Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A new scheme named CM in AP. . 'Jagganna Gorumuda'

ఏపీలో సీఎం జగన్ పేరుతో కొత్త పథకం . . ' జగనన్న గోరుముద్ద '
A new scheme named CM  in AP. . 'Jagganna Gorumuda'

ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యార్థులకు అందించే భోజన పథకానికి ' జగనన్న గోరుముద్ద ' గా నామకరణం చేశారు . ఈ విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు .


ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులకు అందించే భోజన పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మ ఒడి’ పథకంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది.  ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. అమ్మ ఒడి పథకం ద్వారా సుమారు 40 లక్షల మంది తల్లులకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు చదువు అందించడమే మనం అందించే నిజమైన ఆస్తి అన్నారు. అదే సమయంలో పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న సమయంలో అందించే భోజనంలో కూడా మార్పుల గురించి జగన్ ప్రస్తావించారు. ఈ రోజు నుంచే మెనూలో మార్పులు తెచ్చినట్టు చెప్పాారు. ఒకే తరహా భోజనాన్ని అందించి విద్యార్థులకు మొహం మొత్తేలా చేయకుండా ప్రతి రోజూ ఓ కొత్త రకమైన వంటకం ఉండేలా మెనూలో మార్పులు చేశామన్నారు.

సోమవారం : అన్నం, పప్పుచారు, కోడి గుడ్డు కూర, చిక్కీ (వేరుశనగ పప్పు బెల్లం కలిపి వండే వంటకం)
మంగళవారం : పులిహోర, టమాట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు
బుధవారం : వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
గురువారం : కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు
శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
శనివారం : అన్నం, సాంబార్, తీపి పొంగల్


మధ్యాహ్న భోజనం అందించే ఆయాలకు నెలకు రూ.1000 గౌరవ వేతనం ఇచ్చేవారని, అంది కూడా ఆరేడు నెలల పాటు వేతనాలు చెల్లించే వారు కాదన్నారు. అయితే, ఆయాలకు గౌరవ వేతనం నెలకు రూ.3వేలకు పెంచుతున్నామని ప్రకటించారు. ‘గోరుముద్ద పథకానికి సంవత్సరానికి సుమారు రూ.340 కోట్లు అదనంగా ఖర్చవుతుందని, అయితే, విద్యార్థులకు మంచి భోజనం అందించేందుకు ఆ నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A new scheme named CM in AP. . 'Jagganna Gorumuda'"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0