Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

9 Clarity on Tet and DSC afterwards. . !

9 తర్వాతే టెట్ , డీఎస్సీలపై స్పష్టత . . !
9 Clarity on Tet and DSC afterwards. . !

  • అమ్మఒడిలో విద్యాశాఖ బిజీబిజీ 
  •  కోచింగ్ లో నిరుద్యోగులు నిమగ్నం  
  • ' జనవరి ' జాబ్ కేలెండరు కోసం నిరీక్షణ 

 ఏపీ టెట్ , డీఎస్సీ - 2020 నోటిఫికేషన్ల విడుదలపై జాష్యం కొనసాగుతోంది . ఈనెల 9వ తేదీ తర్వాతే వాటిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది . ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖాధికారులంతా జగనన్న అమ్మఒడి పథకం అమలులో బిజీబిజీగా ఉన్నారు . ఈ నెల 9న చిత్తూరులో అమ్మఒడిని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు . గత ఏడాది డిసెంబరు రెండో వారంలోనే టెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుందనే ప్రచారం జరిగింది . ఆపై జనవరి మొదటి వారంలో టెట్ , నెలాఖరుకు డీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయని అభ్యర్థులు ఆశిస్తున్నారు . అయితే ప్రస్తుతం 13 జిల్లాల వ్యాప్తంగా అధికారులు జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఏర్పాటుల్లో నిమగ్నమైపోయారు . అన్ని ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలు , కళాశాలలకు చెందిన విద్యార్థుల తుది జాబితాను గ్రామ , వార్డు సచివాలయాల్లో ప్రదర్శించడం , సాంకేతిక సమస్యల కారణంగా జాబితాలో చోటు దక్కని వారి నుంచి అభ్యంతరాల్ని స్వీకరిస్తూ బిజీబిజీగా ఉన్నారు . ఈ పథకం అమలు కోసం వివిధ ప్రభుత్వ , సంక్షేమ శాఖల నుంచి నిధుల్ని కేటాయిస్తున్నారు . ఈ నేపథ్యంలో అమ్మఒడి ప్రక్రియ పూర్తయ్యాకే టెట్ , డీఎస్సీలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలుస్తోంది . 

టెట్ , డీఎస్సీ కోసం నిరీక్షణ 

ఆర్నెళ్ల నుంచి టెట్ , డీఎస్సీ కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు . గత టీడీపీ ప్రభుత్వం చివరి దశలో డీఎస్సీ - 2018 కింద 7వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ జారీచేశారు . ఎన్టీటీ , తెలుగు , హిందీ పండిట్లు , స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో వివిధ సాంకేతిక సమస్యలు , నిలబస్ , విద్యార్హతల సమస్యలపై సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు . దీంతో ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది . వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటీవల డీఎస్సీ - 2018 పోస్టులో 2 వేలకు పైగానే భర్తీ అయ్యారు . డీఎస్సీ - 2018 నోటిఫికేషన్లో ఆశించిన స్థాయిలో అభ్యర్థులకు న్యాయం జరగలేదు . జంటో డీఎస్సీ వస్తుందనే ఆశతో లక్షలాది మంది అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాల్ని సైతం వదులుకుని శిక్షణలో నిమగ్న మయ్యారు . టెట్ , డీఎస్సీ పరీక్షలు వేర్వేరుగా నిర్వహి స్తారు . ప్రతిఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండరును ప్రకటిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు

 జాబ్ క్యాలెండరు పైనే నిరుద్యోగుల ఆశలు . . 

ఈ ఏడాది జనవరి జాబ్ క్యాలెండరులో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయనే ఆశతో నిరుద్యో గులున్నారు . నూతన సంవత్సరం ప్రారంభమై దాదాపు వారం రోజులు గడుస్తున్నప్పటికీ . . ఉద్యోగాల క్యా లెండరు పై కదలిక లేదు . గ్రూప్ - 1 , 2 , 3తో పాటు డిగ్రీ , జూనియర్ కళాశాలల లెక్చరర్లు , అసిస్టెంట్ ప్రొఫెసర్లు , పాలిటెక్నిక్ లెక్చరర్లు , వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన దాదాపు 30వేల ఖాళీల నివేదిక ప్రభుత్వానికి చేరింది . నూతన జాబ్ క్యాలెండరు పైనా ఈ నెల 9వ తర్వాతే ఒక స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది . అటు ఏపీపీఎస్సీ ప్రక్షాళన ఇంతవరకూ పూర్తి దశకు చేరుకోలేదు . ఏపీపీఎస్సీ యంత్రాంగం దగ్గర నుంచి పరీక్షల నిర్వహణ వరకు సమూలమైన మార్పులు చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది . నూతన జాబ్ క్యాలెండరు విడుదలకు సత్వరమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "9 Clarity on Tet and DSC afterwards. . !"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0