Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar card: Change the address on the Aadhaar card? Like online do

Also Read:

Grama Sachivalayam Notification

Ammavadi Verification


Aadhaar card : ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలా ? ఆన్లైన్లో చేయండి ఇలా
aadhaar card: Change the address on the Aadhaar card? Like online do

Aadhaar Card Address Update Online Steps  మీ మొబైల్ నెంబర్ యూఐడీఏఐ దగ్గర రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది . ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి మీ మొబైల్‌కు వన్ టైమ్ పాస్ వర్డ్ - OTP వస్తుంది . ఓటీపీ ఉంటేనే మీరు మీ అడ్రస్ అప్డేట్ చేయడం సాధ్యమవుతుంది . మరి ఆన్లైన్లో ఆధార్ లో అడ్రస్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకోండి .

మీరు ఉంటున్న అడ్రస్ మారిందా? కొత్త ఇల్లు కట్టుకొని షిఫ్ట్ అయ్యారా? మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్‌నే ఆధార్ కార్డులో అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? ఆధార్ కార్డులో అడ్రస్ మార్చడం ఇప్పుడు సులువైపోయింది. మీరు ఆధార్ సెంటర్‌కి, ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ గంటలు గంటలు క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా లేదు. ఆన్‌లైన్‌లోనే అడ్రస్ అప్‌డేట్ చేసే అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఆన్‌లైన్‌లోనే సులువుగా అడ్రస్ మార్చొచ్చు. అప్‌డేట్ చేయొచ్చు. అయితే ఇందుకోసం మీ మొబైల్ నెంబర్ యూఐడీఏఐ దగ్గర రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ప్రాసెస్ కాబట్టి మీ మొబైల్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్-OTP వస్తుంది. ఓటీపీ ఉంటేనే మీరు మీ అడ్రస్ అప్‌డేట్ చేయడం సాధ్యమవుతుంది. మరి ఆన్‌లైన్‌లో ఆధార్‌లో అడ్రస్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

ఆధార్‌లో అడ్రస్ ఎలా అప్‌డేట్ చేసే విధానం


  • ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి.
  • Update Aadhaar సెక్షన్‌లో Update your address online లింక్ పైన క్లిక్ చేయండి
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Proceed to update Address ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీ అడ్రస్ అప్‌డేట్ చేయండి.
  • మీ అడ్రప్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • ఒకవేళ మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ లేకపోతే Address Validation Letter తీసుకోవాలి.
  • ఇందుకోసం ఈ నాలుగు స్టెప్స్ ఉంటాయి.
  • 1. Resident initiates request, 2. Address verifier consents, 3.Resident submits request, 4.Use secret code to complete.
  • ఈ నాలుగు స్టెప్స్ పూర్తి చేస్తే మీకు అడ్రస్ వేలిడేషన్ లెటర్ వస్తుంది. దాని ద్వారా ఆన్‌లైన్‌లో ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ చేయొచ్చు.
  • మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా మీ అడ్రస్ అప్‌డేట్ చేయచ్చు. 
  • ఇందుకోసం మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఇందుకోసం ఆధార్ సేవా కేంద్రంలో మీరు వెళ్లాలనుకునే సమయాన్ని మీరే నిర్ణయించుకోవచ్చు.
  •  స్లాట్ బుక్ చేయచ్చు. ఆధార్ సేవా కేంద్రంలో స్లాట్ ఎలా బుక్ చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aadhaar card: Change the address on the Aadhaar card? Like online do"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0