Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bike or Car drive on road without a license is a prison!

లైసెన్సు లేకుండా వాహనంతో రోడ్డెక్కితే జైలుకే!

సుప్రీంకోర్టు కమిటీ సూచనలతో కఠిన చర్యలకు ఉపక్రమించిన రవాణా శాఖ

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను ఈ ఏడాది 20 శాతం తగ్గించాలని నిర్ణయం
ఇక మరింతగా డ్రైవింగ్‌ లైసెన్సుల తనిఖీఇప్పటికే లైసెన్సుల జారీ ప్రక్రియ సులభతరం త్వరలో అందుబాటులోకి సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా జైలుకు పంపనున్నారు. ఇప్పటివరకు జరిమానాలతో సరిపెట్టిన రవాణా శాఖ ఇక కఠినంగా వ్యవహరించ నుంది. పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేయ నున్నారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 88,872 మంది డ్రైవింగ్‌ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.

ఈ మేరకు రవాణా శాఖ తాజాగా ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదికను రోడ్‌ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి అందజేసింది. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపేవారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టు కమిటీ సూచించింది. దీంతో ఏపీ రవాణా శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను ఈ ఏడాది 20 శాతం తగ్గించాలని రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా డ్రైవింగ్‌ లైసెన్సుల తనిఖీలను ఇక ముమ్మరంగా చేపట్టనున్నారు.


లైసెన్సుల జారీ మరింత సులభతరం.


డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ ప్రక్రియను ఇప్పటికే సులభతరం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో మోటారు వాహన చట్టంలో సవరణలు చేసిన సమయంలోనే డ్రైవింగ్‌ లైసెన్సులకు విద్యార్హత నిబంధన తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో గతేడాది ఎనిమిదో తరగతి నిబంధనను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలగించింది. సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్సులు పొందడం మరింత సులభం కానుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bike or Car drive on road without a license is a prison!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0