Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Two new projects are to be implemented in the first week of February as student development

Two new projects are to be implemented in the first week of February as student development.
Two new projects are to be implemented in the first week of February as student development.


  • ఫిబ్రవరిలో జగనన్న ' దీవెన ' లు.
  • తుది దశకు చేరుకున్న విద్యార్థుల ఎంపిక ప్రక్రియ కళాశాలల్లో జాబితాల ప్రదర్శన 
  • 11 లక్షల 61వేల మందికి జగనన్న విద్యాదీవెన . . వసతి దీవెన 
  • ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో సంవత్సరానికి రూ . 20వేలు జమ 
  • అమ్మఒడి తరహాలో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక స్వాంతన 
  • ప్రస్తుత సంవత్సరం రూ . 5700 కోట్ల వ్యయం చేయనున్న ప్రభుత్వంరాష్ట్రంలో విద్యాభివృద్ధికి , విద్యార్థులు ! ప్రగతికి ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొస్తున్న జగనన్న విద్యా దీవెన , జగనన్న వసతి దీవెన ' పథకాల అమలుకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుంది . ఇప్పటికే ఈ రెండు పథకాలకు , సంబంధించిన లబ్దిదారుల జాబితాలను ఆయా గ్రామ - వార్డు సచివాలయంలో ప్రదర్శించిన ప్రభుత్వ అధికారులు . . తాజాగా అర్హులైన విద్యార్థులు , వారి తల్లి బ్యాంకు ఖాతాలతో కూడిన సమాచారాన్ని కళాశాలలో డిస్ ప్లే చేస్తున్నారు . అలాగే వీటిలో తప్పులను సరిదిద్దుకుని , ఆ డేట్ చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం ఆవకాశం కల్పించింది . దీంతోపాటు బయోమెట్రిక్ పడని విద్యార్థుల అథెంటికేషన్ కోసం ఐరీస్ పరికరాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచి విద్యార్థులకు మేలు చేకూర్చబోతోంది . అంతేకాకుండా ఈ పథకం ద్వారా అందించే నగదు మొత్తాన్ని కూడా ఈ ఫిబ్రవరి మొదటివారంలో విద్యార్థుల తల్లి ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . కాగా ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం రూ . 5700ల కోట్లకు పైగా ఖర్చుచేయబోతోంది . 

బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనార్టీతోపాటు అగ్రవర్ణాలకూ లబ్ధి 

విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన జగనన్న విద్యాదీవెన ( రీయింబర్స్ మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ - ఆర్టీఎఫ్ ) , హాస్టల్స్ లో మెరుగైన సౌకర్యాలు కల్పించుకునేందుకు నిర్దేశించినవ నాతి దీవెన ( మెయింటెనెన్స్ ఫీజ్ - ఎంటీఎఫ్ ) పథకాలకు ఆమలుకు కోసం ప్రభుత్వం గత నవంబరు 30వ తేదీన ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది . ఆ క్రమంలో ఈ పథకాలకు అర్హతలు , అనర్హతల వివరాలను కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది . అంతేకాక ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులు దాదాపుగా ఈ పథకం పరిధిలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంది . ఈ నేపథ్యంలో అగ్రవర్ణాలలోని పేదలు కూడా అధిక మొత్తంలో లబ్దిపొందే విధంగా ఉత్వర్వులు జారీచేసింది . పది ఎకరాల లోపు మాగాణి లేదా 25 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారు లేదా ఈ రెండూ కలిపి 25 ఎకరాల లోపు ఉన్న వారు , పట్టణాల్లో 1500చ . అ . స్థిరాస్తి కలిగిన వారు , వార్షిక ఆదాయం రూ . 2 . 50 లక్షల లోపు ఉన్నవారు బీసీ , ఎస్సీ , ఎస్టీ కాపు , మైనార్టీ . . ఇలా అన్ని వర్గాల వారికీ పెద్దమొత్తంలో ఈ పథకాల ద్వారా మేలు చేసేందుకు సంకల్పించుకుంది . దీంతో ఐటీఐ , ఇంటర్ చదివే విద్యార్థుల దగ్గర నుంచి పీ హెడీ వరకు అన్ని రకాల విద్యలకు ( డ్రీమ్ వర్సిటీలకు తప్పా ) జగనన్న విద్యా దీవెన ద్వారా లబ్ది కలగనుంది . ఇంటర్ , డిగ్రీలతో పాటు బీటెక్ , ఎంటెక్ , ఎంఫార్మసీ , ఎంబీయే , ఎంసీయే , బీఈడీ , తదితర కోర్సులకు కూడా పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం చేయబోతోంది . అలాగే వసతి దీవెన కింద పూర్తిస్థాయి ఫీజ్ రియాంబర్సెమెంట్ తోపాటు ఐటీఐ విద్యార్థులకు సంవత్సరానికి రూ . 10 వేలు , పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ . 15 వేలు , డిగ్రీ , ఆపై కోర్సులు చదివే వారికి రూ . 20 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది .

 11లక్షల 61వేల మందికి లబ్ది

రాష్ట్ర ప్రభుత్వం అమలపరచబోతున్న ఈ జగనన్న విద్యాదీవెన , వసతి దీవెన వల్ల రాష్ట్రంలో 11లక్షల 61వేల మంది విద్యార్థులకు అత్యధిక స్థాయిలో మేలు జరగబోతోంది . ఆర్థిక పరంగా వారి కుటుంబాలకు కూడా తోడ్పాటు కలగబోతోంది . ఇప్పటికే అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 42లక్షల మందికి ఆర్థిక ఆనందాలను పంచిన సీఎం జగన్ . . ఈ దీవెనల పథకాల ద్వారా మరో పదకొండున్నర లక్షల కుటుంబాలకు ఆర్థిక సాంత్వన చేకూర్చబోతున్నారు . ఈ రెండు దీవెనల పథకాల అమలు కోసం సంవత్సరానికి రూ . 5700లకోట్లను ఆయన వ్యయం చేయబోతున్నారు . ఈ పథకాలకు సంబంధించి తూ . గోజిల్లాలో అత్యధికంగా లక్షా ఎనిమిదివేల మంది విద్యార్థులు లబ్దిదారులుగా ఉండగా . . గుంటూరు నుంచి 94వేల మంది ఉన్నారు . చిత్తూరు నుంచి 92వేల మంది , కృష్ణా నుంచి 92వేల మంది , అనంతపురం నుంచి 90 వేలమంది , విశాఖ నుంచి 90 వేలమంది , కర్నూలు నుంచి 85వేలమంది , పశ్చిమ గోదావరి నుంచి 79 వేల మంది విద్యార్థులు , ప్రకాశం జిల్లా నుంచి 78వేల మంది విద్యార్థులు , నెల్లూరు నుంచి 67వేల మంది , కడప నుంచి 79 వేల మంది , విజయనగరం నుంచి 57వేల మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నారు . 

ఫిబ్రవరిలో నగదు పంపిణీ

 ఈ అర్హులైన విద్యార్థులందరికీ ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం నగదును అందించనుంది . అమ్మ ఒడి తరహాలోనే ఆయా విద్యార్థుల తల్లుల ఖాతాలకు నేరుగా ఆర్టీ ఎఫ్ ద్వారా నగదును జమ చేయనుంది . అలాగే అమ్మ ఒడికి ఏవిధంగానైతే వివిధ కార్పొరేషన్ల ద్వారా నగదును అందించారో . . దీనికి కూడా వివిధ రకాల కార్పొరేషన్ల ద్వారానే నగదును పంపిణీ చేసేందుకు ఆలోచన చేస్తున్నారు . విద్యార్థులకు తల్లి లేకపోతే గార్డియన్ ఖాతాకు నగదును జమ చేస్తారు . అలాగే ఆదాయ పరిధిని ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో దాని పరిధిలో అర్హులైన వారి జాబితాలు , వివరాలను ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ . . వాలంటీర్ల నుంచి సేకరించి జ్ఞానభూమి | పోర్టలో అప్లోడ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . అలాగే విద్యా దీవెన పథకం కింద ఇంకా సర్వే చేయించుకోని విద్యార్థుల క వాడా వాలంటీర్ల ద్వారా సర్వే చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Two new projects are to be implemented in the first week of February as student development"

Post a comment