Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

THE LIST OF VIDYA DEEVENA AND VIDYA VASATHI IS READY

విద్యాదీవెన , విద్యా వసతి జాబితా రెడీ ! 
THE LIST OF VIDYA DEEVENA AND VIDYA VASATHI IS READY


  • ఇప్పటివరకు అర్హత పొందిన వారు 10,65,357 మంది విద్యార్థులు 
  • ఈ నెల 9 వరకు అభ్యంతరాలు స్వీకరణ 
  •  10న వాటి పరిశీలన అనంతరం గ్రామ , వార్డు సభలు అందులో లబ్దిదారుల తుది జాబితాలకు ఆమోదం 
  • ఫీజు రీయింబర్స్మెంటకు అదనంగా వసతి , 
  • హాస్టల్ ఖర్చుల కింద ఒక్కో విద్యార్థికి ఏటా రూ . 20 వేల సాయం 


 నవరత్నాల్లో భాగంగా విద్యార్థుల ఉన్నత చదు వుల కోసం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు ఒక్కో విద్యార్థికి ఏటా వసతి , హాస్టల్ ఖర్చు లకు రూ . 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిం చేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన ( ఫీజు రీయంబర్స్మెంట్ ) , జగనన్న వసతి దీవెన ( వసతి , హాస్టల్ ఖర్చులు ) పథకాల అమలుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది . ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల జాబితాలను సోమవారం గ్రామ , వార్డు సచివాలయల్లో ప్రభుత్వం ప్రక టించింది . ఈ జాబితాలపై అభ్యంతరాలు , మార్పు లు , చేర్పులకు సంబంధించి ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీక రిస్తారు . అనంతరం 10న జరిగే గ్రామ , వార్డు సభ ల్లో తుది జాబితా లను ఆమోదిస్తారు . అర్హత సాధించని వారి వివ రాలు .అందుకుగల కారణాలను కూడా ప్రదర్శిస్తారు . కాగా , సోమవారం ప్రక టించిన జాబితాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన , జగనన్న వసతి దీవెన పథకాల కింద మొత్తం 10 , 65 , 357 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు . ఇంకా ఎవరైనా అర్హులుంటే వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది .

జిల్లాల వారిగా జగనన్న విద్యా దీవెన , జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల సంఖ్య 


 జిల్లాలు               మొత్తం అర్హుల సంఖ్య


 తూ . గో                  1,07,238 

గుంటూరు                   93,738

చిత్తూరు.                    91,811

 కృష్ణా                         91,263

అనంతపురం              89,145

విశాఖపట్టణం             88,503

కర్నూలు.                    84,116

 ప . గో                        77,914

ప్రకాశం.                      77,165

 కడప                         76,754

నెల్లూరు.                     66,492

 శ్రీకాకుళం                    64,834

విజయనగరం              56,384

మొత్తం.                     10,65,357 



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "THE LIST OF VIDYA DEEVENA AND VIDYA VASATHI IS READY "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0