Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Modi government is good news for home buyers

ఇంటి కొనుగోలుదారులకు మోదీ ప్రభుత్వం శుభవార్త.
Modi government is good news for home buyers

ఇంకో 10 రోజుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి మోదీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే హల్వా వేడుక కూడా పూర్తయ్యింది. బడ్జెట్ పత్రాలు కూడా ప్రింట్ అవుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.బడ్జెట్ తతంగం ప్రతి ఏడాది ఉండేదే. కానీ ఈసారి బడ్జెట్‌కు మాత్రం ప్రాధ్యాన్యత నెలకొంది. దేశ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. డిమాండ్ పడిపోయింది. కేంద్రం పలు నిర్ణయాలు తీసుకున్నా కూడా ఫలితం దక్కలేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు బడ్జెట్ వైపు ఉంది. బడ్జెట్‌లో డిమాండ్‌ సహా ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించే నిర్ణయాలు ఉండొచ్చనే అంచనాలున్నాయి.మరీముఖ్యంగా ఇంటి కొనుగోలుదారులకు ప్రయోజనం కలిగించే ప్రకటనలకు అవకాశం ఉండొచ్చనే ఊహాగానాలు నెలకొన్నాయి
తద్వారా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉండొచ్చు. లిక్విడిటీ సమస్యతోపాటు డిమాండ్ పడిపోవడం వంటి సమస్యలతో రియల్ ఎస్టేట్ రంగం కష్టాలను ఎదుర్కొంటోంది.ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించాలంటే రియల్ ఎస్టేట్‌ను ఆదుకోకతప్పదు. రియల్ ఎస్టేట్‌ చాలా మందికి ఉపాధి కల్పిస్తోంది. అలాగే స్టీల్, సిమెంట్ వంటి రంగాలు కూడా రియల్ ఎస్టేట్‌పై ఆధారపడ్డాయి.

అందుకే తాజా బడ్జెట్ 2020లో రియల్ ఎస్టేట్ రంగానికి అధిక ప్రాధాన్యం లభించొచ్చనే అంచనాలున్నాయి.ఆదాయపు పన్ను స్లాబ్స్ మార్పు సహా మరిన్ని ప్రయోజనాలను కల్పిస్తే బాగుంటుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరీముఖ్యంగా హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీ మినహాయింపు పరిమితిని మరింత పెంచాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం హౌసింగ్ లోన్‌పై చెల్లించే వడ్డీ మొత్తంలో రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఇప్పుడు ఈ లిమిట్‌ను రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలనే డిమాండ్లు నెలకొన్నాయి.అంతేకాకుండా ప్రాపర్టీ వ్యాల్యూ లెక్కింపులో కూడా మార్పులు జరగాలని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాపర్టీ నికర వార్షిక విలువ లెక్కింపు సమయంలో స్థూల రెంటల్ వ్యాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్స్ తీసేస్తారు. ప్రాపర్టీ నికర విలువలో 2002 నుంచి ఇంటి పెయింట్, మరమత్తుల వంటి కోసం 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ కొనసాగుతూ వస్తోంది. ఈ డిడక్షన్‌ను 10 నుంచి 20 శాతం పెంచితే బాగుంటుందని, ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Modi government is good news for home buyers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0