Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Teacher Eligibility Test (TET) schedule will be released on the fourth or fifth of next month.

ఆన్లైన్ పరీక్షపై సమాలోచనలు 
టీఆర్టీలో 20 శాతం వెయిటేజీ 
 ఈసారి ఏడేళ్ల అర్హత 
The Teacher Eligibility Test (TET) schedule will be released on the fourth or fifth of next month.

 ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) షెడ్యూల్ వచ్చే నెల నాలుగు లేదా ఐదో తేదీన విడుదల కానుంది . షెడ్యూల్ ఇచ్చిన వారం తర్వాత దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు . ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది . ప్రతి ఏడాది టెట్ ను రెండు పర్యాయాలు నిర్వహించాల్సి ఉండగా గతేడాది ఫిబ్రవరిలో ఒక్కసారే నిర్వహించారు . ఈ ఏడాది ఉపాధ్యాయ నియామక పరీక్ష ( టీఆర్టీ ) నిర్వహించనున్నందున ముందుగానే టెట్ నిర్వహణకు షెడ్యూల్‌ను రూపొందించారు . వ్యాయామ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలా ? వద్దా ? అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది . గతేడాది నిర్వహించిన టెట్ పై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈసారి దీనిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు . ఎన్డీటీ , స్కూల్ అసిస్టెంట్లకు రెండు పేపర్లుగా నిర్వహిస్తారు . అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నం దున ఆంగ్లం పేపర్ వేరుగా ఉండనుంది . , ఆన్లైన్ ఉంటుందా ? గతేడాది టెట్ ను మొదటిసారిగా ఆన్‌లైన్లో నిర్వహిం చారు . రాష్ట్రంలో కంప్యూటర్ల సదుపాయం లేకపోవడంతో చెన్నై , బెంగళూరు , హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు . దీనిపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్త మైంది . దీంతో కొంత సర్దుబాటు చేశారు . 

ఈ ఏడాది టెట్ . . - ఆన్లైన్ లో నిర్వహించాలా ?

 పేపరు , వెన్ను విధానంలో నిర్వహించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు . గతేడాది టెట్‌కు 4 , 46 , 833 మంది దరఖాస్తు చేయగా 4 , 14 , 120 మంది పరీక్షకు హాజరయ్యా రు . వీరిలో 1 , 94 , 093 మంది ( 46 . 86శాతం ) మాత్రమే అర్హత సాధించారు . జనరల్ వారు 60 , బీసీ - 50 , ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది . * టెట్లో వచ్చే మార్కులకు టీఆర్టీలో 20 % వెయిటేజీ ఉండడంతో ఈసారి టెట్ రాసేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు . మార్కుల మెరుగు కోసం ఒకటి , రెండు పర్యాయాలు రాసినవారు దరఖాస్తు చేసే అవకాశం ఉంది . ఒకసారి టెట్ రాస్తే ఏడేళ్ల వరకు అర్హతగా ఉంటుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Teacher Eligibility Test (TET) schedule will be released on the fourth or fifth of next month."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0