Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The things we use everyday ... the description of how many years it takes to fully integrate into the earth

ఈ సృష్టిలో ఏదైనా అరుదుగా ఉంటే... దానికి ఎంతో
విలువ ఉంటుంది.
The things we use everyday ... the description of how many years it takes to fully integrate into the earth

అరుదైన వజ్రాలు, బంగారాన్ని మనం ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాం. అలాంటిది... ఈ అనంత సృష్టిలో ప్రస్తుతానికి మనం జీవించేందుకు అవకాశం ఉన్న ఏకైక గ్రహం మన భూమి మాత్రమే. అలాంటప్పుడు మన భూమిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఎంత అపురూపంగా చూసుకోవాలి? కానీ మన స్వార్థం, మన అవసరాల వల్ల భూమి నాశనం అయిపోతోంది. చెత్త ప్లాస్టిక్ అంతా... డ్రైనేజీలు, సముద్రాలు, చెరువులు, నదులు ఇలా ఎక్కడ బడితే అక్కడ పోగై స్టాక్ ఉండిపోతోంది. ఫలితంగా జంతువులు, పక్షులు, జలచరాలు, కీటకాలు అన్నీ చనిపోతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడొద్దంటోంది. మనం రోజువారీ వాడి పారేసే వస్తువులు... భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలిస్తే... మనం ఎంత పొరపాటు చేస్తున్నామో అర్థమవుతుంది. ఓసారి తెలుసుకుందాం. తద్వారా మనకు మనమే నెక్ట్స్ టైమ్ ఆ వస్తువుల్ని ఎక్కడ బడితే అక్కడ పారేయకుండా... డస్ట్ బిన్స్‌లోనే వేసి... రీసైక్లింగ్ అయ్యేలా చేసి... భూమిని కాపాడినట్లవుతుంది. ఆల్రెడీ అదే పని చేస్తున్నట్లైతే... అలాంటి వాళ్లందరికీ ధన్యవాదాలు.

ఫ్యాషన్ - లైఫ్ స్టైల్ తరహా వస్తువులు 



  1. లెదర్ షూస్ - 25-40 ఏళ్లు తాడు - 3-4 నెలలు
  2. కాటన్ బట్టలు - 1-5 నెలలు
  3. నైలాన్ బట్టలు - 30-40 ఏళ్లు
  4. హెయిర్ స్ప్రే బాటిల్ - 200-500 ఏళ్లు
  5. డిస్పోజబుల్ డైపర్స్ - 250-500 ఏళ్లు
  6. శానిటరీ ప్యాడ్స్ - 500-800 ఏళ్లు
  7. ఉన్ని బట్టలు - 1-5 ఏళ్లు
  8. కాటన్ గ్లోవ్స్ - 1 to 5 నెలలు
  9. రబ్బర్ బూట్ సోల్ - 50-80 ఏళ్లు
  10. టాంపోన్స్ - 800 ఏళ్లు (ప్యాడ్స్‌కి)
  11. ట్రైనర్స్ - 50 ఏళ్లు
  12. విండ్ - చీటర్స్ - 30-40 ఏళ్లు
  13. లెదర్ బ్యాగ్, వాలెట్ - 50 ఏళ్లు
  14. ఉన్ని గ్లోవ్స్ - 1 ఏడాది

రోజువారీ వాడే వస్తువులు :


  1. టూత్ బ్రష్ - 400 ఏళ్లు
  2. పెన్ - 450 ఏళ్లు
  3. ప్లైవుడ్ - 1-3 ఏళ్లు
  4. టిన్ క్యాన్స్ - 50 ఏళ్లు
  5. ప్లాస్టిక్ బాటిల్ - 100 ఏళ్లు
  6. బ్యాటరీస్ - 100 ఏళ్లు
  7. లంబర్ - 10-15 ఏళ్లు
  8. టిన్ ఫాయిల్ (Tinfoil) - ఎప్పటికీ కలిసిపోదు.
  9. టిన్ క్యాన్ - 50 ఏళ్లు
  10. పెయింట్ వేసిన బోర్డ్ - 13 ఏళ్లు
  11. కార్డ్ బోర్డ్ - 2 నెలలు
  12. పేపర్ టవల్ - 2-4 వారాలు
  13. పిల్లల డైపర్లు - 500-800 ఏళ్లు
  14. న్యూస్ పేపర్ - 6 వారాలు
  15. కార్పెట్ - 30-40 ఏళ్లు
  16. కారు టైర్లు - 50 ఏళ్లు

  17. ఆహార, కిచెన్ వస్తువులు :
  18. ప్లాస్టిక్ బ్యాగ్ - 500-1000 ఏళ్లు
  19. మిల్క్ ప్యాకెట్ (టెట్రా) కవర్ - 5 ఏళ్లు
  20. కెచప్ సాషే - 5 ఏళ్లు
  21. గ్లాస్ బాటిల్ - 10-20 లక్షల ఏళ్లు
  22. అల్యూమినియం క్యాన్ - 80-200 ఏళ్లు
  23. స్టైరోఫామ్ (Styrofoam) - ఎప్పటికీ కరగదు
  24. సన్నటి ప్లాస్టిక్ బ్యాగ్స్ - 10-20 ఏళ్లు
  25. ప్లాస్టిక్ కప్స్ - 50 ఏళ్లు
  26. మిల్క్ కార్టన్ - 5 ఏళ్లు
  27. యాపిల్ తొక్కు - 2 నెలలు
  28. జిప్ ఉండే బ్యాగ్స్ - 500-1000 ఏళ్లు
  29. క్రిస్ప్ ప్యాకెట్లు - 450-1000 ఏళ్లు
  30. సెరియల్ బాక్స్ - 6 వారాలు
  31. వాక్స్‌ ఉన్న మిల్క్ కార్టన్ - 3 నెలలు
  32. అరటి తొక్క - 2 ఏళ్లు
  33. జ్యూస్ కార్టన్ - 300 ఏళ్లు
  34. కాఫీ కప్పు - 30 ఏళ్లు
  35. ప్లాస్టిక్ స్ట్రా - 200 ఏళ్లు
  36. చిన్న టెట్రా ప్యాక్ - 5 ఏళ్లు
  37. కర్ట్లరీ పీస్ - 450 ఏళ్లు

రోజూ వారీ వాడే ఇతర వస్తువులు :


  1. పెయింట్ వేసిన చెక్క కర్ర - 13 ఏళ్లు
  2. ఫిషింగ్ లైన్ - 600 ఏళ్లు
  3. ట్రైన్ టికెట్ - 2 వారాలు
  4. కాన్వాస్ ఉత్పత్తులు - 1 ఏడాది
  5. గ్లాస్ - నిర్ధారించలేదు.
  6. సిగరెట్ ఫిల్టర్ - 5 ఏళ్లు
  7. సిగరెట్ - 1-12 ఏళ్లు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The things we use everyday ... the description of how many years it takes to fully integrate into the earth"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0