Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good News: 185 jobs on the water board .. Details.

గుడ్ న్యూస్‌: వాటర్ బోర్డులో 185 ఉద్యోగాలు.. వివరాలు.
Good News: 185 jobs on the water board .. Details.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌. భారత అణుశక్తి విభాగానికి చెందిన హెవీ వాటర్ బోర్డు-HWB ఖాళీలను భర్తీ చేస్తోంది. 
మొత్తం 185 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. స్టైపెండరీ ట్రైనీ, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. https://hwb.mahaonline.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ.
ఇక ఖాళీల వివరాలు చూస్తే.. మొత్తం ఖాళీలు- 185. అందులో టెక్నికల్ ఆఫీసర్ డీ- 28. దీనిలో కెమికల్- 21, మెకానికల్- 3, ఇన్‌స్ట్రుమెంటేషన్- 2సివిల్- 2 పోస్టుల ఉన్నాయి.
అలాగే స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టులు- 65 ఉన్నాయి. వీటిలో కెమికల్- 43, మెకానికల్- 1, ఎలక్ట్రికల్- 7, ఇన్‌స్ట్రుమెంటేషన్- 9,కెమిస్ట్రీ (ల్యాబరేటరీ)- 5 పోస్టులు ఉన్నాయి. మరియు స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 పోస్టులు- 92 ఉన్నాయి. ఇందులో ప్రాసెస్ / ప్లాంట్ ఆపరేటర్- 56, కెమిస్ట్రీ (ల్యాబరేటరీ)- 2, ఎలక్ట్రికల్- 4, మెకానికల్ (ఫిట్టర్)- 1, మెకానికల్ (మోటార్ వెహికిల్)- 1, వెల్డర్- 8, రిగ్గర్- 8, టర్నర్- 2, ప్లంబర్- 3, మేసన్- 2, కార్పెంటర్- 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇక విద్యార్హత- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా 60 శాతం మార్కులతో పాస్ కావాలి. స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 పోస్టుకు ఇంటర్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. దరఖాస్తు ఫీజు- రూ.100 చల్లించాలి. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 11 కాగా, దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 31.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good News: 185 jobs on the water board .. Details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0