Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Another new initiative for the cleanliness of school environments.

  • ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత
  • ప్రతి బడిలో ఒక ఆయా నియామకం 
  • పారిశుధ్య పనుల నిర్వహణ కోసం నెలకు రూ4వేలు  సామగ్రి కోసం అదనంగా రెండు వేలు వ్యయం 
  • ఫిబ్రవరి 1 నుంచి అమలుకు ఆదేశాలు జారీ  పాఠశాల తల్లిదండ్రులకమిటీలతో సమావేశాలు
  • ప్రధానోపాధ్యాయులకు డీఈవో ఆదేశం 
 Another new initiative for the cleanliness of school environments.


 మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూను అమలు చేసి చిన్నారుల హృదయాల్లో నిలిచిన సీఎం జగన్మో హన్ రెడ్డి తాజాగా వారి ఆరోగ్య పరిరక్ష జ , పాఠశాల పరిసరాల పరిశుభ్రత కోసం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . ఇందుకోసం ప్రతి పాఠశాలకు ఒక ఆయాను నియమించాలని , పారిశుధ్య పనులను నిర్వహించినందుకుగాను ఆమెకు నెలకు రూ . 4 వేలు చెల్లించాలని ఆదేశించారు . దీనిపై ఆవసర మైన చర్యలు చేపట్టేందుకు ఈనెల 30వ తేదీ గురు 16 . . వారం పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని , పాఠశాల కాంపోజిట్ గ్రాంటు నుంచి ప్రతి నెల రూ . 2 వేలు పారిశుధ్య సామగ్రి కోసం వెచ్చించాలని ఆదేశించారు .

నిధులు లభ్యత ఇలా :

 చాలా పాఠశాలల్లో ఆయాలు లేని పరిస్థితి . ఈ స్థితిలో తరగతి గదులను సైతం విద్యార్థులే శుభ్రం చేసుకుంటున్న పరిస్థితు లు గమనిస్తుంటాం . ఇటువంటి పరిస్థితికి స్వస్తి చెప్పాలని , తమ పిల్లలు పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణంలో పెరుగు తున్నారనే భావనను తల్లిదండ్రుల హృదయాల్లో నుంచి తొల గించేందుకుగాను ఈనెల 8న అమ్మ ఒడి పథకాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభ సమయంలో తల్లిదండ్రులకు ముఖ్యమం త్రి జగన్మో హన్ రెడ్డి ఒక విజ్ఞప్తి చేశారు . తమ బిడ్డలు చదువు కునే పాఠశాల పారిశుధ్యం సక్రమంగా ఉండేందుకుగాను అమ్మ ఒడి పథకం కింద రూ . 15 వేలు పొందిన తల్లులు ఆందు లోనుంచి వెయ్యి రూపాయలు పాఠశాల పారిశుధ్య పనుల అమలుకు విరాళంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు . అలా తల్లిదం డ్రులు ఇచ్చిన మొత్తాన్ని డీఈవో ఆధ్వర్యంలో పారిశుధ్య పనుల కోసం నూతనంగా ఏర్పాటుచేసే బ్యాంకు అకౌంట్ కు జమ చేస్తారు . అలా జమ అయిన మొత్తంలో నుంచి పాఠశాల ఆయాకు వేతనం చెల్లించేందుకు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఆధ్వ ర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిర్వహించే అకొం టకు బదిలీ చేయాలి . దానిని ఆయా బ్యాంకు ఖాతాకు పాఠ శాల హెయం జమ చేయాల్సి ఉంటుంది . అయితే పాఠశాల తరగతి గదులు , టాయిలెట్లు , బాత్ రూములు పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన బ్రు , చీపుర్లు , ఫినాయిల్ వంటి వాటి కోసం పాఠశాల కాంపోజిట్ నిధి నుంచి రూ . 2వేలు ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి . 

పర్యవేక్షణకు సబ్ కమిటీ : 

పాఠశాల తరగతి గదుల పరిశుభ్రతను , టాయిలెట్ల పరిశుభ్ర తను పరిశీలించేందుకు పాఠశాల తల్లిదండ్రుల కమిటీలోనుం చి ముగ్గురు సభ్యులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయాలి . వారు ప్రతిరోజు పాఠశాలలోని పరిశుభ్రతను పరిశీలిస్తూ అవ సరమైన సూచనలు , సలహాలను పాఠశాల హెడ్మాస్టరు ఆం దజేయాల్సి ఉంటుంది . వారానికి మూడుసార్లు గ్రామ సచివాలయ విద్య - సంక్షేమ కార్యదర్శి పాఠశాలను సందర్శిం చి పరిశుభ్రతకు సంబంధించి ఫోటోలు తీసి ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది . ఇది కాకుండా నెలకు ఒకసారి జరిగే పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశంలోను దీనిపై చర్చించాల్సి ఉంటుంది . అంతే కాకుండా మూడు నెలలకు ఒక సారి గ్రామంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో స్వతంత్ర పర్యవేక్షణ నిర్వహింపజేసి లోటుపాట్లను తెలుసు కుని మార్పులు చేపట్టాల్సి ఉంటుంది . 

 రేపు పాఠశాలల తల్లిదండ్రులతో సమావేశం :

 పాఠశాలలో విద్యనభ్యసించే చిన్నారుల తల్లిదండ్రుల కమిటీ లతో ఈనెల 30న పాఠశాల తల్లిదండ్రుల కమిటీలతో కలిసి ప్రధానోపాధ్యాయుడు సమావేశం నిర్వహించాలి . ఈ సమావే శంలో పాఠశాలలో పరిశుభ్రత కోసం ఆయా వేతనం కోసం అమ్మ ఒడి పథకం లబ్ధిదారులు అందరినీ తలా రూ . వెయ్యి విరాళంగా ఇవ్వమని కోరాల్సి ఉంటుంది . ఆ మొత్తం పాఠశా లలోని చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలా ఉపయోగ పడుతుందో కూడా వివరించాలి . అంతే కాకుండా పాఠశాలలో నీటి పొదుపు ఆవశ్యకత గురించి , నీటి వనరులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థినీ విద్యార్థుల్లోను చైతన్యం తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ  అయ్యాయి . అయితే ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పక్కాగా అమలు చేయాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " Another new initiative for the cleanliness of school environments."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0