Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Government to move the Secretariat on a regular basis

విశాఖకు ముందుగా తరలిపోనున్న శాఖలు ఇవే . . .

విడతలవారీగా సచివాలయం తరలించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం . . . ప్రాధాన్యత శాఖల్లో కీలక విభాగాలను ఆన్ డ్యూటీ కింద తరలించాలని నిర్ణయించింది .


ఏపీ కొత్త పరిపాలన రాజధానిగా విశాఖపట్నం దాదాపు ఖరారు అయ్యింది. దీనిపై రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకోవడం మాత్రమే మిగిలి ఉండటంతో... ముందుగానే విశాఖకు కీలక శాఖలను తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. విశాఖలోని మిలీనియం టవర్స్‌లో కొత్త సచివాలయం ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చిన ఏపీ ప్రభుత్వం... ఇందుకు సంబంధించిన ఈ నెల 8న జరగబోయే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. తరలింపు ప్రక్రియకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 20వ తేదీ నుంచే విశాఖలోని మిలీనియం టవర్స్‌లో కొత్త సచివాలయానికి శాఖల తరలింపు కోసం సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
విడతలవారీగా సచివాలయం తరలించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం... ప్రాధాన్యత శాఖల్లో కీలక విభాగాలను ఆన్ డ్యూటీ కింద తరలించాలని నిర్ణయించింది. జీఏడీ నుంచి మూడు సెక్షన్లు, ఫెనాన్స్ శాఖ నుంచి రెండు సెక్షన్లు, మైనింగ్ నుంచి రెండు సెక్షన్లు, హోంశాఖ నుంచి నాలుగు సెక్షన్లు, రోడ్లు భవనాల నుంచి నాలుగు సెక్షన్లు తరలించాలని భావిస్తున్నారు. పంచాయతీరాజ్ నుంచి నాలుగు సెక్షన్లు, వైద్య ఆరోగ్య శాఖ, ఉన్నత విద్య, పాఠశాల విద్యాశాఖ నుంచి రెండేసి సెక్షన్లు తరలించాలని సర్కార్ భావిస్తోంది.

జగన్ మరో కీలక నిర్ణయం 

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న ఏపీ ప్రభుత్వం... ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు నాటికి విశాఖకు కీలక శాఖలకు సంబంధించిన పలు సెక్షన్లను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జనవరి మూడో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ పరిపాలన రాజధాని అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. 

రిపబ్లిక్ డే వేడుకలు సైతం విశాఖలో 

ఇదిలా ఉంటే ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు సైతం విశాఖలో జరపాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అంతకుముందే విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Government to move the Secretariat on a regular basis"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0