయం తీసుకునే అవకాశం..
  • ఈ ఏడాది నవంబర్ 30 నాటికి గరిష్ట సర్వీసు గా ఎనిమిదేళ్ళ సర్వీసు (ఒకే స్కూల్ లో) ఉన్న టీచర్లకు తప్పనిసరి సరి బదిలీ..
  • బదిలీలకు ముందే హేతుబద్దీకరణ ప్రక్రియ..
  • విద్యార్థుల సంఖ్య 10, 20, 30 ఎన్ రోల్ మెంట్ ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాతిపదికన రేషనలైజేషన్..
  • ఈదఫా టీచర్ల బదిలీలు ఆన్ లైన్ లో చేపట్టే అవకాశం..

Teachers Transfers On pong al holidays ? ..

 వచ్చే ఏడాది సంక్రాంతి సెలవుల్లో టీచర్ల సాధారణ బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది . వాస్తవానికి వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించినప్పటికీ వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో జనగణన విధులను టీచర్లు చేపట్టాల్సి ఉండడంతో బదిలీలు జరిగే అవకాశాలు లేవు . ఈ నేపథ్యంలో ఉపా ధ్యాయ సంఘాల నుంచి బదిలీల కోసం ఒత్తిడి ఉంది . దీనికి అను గుణంగానే సంక్రాంతి సెలవుల్లో టీచర్ల సాధారణ బదిలీలు నిర్వహిం చేందుకు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం . దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా కొద్దిరోజుల్లోనే వెలువడనున్నట్టు తెలిసింది . ఈ ఏడాది నవంబరు 30వ తేదీ నాటికి గరిష్ఠ సర్వీసుగా ఎనిమిదేళ్లు ( ఒకే స్కూలులో ) ఉన్న టీచర్లను తప్పనిసరి బదిలీ చేసే అవకాశం ఉంది . దీనికితోడు బదిలీలకు ముందే హేతుబద్దీకరణ ( రేషనలైజేషన్ ) ప్రక్రియను చేపట్టనున్నారు . దీనికి కూడా కటాఫ్ డేటను ఈ ఏడాది నవంబరు 30వ తేదీగా తీసుకోవాలని విద్యాశాఖ యోచిస్తున్నట్టు తెలిసింది . విద్యార్థుల సంఖ్య 10 , 20 , 30 ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాతిపదికన రేషనలైజేషన్ చేయనున్నారు . తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా స్కూల్ మ్యాపింగ్ చేయ నున్నట్టు తెలిసింది . ఈ దఫా టీచర్ల బదిలీలను ఆన్ లైన్ విధానంలోనే చేపట్టనున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teachers Transfers On pong al holidays ? .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0