Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The government has released a job charge regarding the performance of duties for village secretariat employees.

 గ్రామ సచివాలయ ఉద్యోగులకు విధుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం జాబ్ చార్జ్ విడుదల చేసింది . 
The government has released a job charge regarding the performance of duties for village secretariat employees.

గ్రామాలకు అవసరమైన పనులు గుర్తింపు , సమస్యల పరిష్కారంపై చర్యలు , గ్రామ సభలు నిర్వహణ , గ్రామ పంచాయతీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో వివరించారు . సచివాలయ ఉద్యోగుల విధులు పరిశీలిస్తే మీ సేవ కేంద్రాల్లో నిర్వహించే అన్ని సేవలు గ్రామ సచివాల యాల్లోనే నిర్వహించన్నుట్టు అర్థమవుతోంది . మీ సేవ కేంద్రాలలో నిర్వహించే సేవలతో పాటు 530 రకాల సేవలను గ్రామ సచివాలయాల్లో నిర్వహించనున్నారు . మండల , జిల్లా కేంద్రాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని సేవలను పొందటంతో పాటు , అన్ని సమస్యలు ఇక్కడే పరిష్కారమవుతాయి . ప్రతి నెలా 21 వతేదీన గ్రామ సభలు , 25వ తేదీన గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహిస్తారు . . 

గ్రామ పంచాయతీ కార్యదర్శి 

గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలోనే సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి . సచివాయలంలో , పనిచేసే ఉద్యోగులను సమన్వయ పరిచి కార్యాలయ పర్యవేక్షణ చేయాలి . సచివాలయ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉంది . జనన , మరణ ధ్రువీకరణ , వివాహ ధ్రువీకరణ పత్రాలను ఇచ్చే అధికారం కల్పిం చారు . . సచివాలయ ఉద్యోగులకు జీత భత్యాలు డ్రా చేసే ఆధికారం ఉంది . వలంటీర్లకు జీత భత్యాలు డ్రా చేసే అధికారం పంచాయతీ కార్యదర్శికి కల్పించారు . 

వీఆర్వో 

పన్నుల వసూళ్ళు , నివాస ధ్రువీకరణ , ఆర్య ధ్రువీకరణ పత్రాలు అందించే అధికారం ఉంది . సాధారణ రెవెన్యూ విధులతో పాటు రెవెన్యూ రికార్డులు నిర్వహించాలి . రెవెన్యూ పద్దులు కూడా నిర్వహించాలి . వ్యవసాయ నివేదికల రూపకల్పనలో వ్యవసాయ ఆధికారులకు సహకారం అందించాలి . 

విలేజ్ సర్వేయర్ 

గ్రామ సరిహద్దుల పరిరక్షణ ప్రధాన బాధ్యత . . ఎంజాయ్మెంట్ రిజిస్టర్‌లో ఉన్న అంశాలను పరిశీలించాలి . ప్రభుత్వ భూముల ఆక్రమణలను పరిశీలించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు అందించాలి . విలేజ్ మ్యాన్లను రూపొందించాలి . 

ANM

 గర్భిణులకు వైద్య సహాయం అందించాలి . ఎప్పటి కప్పుడు వారికి నిర్దేశించిన పరీక్షలు నిర్వహించాలి . గర్భిణుల్లో క్లిష్టమైన కేసులు వచ్చినప్పుడు వైద్య అధికారికి తెలియజేయాలి . డెలివరీ అనంతరం కనీసం మూడు సార్లు తల్లీ , బిడ్డలకు పరీక్షలు చేయాలి . 

పశు సంవర్ధక అసిస్టెంట్

 పశుసంబంధమైన వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి . పశువులకు రెగ్యులర్ గా వాక్సినేషన్ చేయాలి . కృత్రిమ గర్భధారణ జరిగేలా చర్యలు చేపట్టాలి . 

విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 

గ్రామంలో ఉన్న మత్స్యకారుల జనాభా వివరాలను సేకరించాలి . ఆక్వా సాగు చేసే రైతులు , ఆక్వా వన రులకు సంబంధించిన రికార్డులు తయారు చేయాలి . ఆక్వా సాగుకు ఆ గ్రామాల్లో ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలి .

 విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ 

ఉద్యాన పంటల సాగు వివరాలు , ఉద్యాన పంటలు సాగు చేసే రైతుల వివరాలు సేకరించాలి . ఉద్యాన సాగుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి . ఉద్యాన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి . ఉద్యాన శాఖకు సంబంధించిన అన్ని సబ్సిడీ పథకాలు అర్హులైన వారికి చేరేలా చర్యలు చేపట్టాలి . ప్రభుత్వం అమలు చేస్తున్న ఉద్యాన పథకాలను పర్యవేక్షించాలి . 

విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్

 రైతుల ఆర్థిక , సామాజిక స్థితులు , భూమి సాగు విధానం , పంట దిగుబడి వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన వివరాలు సేకరంచి సమీకృత ప్రణాళిక రూపొందించాలి . భూమినీటి యాజమాన్యానికి సంబంధించిన సర్వే చేయాలి . ఇ - క్రాప్లో రైతులందరి పేర్లు నమోదు చేయాలి . రెగ్యులర్‌గా రైతులతో సమా వేశాలు ఏర్పాటు చేయటంతో పాటు పంటల యాజు మాన్యంపై వారికి అవగాహన కల్పించాలి . 

మహిళా పోలీస్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ 

శాంతి భద్రతల పరిరక్షణ వీరి ప్రధాన బాధ్యత శాంతి భద్రతలపై పంచాయతీ కార్యదర్శికి , ఎస్స్పె కు ప్రతి రోజు నివేదికలు సమర్పించాలి . గ్రామాల్లో జరిగే భూ వివాదాలు , కుల తగాదాలకు సంబంధించి వారాంతపు నివేదికలను ఎసెహెవో , గ్రామ పంచాయతీ కార్యదర్శి , తహసీల్దార్ , ఎంపీడీవో లకు పంపించాలి . స్త్రీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి . ముఖ్యంగా పాఠశాలలు , కళాశాలలో సైబర్ నేరాల నివారణకు చర్యలు చేపట్టాలి . పోషకాహారం లోపంతో ఉన్న పిల్లలను గుర్తించాలి . స్త్రీలు , తప్పిపోయిన ఆడపిల్లలు వివరాలను ఐసీడీఎస్ అధికారులకు తెలియజేయాలి . నూరుశాతం ఆడపిల్లలు చదువుకునేలా చూడాలి .

 ఇంజనీరింగ్ అసిస్టెంట్ 

గ్రామంలో మౌలిక సదుపాయాలైన సీసీ రహదారులు , గ్రావెల్ రహదారులు , బీటీ రహదారులు , చెరువులు , డ్రెయినేజీలు , మంచినీటి సరఫరా , పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన పనులను గుర్తించి వాటికి అంచనాలు తయారు చేసి గ్రామ సభల ఆమోదం పొందేలా చూడటం వీరి ప్రధాన బాధ్యత . ప్రభుత్వ ఆస్థులకు సంబంధించిన రిజిస్టరు నిర్వహించాలి . 

ఎలక్ట్రికల్ అసిస్టెంట్

 గ్రామ వలంటీర్ల సహకారంతో పేదలకు విద్యుత్ కనెక్షన్లు అందించే ఏర్పాట్లు చేయాలి . గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి . అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయాలి . వీధి దీపాల నిర్వహణ బాధ్య త వీరిదే . 

డిజిటల్ అసిస్టెంట్ 

గ్రామ వలంటీర్లు సేకరించిన కుటుంబ సమాచారాన్ని కంప్యూటరైజ్ చేసి లబ్ధిదారుల వివరాలతో పాటు ప్రజల నుంచి వచ్చిన సమస్యల వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శికి తెలియజేయాలి . గ్రామ సచివాలయాల్లో తపాలా స్వీకరణ , బట్వాడా తదితర అంశాలను నిర్వహించాలి . సీఎసీ / మీ సేవ కౌంటర్ నిర్వహించాలి . ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించటం , ధ్రువీకరణ పత్రాలు అందజేయడంతో పాటు మీ సేవ సర్వీసులను నిర్వహించాల్సిన బాధ్యత వీరిదే . 

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 

సోషల్ వెల్ఫేర్ , ట్రైబుల్ వెల్ఫేర్ , బీసీ వెల్ఫేర్ , మైనార్టీ వెల్ఫేర్ , వికలాంగుల సంక్షేమానికి సంబంధించి లబ్ధిదా రుల వివరాలను సేకరించాలి . ఆయా కార్పొరేషన్లు అమలు చేస్తున్న పథకాలు వారికి అందేలా చర్యలు తీసు కోవాలి . ప్రభుత్వం వారికి అమలు చేస్తున్న పథకాలపై ఆవగాహన కల్పించాలి . అర్హులైన విద్యార్థులకు పారితోషి కాలు అందేలా చర్యలు తీసుకోవాలి .

 విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ 

రైతులకు మల్బరీ తోటల పెంపకంలో సాంకేతిక సలహాలు అందించాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The government has released a job charge regarding the performance of duties for village secretariat employees."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0