Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

10 th Class Original Certificate ... lost? Now it is very easy to recover.

10 th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికెట్
పోయిందా…? ఇప్పుడు చాలా సులభంగా తిరిగి పొందవచ్చు.
10 th Class Original Certificate  ... lost? Now it is very easy to recover.


మనం ఏదైనా జాబ్ కి అప్లై చేయాలన్న, బర్త్ సర్టిఫికేట్ , పాస్ పోర్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి పొందాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఎస్.ఎస్.సి. సర్టిఫికేట్ (టెన్త్ మార్క్స్ మెమో), ఎస్.ఎస్.సి. సర్టిఫికేట్ మనకు చాలా చోట్ల అవసరం, అది లేకుండా ఉద్యోగానికి, పై చదువులకి సంబందించిన ఏ పని జరగదు, ఎంతో ముఖ్యమైన ఎస్.ఎస్.సి. ఒరిజినల్ సర్టిఫికేట్ ని పోగొట్టుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది, ఎంత జాగ్రత్తగా ఉన్న ప్రయాణ సంధర్భంలోనో, ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడో, ఎలుకలు కొట్టినప్పుడో, వర్షాలు, వరదల వల్లనో   ఆ సర్టిఫికేట్స్ పాడైపోవడమో/ పోగొట్టుకోవడమో జరుగుతూ ఉంటుంది.అలా ఇంతకుముందు సర్టిఫికేట్ పోగొట్టుకుంటే తిరిగి పొందడానికి ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేల తిరగాల్సి వచ్చేది, ఎప్పుడు అలా తిరగాల్సిన అవసరం లేదు, చాలా సులభంగా ఇంటర్ నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

SSC ఒరిజినల్ సర్టిఫికేట్ పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.:


  •  మీ కంప్యూటర్ లో వెబ్ పేజిని ఓపెన్ చేయండి.
  • అందులో memos.bseapwebdata.org వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
  • అది ఓపెన్ చేయగానే ఎస్.ఎస్.సి. బోర్డ్ కు సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పేజ్ కనిపిస్తుంది. 
  • అందులో మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏ సంవత్సరం రాశారు, రెగ్యులరా? సప్లీనా? ప్రైవేటా? అని ఉంటుంది. 
  • వాటి కింద ఒక నెంబర్ కోడ్ ఉంటుంది. అందులో టైప్ చేసి సబ్ మిట్ పై క్లిక్ చేయండి.
  • ఆ విధంగా మీ డిటైల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్ మిట్ చేయగానే, మీ కళ్ళ ముందు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రత్యక్షమవుతుంది.
  • మీ ఎస్.ఎస్.సి. ఒరిజినల్ సర్టిఫికేటే ను మీ దగ్గర ఉంచుకోవాలంటే, ఒరిజినల్ సర్టిఫికేట్ కనిపిస్తున్న చోటు ఎడమచేయి వైపు పైన ‘ప్రింట్ దిస్ పేజ్’ పై క్లిక్ చేయండి.
  •  దానిపై క్లిక్ చేయగానే ‘సేవ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  •  సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ డెస్క్ టాప్ మీకు అనువైన చోట భద్రంగా దాచుకోవచ్చు.
  • అలా మీ ఎస్.ఎస్.సి. సర్టిఫికేట్ ను పోగొట్టుకున్న వారు తిరిగి దక్కించుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "10 th Class Original Certificate ... lost? Now it is very easy to recover."

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0