Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Data entry is incorrect ... Threat to the Ammavadi

డేటా ఎంట్రీ తప్పు,అమ్మ ఒడికి ముప్పు

Data entry is incorrect ...  Threat to the Ammavadi


  • అమ్మఒడి డేటా కంప్యూటీ కరణలో తప్పుల తడక
  • రేషన్‌కార్డులో సున్నాకి బదులు ఓ అక్షరం ఎంట్రీతో అనర్హత జాబితాలోకి
  • ఆదాయపు పన్ను లేకపోయినా ఉన్నట్లు నమోదు
  • తల్లి, బిడ్డల ఆధార్‌లకు ఎవరెవరివో విద్యుత్‌ సర్వీసుల లింక్‌
  • 90 శాతం పైగా హాజరు ఉన్నా లేదని రిమార్కు


 అమ్మఒడి పథకం ప్రారంభ తేదీ మరో రెండు రోజుల్లోకి వచ్చేసిన నేపథ్యంలో ఇంకా అర్హుల జాబితాలోకి చేరని పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తుతోన్నది. గత నాలుగు రోజుల నుంచి సవరణలు, అభ్యంత రాలను స్వీకరిస్తోన్న విద్యా శాఖ అధికారులు వాటిని ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తోన్నారు. అ యితే సెంట్రల్‌ సర్వర్‌లో ఇంకా అప్‌డేట్‌ జరగకపోతుండటంతో నేటికీ అమ్మఒడి వెబ్‌సైట్‌లో అనర్హుల జాబితాలు యథాత థంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొదటి జాబితాలో పేర్లు ఉన్న వారికే తొలుత నగదు జమ అవుతుందన్న వాదన వినిపిస్తోన్నది. దీంతో తమకు అమ్మఒడి పథకం ఫలం అందదేమోనని చాలామంది మథనపడు తోన్నారు. ముఖ్యంగా డేటా ఎంట్రీలో జరిగిన తప్పులు కారణంగా అనర్హుల జాబితాలో చేరి న వారు తీవ్రంగా ఆవేదన చెందుతోన్నారు.ఆధార్, రేషన్‌కార్డు తదితర వివరాలు తప్పుగా నమోదైన వారు అనర్హుల జాబితాలో ఉన్నారు. అనర్హుల డేటాకి సంబంఽధించి ధ్రువీకరణ కోసం వలంటీర్లకు బాధ్యత కేటాయించారు. ఎవరి పేర్లు అయితే అనర్హుల జాబితాలో చేర్చారో వారందరికి వలంటీర్లు ఫోన్లు చేసి ఫలాన కారణంగా మీది అనర్హత జాబితాలో ఉన్నదని చెప్పి, దానికి సంబంధించి సరి చేసుకోవడానికి ఏవైనా పత్రాలు ఉంటే తీసు కురావాల్సిందిగా కోరుతున్నారు. ఇందుకోసం గ్రామ సచివాలయాల్లో సవరణ, అభ్యంతరం ఫారాలను అందుబాటులో ఉంచారు. దీంతో ఎవరివైతే అనర్హత జాబితాలో చేర్చారో ఆ యా పిల్లల తల్లిదండ్రులు ఈ నెల 2వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి ఫారాలు అందజేస్తోన్నారు. కొందరైతే నేరుగా ఎంఈవో కార్యాలయాలకు వెళుతోన్నారు.

అమ్మఒడి డేటా ఎంట్రీ త ప్పుల తడకగా జరిగింది. తొలుత హెచ్‌ఎం లకు లాగిన్‌లు ఇచ్చి డేటా అప్‌లోడ్‌ చేయమ న్నారు. 20 రోజుల తర్వాత ఆ డేటా మొత్తా న్ని తొలగించి మళ్లీ తాజాగా నమోదు చేయ మన్నారు. ఈ సారి తక్కువ సమయం కేటా యించడంతో హెచ్‌ఎంలు తప్పులు తడకగా డేటా ఎంట్రీ నమోదు చేశారు. రేషన్‌కార్డులో సున్నాకి, ఆంగ్ల అక్షరం ఓ కి పెద్దగా వ్యత్యా సం ఉండదు. దాంతో సున్నా ఉన్న చోట ఓ ని, కొన్ని దరఖాస్తుల్లో ఓ ఉన్న చోట సున్నాని చేర్చి డేటా ఎంట్రీ చేశారు. దీంతో ఆధార్‌, రేషన్‌కార్డు తప్పు అంటూ రీమార్కులతో అన ర్హుల జాబితాలో చేర్చారు. ప్రైవేటు కంపె నీలు కొన్ని తమ వద్ద పని చేసే సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియమించుకొం టాయి. వారికి చెల్లించే జీతాలు తక్కువే అయినా గంపగుత్తగా ఒకే బిల్లు చెల్లిస్తాయి. దాంతో ఆ చిరుద్యోగులకు చెల్లిం చే జీతాల్లో పన్నులు మినహాయించు కొంటారు. ఇలాంటి వారిని ట్యాక్స్‌ పేయిలుగా అనర్హత జాబితాలో చేర్చారు.

విద్యుత్‌ శాఖ చేసిన తప్పులు పేదల పాలిట శాపాలు

2014-15 సంవత్సరంలో ప్రభుత్వం ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేసింది. ఆ సమయంలో ఎవరి పేరు మీద అయితే సర్వీసు కనెక్షన్‌ ఉందో వారి ఆధార్‌ ఎంట్రీ చేసి ఉంటే ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు. విద్యుత్‌ బిల్లు, ఆధార్‌ జిరాక్స్‌ కాపీలు తీసుకెళితే విద్యుత్‌ సిబ్బంది సర్వీసు కనెక్షన్‌ యజమాని ఎవరనేది ధ్రువీకరించుకోకుండా ఎల్‌ఈడీ బల్బులు ఇచ్చేసి ఆధార్‌ని లింక్‌ చేశారు. కొన్ని సెక్షన్లలో అయితే ఒకే ఆధార్‌ నెంబరుతో చాలామందికి ఎల్‌ఈడీ బల్బులు ఇచ్చి విద్యుత్‌ కనెక్షన్‌కి లింక్‌ చేశారు. అమ్మఒడి పథకంలో ప్రభుత్వం నెలకు రూ. 300 యూనిట్ల విద్యుత్‌ వాడకం దాటరాదన్న నిబంధన పెట్టింది. ఇందుకోసం విద్యుత్‌ శాఖ నుంచి డేటా తీసుకొని అనుసంధానం చేసింది. దాంతో దాదాపు 50 వేల మందికి పైగా పేద పిల్లలు అనర్హుల జాబితాలోకి వచ్చారు. ఒకే ఆధార్‌పై రెండు, మూడు కనెక్షన్లు ఉండటం వలన మూడింటికి కలిపి సగటు విద్యుత్‌ వాడకం లెక్కించారు. అలానే గతంలో అద్దెలకు ఉండి ఇప్పుడు వేరే చోటికి మారిపోయిన వారు కూడా ఇబ్బందులు ప డుతోన్నారు. ఇందుకు కారణం గతంలో వా రు అద్దెకు ఉన్న ఇంట్లో ప్రస్తుతం విద్యుత్‌ బిల్లు ఎక్కువగా వస్తుండటమే. ఉమ్మడి కుటుంబాల్లో విద్యుత్‌ వాడకం అధికంగా ఉంటుంది. వారు కూడా అనర్హులుగా మారా రు. ఈ నేపథ్యంలో ఎవరో చేసిన తప్పులకు పేద ప్రజలు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం ఉదాశీనం గా వ్యవహరించాలని వారు కోరుతోన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Data entry is incorrect ... Threat to the Ammavadi"

Post a comment