Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

An important note for employees and taxpayers. You must know one thing. Otherwise you have to pay more tax.

ఉద్యోగులకు అలెర్ట్.. ఆధార్/ పాన్ నెంబర్ చెప్పకపోతే ఇబ్బందులే!
An important note for employees and taxpayers. You must know one thing. Otherwise you have to pay more tax.

ఉద్యోగులకు, పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఎక్కువ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. కంపెనీ మీరు పాన్ లేదా ఆధార్ నెంబర్ తెలియజేయకపోతే పన్ను బాదుడు భరించాల్సిందే. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా ఈ విషయానికి సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేసింది. కంపెనీలు సాధారణంగానే ఉద్యోగి శాలరీపై టీడీఎస్ కట్ చేసుకుంటాయి. దీనికి కోసం ఉద్యోగి కచ్చితంగా పాన్ నెంబర్ లేదంటే ఆధార్ నెంబర్‌ను కంపెనీకి అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా చేయకపోతే.. అప్పుడు ఉద్యోగి ప్రభుత్వానికి తన ఆదాయంలో 20 శాతానికి పైగా మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించుకోవలసి వస్తుంది. సీబీడీటీ తాజా సర్క్యులర్ ప్రకారం..ఉద్యోగులు ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 206ఏఏ ప్రకారం ఆదాయం లేదా ఇతర అమౌంట్‌పై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందాలని భావిస్తే మాత్రం పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్‌ను కచ్చితంగా కంపెనీకి అందించాల్సి ఉంటుంది. ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీకి ఒకవేళ పాన్ నెంబర్ లేదంటే ఆధార్ నెంబర్‌ను ఇవ్వకపోతే.. అప్పుడు కంపెనీ ఉద్యోగి వేతం నుంచి ఎక్కువ టీడీఎస్‌ను కట్ చేసుకుంటుంది. సెక్షన్ 206ఏఏ ప్రకారం టీడీఎస్ కటింగ్ ఆధారపడి ఉంటుంది.
దీంతో ఉద్యోగి నికర వేతనం తగ్గుతుంది. ఇది 20 శాతంగా ఉండొచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 192 ప్రకారం చూస్తే.. ఉద్యోగి ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి కన్నా తక్కువగానే ఉంటే అప్పుడు ఎలాంటి టీడీఎస్ కటింగ్స్ ఉండవు. అయితే ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని దాటితే అప్పుడు యావరేజ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రేటు ప్రకారం కంపెనీలు టీడీఎస్‌ను కట్ చేసుకుంటాయి. యావరేజ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రేటు 20 శాతానికి దిగువున అంటే అప్పుడు టీడీఎస్ డిడక్షన్ 20 శాతంగా ఉంటుంది. ఒకవేళ ఈ రేటు 20 శాతానికి పైన ఉంటే అప్పుడు టీడీఎస్ డిడక్షన్‌కు యావరేజ్ రేటును ప్రామాణికంగా తీసుకుంటారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "An important note for employees and taxpayers. You must know one thing. Otherwise you have to pay more tax."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0