Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

EPFO new facility for employees.

ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం.


ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారినప్పుడు పీఎఫ్‌ ఖాతాలో డబ్బులు బదిలీ చేయడానికి/ విత్‌డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కారణం.. మీరు గతంలో పనిచేసిన సంస్థ.. మీరు ఉద్యోగం నుంచి వైదొలగిన తేదీని ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. కేవలం సదరు కంపెనీలకే ఇప్పటి వరకు ఆ అవకాశం ఉండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. ఒక్కోసారి నెలల తరబడి నగదు బదిలీ చేసుకోవడానికి/ విత్‌డ్రా చేసుకోవడానికి తంటాలు పడేవారు. అలాంటి వారి కోసం ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులే ఆన్‌లైన్‌లో ఉద్యోగం వైదొలిగిన తేదీని నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
నమోదు ఇలా..
ఈపీఎఫ్‌ఓ ఈసేవా పోర్టల్‌లో ఈ వివరాలను మార్చుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఉద్యోగులు తమ యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. 'మేనేజ్‌' టాబ్‌లోకి వెళ్లి 'మార్క్‌ ఎగ్జిట్‌'లోకి వెళ్లాలి. మీరు గతంలో పనిచేసిన సంస్థ నుంచి ఉద్యోగంలోంచి వైదొలిగిన తేదీ, కారణాన్ని అక్కడ తెలపాలి. ఆ తర్వాత ఓటీపీ కోసం రిక్వెస్ట్‌ పెట్టి.. అనంతరం ఓటీపీని ఎంటర్‌ చేయాలి. చివర్లో అప్‌డేట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఈపీఎఫ్‌ఓ రికార్డుల్లో మీరు వైదొలిగిన తేదీని నమోదు చేయొచ్చు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి చేసే ముందు అంతకుముందు మీరు పనిచేసిన కంపెనీ సదరు వివరాలు నమోదు చేసిందీ లేనిదీ ఓ సారి తనిఖీ చేసుకోవడం ఉత్తమం. అయితే, ఈ తేదీ నమోదు చేయాలంటే మీరు ఉద్యోగం నుంచి వైదొలిగి కనీసం రెండు నెలలు అయ్యి ఉండాలి. పాత కంపెనీ మీ పీఎఫ్‌ ఖాతాలో చివరిసారిగా జమ చేసి రెండు నెలల దాటిన తర్వాతే ఈ మార్పులు చేసేందుకు వీలుంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "EPFO new facility for employees."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0