Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Cash from ICICI ATM without any card to any bank customer

ఏ బ్యాంక్ కస్టమర్‌కైనా కార్డు లేకుండా ICICI ఏటీఎం నుంచి నగదు, ఇలా తీసుకోండి.
Cash from ICICI ATM without any card to any bank customer

డెబిట్ కార్డు లేకుండానే ATM నుంచి నగదును ఉపసంహరించుకునే సదుపాయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 వేల ఏటీఎం కేంద్రాలలో రూ.20 వేలకు మించకుండా కార్డ్ లేకుండానే నగదును తీసుకోవచ్చునని తెలిపింది.

1.రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఉపసంహరణ


  • ఐమొబైల్ (iMobile) యాప్ నుంచి రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఈ కార్డ్‌లెస్ ఉపసంహరణ సేవలను వినియోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.
  • ఈ సేవలను మంగళవారం నాడు ప్రారంభించింది. 
  • రోజుకు రూ.20,000 ఈ పద్ధతి ద్వారా తీసుకోవచ్చు. 
  • ఐమొబైల్‌కు విజ్ఞప్తి ద్వారా దేశంలోని పదిహేను వేల ఏటీఎం కేంద్రాలలో ఈ నగదు తీసుకోవచ్చు.
  •  ఇది అత్యంత సులువైన, సౌకర్యవంతమైన మార్గమని ఐసీఐసీఐ తెలిపింది.

2.కార్డ్‌లెస్ విత్‌డ్రా ప్రయోజనాలు


  • భారత దేశంలో ఏ ప్రాంతంలో అయినా 24X7 ఈ రిక్వెస్ట్, క్యాష్ విత్ డ్రా సదుపాయం అందుబాటులో ఉంటుంది.
  • క్యాష్ విత్ డ్రా చేసుకునే వారు ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ అయి ఉండవలసిన అవసరం కూడా లేదు.
  • ఏటీఎం కార్డు లేకుండానే క్యాష్ తక్షణమే పొందవచ్చు.
  • అన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం నెట్ వర్క్ నుంచి ఈ ఉపసంహరణ అందుబాటులో ఉంది.
  • ఇది సురక్షిత ప్రాసెస్.

3.ఎలా విత్ డ్రా చేసుకోవాలి?


  • ఐసీఐసీఐ మొబైల్ యాప్ iMobile కు లాగిన్ కావాలి.
  • Services ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం Cash Withdrawal at ICICI Bank ATM సెలక్ట్ చేసుకోవాలి.
  • అప్పుడు మీకు రిఫరెన్స్ OTP వస్తుంది.
  • ఏ ఐసీఐసీఐ బ్యాంకుకు అయినా వెళ్లి కార్డ్‌లెస్ ఉపసంహరణను సెలక్ట్ చేసుకోవాలి.
  • మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • రిఫరెన్స్ OTPని ఎంటర్ చేయాలి.
  • టెంపరరీ PIN ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత మీరు తీసుకోవాలనుకున్న అమౌంట్ ఎంటర్ చేయాలి.
  • క్యాష్ విత్ డ్రా రిక్వెస్ట్, ఓటీపీ నెక్స్ట్ డే మిడ్ నైట్ వరకు వ్యాలిడ్‌గా ఉంటుంది.

4.ఏటీఎం లొకేటర్ కోసం..

మీకు సమీపంలో ఏటీఎం ఎక్కడ ఉందో తెలియకుంటే.. ఐసీఐసీఐ ఏటీఎంను గుర్తించేందుకు ఎస్సెమ్మెస్ చేస్తే సరిపోతుంది. ATMCC <> to 9222208888 కు ఎస్సెమ్మెస్ చేస్తే చాలు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Cash from ICICI ATM without any card to any bank customer"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0