Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Intanta Pensions Festival

ఇంటింటా పింఛన్ల పండుగ
స్పందన'పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌


  • లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పంపిణీ చేయనున్న వలంటీర్లు
  • ఫిబ్రవరి నుంచి 54.64 లక్షల మందికిపైగా పెన్షన్లు
  • కొత్తగా 15.64 లక్షల మందికి ప్రయోజనం
  • 15 నుంచి 21 వరకు కొత్త పెన్షన్, బియ్యం కార్డులు పంపిణీ
  • 11.60 లక్షల మంది విద్యార్థులకు 20న 'జగనన్న వసతి దీవెన'
  • ఉగాదికి 25 లక్షల మంది పేద మహిళలకు స్టాంప్‌ పేపర్‌పై ఇళ్ల పట్టాలు
  • 15 నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో విడత
  • ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు పారదర్శకంగా భర్తీ
  • అందులో సగం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే
  • ఏప్రిల్‌కల్లా 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు
  • దేశం మొత్తం మాట్లాడుకునేలా దిశ చట్టం అమలు


 రాష్ట్రవ్యాప్తంగా 54.64 లక్షల మందికిపైగా పేదలకు మేలు చేకూరుస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు పింఛన్లు 39 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడు 54.64 లక్షల మందికిపైగా పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. తద్వారా కొత్తగా 15.64 లక్షల మందికి పింఛన్లతో ప్రయోజనం కలగనున్నట్లు స్పష్టమవుతోంది. గ్రామ, పట్టణ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్‌ సొమ్మును పంపిణీ చేస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్పందన ద్వారా అందే దరఖాస్తుల్లో దాదాపు 60 శాతం వరకు బియ్యం కార్డులు, పెన్షన్లు, ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. స్పందనలో అధికారులు బాగా పనిచేశారని చాలామంది ప్రశంసించారన్నారు. స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ...

15 నుంచి కొత్త పెన్షన్‌కార్డులు, బియ్యం కార్డులు

''వైఎస్సార్‌ నవశకం ద్వారా కొత్తగా బియ్యం కార్డులు, పెన్షన్‌ అర్హుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి 15వతేదీ నుంచి 21 వరకు వీటి పంపిణీని పూర్తి చేయాలి. నిర్దేశిత సమయానికి కార్డులు ప్రింట్‌ చేసి పంపిణీకి సిద్ధం చేయాలి. సామాజిక తనిఖీ ఫిబ్రవరి 2 కల్లా పూర్తి కావాలి. ఆ వెంటనే కార్డుల పంపిణీ చేపట్టాలి. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డుల మంజూరు జరుగుతుంది.

ఇళ్ల స్థలం లేదని ఎవరూ చేయి ఎత్తకూడదు..

అర్హులైన పేదలందరికీ ఉగాదికి ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేయాలి. 25 లక్షల మంది మహిళలకు వారి పేర్లతో రూ.10 స్టాంపు పేపర్‌పై ఇళ్లపట్టాలు జారీ చేస్తాం. లాటరీ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు చేయాలి. ఫిబ్రవరి 15 లోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితా సిద్ధం కావాలి., ప్రజాసాధికార సర్వేకి, ఇళ్ల పట్టాల మంజూరుకు ముడిపెట్టకూడదు. గతంలో ఇళ్లు పొందిన వారి వివరాలను ప్రభుత్వం వద్ద ఉన్న 2006 ఏడాది వివరాలతో సరిపోల్చి చూడాలి. గ్రామాల్లో నా పర్యటన సందర్భంగా ఇళ్ల స్థలాలు లేవని ఎవరూ చేతులు ఎత్తకూడదు. ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలాలకు మెజార్టీ లబ్ధిదారులు అంగీకారం తెలపాలి.మొక్కుబడిగా ఇస్తే ఎవరూ అక్కడ ఉండేందుకు ఇష్టపడరని గుర్తుంచుకోవాలి. మనం ఇచ్చే ఇళ్ల స్థలం వారి ముఖంలో సంతోషాన్ని నింపాలి. స్థలాలు నివాసయోగ్యంగా ఉండాలి. లబ్ధిదారుడు సంతోషంగా ఉండాలి. లేదంటే డబ్బులు వృథా కావడమే కాకుండా లబ్ధిదారులకు అసంతృప్తే మిగులుతుంది. ప్లాటింగ్‌ చేసేటప్పుడు ఈ అంశాలను కలెక్టర్లు కచ్చితంగా పరిశీలించాలి. ఊరికి దూరంగా, నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. ఫిబ్రవరి 15 కల్లా అర్హుల జాబితా సిద్ధం కావాలి. 21 కల్లా లబ్ధిదారుల వివరాలను కలెక్టర్లు పంపించాలి. ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్ల అభివృద్ధి ఫిబ్రవరి 25 కల్లా జరగాలి. మార్చి 1 కల్లా ఇళ్ల స్థలాల కోసం భూముల సేకరణ పూర్తి కావాలి. మార్చి 10 కల్లా సేకరించిన స్థలాల్లో ప్లాట్లను అభివృద్ధి చేయాలి. మార్చి 15 కల్లా లాటరీలు కూడా పూర్తిచేసి ప్లాట్ల కేటాయింపు జరగాలి.

నిర్మాణాలు పూర్తయ్యాకే వారిని తరలించాలి

అభ్యంతరకర ప్రాంతాల్లో నివాసముంటున్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారికి ప్లాట్ల్లను ఎక్కడ కేటాయిస్తున్నారో చూపించి అంగీకారం పొందాలి. వచ్చే ఏడాది చేపట్టబోయే ఇళ్ల నిర్మాణాల్లో వీరికి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలియచేయాలి. ఆ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే అభ్యంతరకర ప్రాంతాల్లో ఉన్నవారిని తరలించాలి. అభ్యంతరాల్లేని ప్రాంతాల్లో నివసించే వారిని ఎలాగూ రెగ్యులరైజ్‌ చేస్తాం. ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. మనం దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని తెలియచేయాలి. మనకు ఓటు వేయనివారైనా ఫర్వాలేదు కానీ వారికి మాత్రం మంచి జరగాలి. దీన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకోవాలి. భవిష్యత్తు తరాలన్నీ ఈ ప్రభుత్వాన్నీ, అధికారులనూ గుర్తుంచుకుంటాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " Intanta Pensions Festival"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0