Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CM Jagan write a letter for the poor mothers

 'జగనన్న అమ్మఒడి' తో మీకలలు సాకారం..
పేదింటి తల్లులకు ముఖ్యమంత్రి జగన్ లేఖ..
CM Jagan write a letter for the  poor mothers

రూ.15,000 నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం..
పిల్లల చదువుల కోసం మీ తపనను పాదయాత్రలో స్వయంగా చూశా..
ఏపీ సీఎం లేఖ పూర్తి వివరాలు ఇలా...

' జగనన్న అమ్మ ఒడి ' పథకం ద్వారా పేదింటి పిల్లల చదువులు సాకారం అవుతాయని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు . పేదింటి తల్లులు తమ పిల్లలను బడికి పంపి మంచి చదువులు చదివించుకొనేందుకు ఏటా రూ . 15 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయిస్తున్నామని , ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వారి పిల్లలు మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు . అమ్మ ఒడితో పాటు విద్యార్థుల బంగారు భవితవ్యం కోసం మరో 3 విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు . ఈ మేరకు ' జగనన్న అమ్మ ఒడి ' కి ఎంపికైన పేదింటి తల్లులకు ముఖ్యమంత్రి లేఖ రాశారు . ఉద్యోగావకాశాలు మెరుగుపడేలా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం , నాడు - నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన , నాణ్యమైన , పుష్టికరమైన మధ్యాహ్న భోజనం అమలు కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం లేఖలో తెలిపారు . లేఖలోని అంశాలు ఇవీ . . .

 దేశంలోనే తొలిసారి . . 

 పిల్లల చదువుకు తల్లుల పేదరికం అడ్డుకాకూడదని మన ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర పథకం రాష్ట్ర చరిత్రలోనే కాదు , దేశంలోనే మొట్టమొదటిసారి . మీలాంటి తల్లులు దాదాపు 43 లక్షల మందికి సుమారు రూ . 6 , 455 కోట్ల మేర ఈ విధంగా ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది . 

మరో మూడు విప్లవాత్మక చర్యలు . . !

 మీ పిల్లలను బడికి పంపించాక చక్కటి చదువు చెప్పటం కోసం మరో మూడు విప్లవాత్మక చర్యలు కూడా తీసుకుంటున్నాం . మొదటిది పిల్లలకు చక్కటి ఉద్యోగ అవకాశాల కోసం మన పాఠశాలలన్నింటిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నాం . రెండోది . . పాఠశాలల్లో మంచినీరు , విద్యుత్తు , మరుగుదొడ్లు లాంటి కనీస సదుపాయాలు మెరుగుపరుస్తూ ' మనబడి నాడు - నేడు ' కార్యక్రమం కింద పాఠశాలల రూపురేఖల్ని మూడేళ్లలో మార్చబోతున్నాం . ఇక మూడవది . . పిల్లలకు పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం మరింత నాణ్యమైనదిగా , పుష్టికరంగానూ ఉండేందుకు సంక్రాంతి సెలవుల తరువాత నుంచి కొత్త మెనూ అమలు చేయబోతున్నాం . మీ పిల్లలు ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకొని మరింత వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ . . .

 మీ . . వైఎస్ జగన్మో హన్ రెడ్డి 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CM Jagan write a letter for the poor mothers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0