Chhattisgarh government's decision to teach constitutional lessons to students every Monday
Chhattisgarh government's decision to teach constitutional lessons to students every Monday.
విద్యార్థులకు ఇక రాజ్యాంగ పాఠాలు
ప్రతి సోమవారం చర్చ
చత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్ణయం.
విద్యార్థులకు ఇక రాజ్యాంగ పాఠాలు
ప్రతి సోమవారం చర్చ
చత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్ణయం.
రాజ్యాంగం పట్ల విద్యార్థుల్లో లోతైన అవగాహన కలిగించే దిశగా ఛత్తీస్ గడ్ ప్రభుత్వం ఓ ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకుంది . రాష్ట్రంలోని విద్యార్థు లంతా రాజ్యాంగంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది . ఈ నెల 27 నుంచి దీనికి శ్రీకారం చుట్టాలని శుక్రవారం విద్యా శాఖ సర్క్యులర్ జారీ చేసింది . ఇకమీదట ప్రతి సోమవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల్లో రాజ్యాంగంపై బోధన చేయాల్సి ఉంటుంది . 26న ఆదివారం గణతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత , మర్నాడు నుంచి పాఠశాల విద్యార్థులకు రాజ్యాంగంపై , ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పి స్తారు . 27న ( సోమవారం ) భారత రాజ్యాంగం ప్రవేశిక ( ప్రియాంబుల్ ) గురించి విద్యార్థులకు వివరిస్తారు . ఆ తర్వాత ప్రతి సోమవారం తరగతులు ప్రారంభం కావడానికి ముందు కొంత సేపు రాజ్యాంగం గురించి అవగాహన కల్పించాలని , దానిపై తిరిగి చర్చించాలని అధికారులు ఆదే శించారు . ఇదిలా ఉండగా పాఠశాల విద్యార్థులు రాజ్యాంగం గురించి విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ గత ఏడాది అసెంబ్లీలో ప్రకటన చేశారు .
0 Response to "Chhattisgarh government's decision to teach constitutional lessons to students every Monday"
Post a Comment