Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Education

ఈ 5 చిట్కాలతో మీరు చదువుకునే విధానాన్ని మరింత మెరుగుపర్చుకోండి.
2 గంటలకు మించి నిరంతరాయంగా చదవడం వల్ల, మీలో ఉత్పాదకత గణనీయంగా తగ్గుతుందని మీకు తెలుసా?

అదే పనిగా గంటల తరబడి చదువుతూ మీ మనస్సులో నిరంతరం దాని గురించే ఆలోచిస్తే మీ ధారణ సామర్థ్యాలు తగ్గుతాయి.
గరిష్ఠ ఉత్పాదకత కోసం కొన్ని గంటల తర్వాత ప్రతిసారి విరామం ఇవ్వాలని అనేక అధ్యయనాలు, ముఖ్యంగా హార్వర్డ్‌ నిర్వహించిన పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రతి తొంభై నిమిషాలకు ఒక చిన్న విరామం ఇవ్వడం వల్ల మీ మనస్సు ఉత్తేజంగా మారి మరింత చురుగ్గా పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, విరామం లేకుండా ఉండటం వల్ల ఇబ్బంది పడే బదులు ఒక విరామం తీసుకుంటే మీలో ఉత్పాదకత మరింత పెరుగుతుంది.

విరామం తీసుకొన్న ప్రతీసారి ఈ 5 ఆలోచనలను ఆచరించి చూడండి!


1. యోగా

యోగా, ధ్యానం ఉత్పాదకతను పెంచడంలో సహాయపడే చర్యల్లో అత్యంత ముఖ్యమైనవి. యోగా మరియు ధ్యాన సాధన మనస్సును అలాగే శరీరాన్ని ప్రేరేపిస్తాయి. ధ్యానం, సరిగ్గా ఆచరిస్తే, మీకు పూర్తి స్థాయి విశ్రాంతి లభించడంతో పాటు దృష్టిని గణనీయంగా పెంచడానికి సహాయపడుతుంది. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల పట్టేసిన కండరాలకు యోగాసనాలు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రెండింటిని కలిపి 20 నిమిషాలు ఆచరిస్తే చాలు ఆ తర్వాత మరో తొంభై నిమిషాలు చదవడానికి కావాల్సిన శక్తిని తిరిగి పొందవచ్చు.


2. ఆరోగ్యకరమైన అల్పాహారం

చూయింగ్‌ గమ్‌ తినే అలవాటు ఉంటే- చదువుతున్నప్పుడు ఏ చూయింగ్‌ గమ్‌ అయితే తిన్నారో, పరీక్ష రాసే సమయంలోనూ అదే రుచితో ఉన్న చూయింగ్‌ గమ్‌ను తీసుకోవడం వల్ల మీరు చదివింది గుర్తు తెచ్చుకోవడం సులభమవుతుందనే విషయం మీకు తెలుసా? అల్పాహారం తీసుకోవాలన్న ఆలోచన మంచిదే అయినప్పటికీ, చక్కెర లేదా వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినవద్దు. ప్యాకేజ్డ్‌ చిప్స్‌ అలాగే శీతల పానీయాలకు వీలైనంత దూరంగా ఉండండి. వాటి బదులు ఆరోగ్యకరమైన, క్యారెట్‌ ముక్కలు, కీర, హమ్మస్‌, బాదం, అక్రోట్‌ గింజలు లేదా సాదా అవోకాడో లాంటివి తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు సౌకర్యంగా లేనివి ఉబ్బరంగా అనిపించే వాటికి దూరంగా ఉండి, తేలికపాటి ఆహారానికి కట్టుబడి ఉండండి, ఇది మీ ఏకాగ్రతను పెంచడంతో పాటు మనస్సును అప్రమత్తంగా ఉంచుతుంది.


3. కాసేపు నడవండి

నడక వ్యాయామం యొక్క ఉత్తమ రూపంగా పరిగణించబడుతుంది అలాగే మీరు చదువుకునే సమయం మధ్యలో 15 నిమిషాలు నడవడం వల్ల మీ మనస్సు ఉత్తేజంగా మారుతుంది. అయితే అదేసమయంలో చిన్న జాగ్రత్త, నడవాలి కదా అని మీ ఇంట్లో తిరగకండి. సరదాగా అలా బయటకు వెళ్లి తాజా గాలిని పీల్చుకొండి. మంచి వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది, ఇది సానుకూల ధృక్పథాన్ని అలవాటు చేసి మరింత ఇష్టంగా నేర్చుకోడానికి సహాయపడుతుంది.


4. చిన్న కునుకు తీయండి

తగినంత విశ్రాంతి దొరికే మెదడు మరింత చురుగ్గా పని చేస్తుంది. నిద్రలో మన శరీరం తగినంత స్వస్థత పొందుతుంది మరియు చైతన్యం నింపుతుంది. మీరు సుదీర్ఘకాలం చదువుతున్నప్పుడు, మీరు శారీరకంగా అలసిపోకపోవచ్చు. కానీ మీ మనస్సు అలసిపోతుంది. అలసట నుండి మేల్కొలపడానికి మంచి మార్గం ఏంటంటే, ఒక చిన్న కునుకు తీయడం, దీన్నే పవర్‌ నాప్ అంటారు. ఇది రోజులో మిగతా సమయంలో మీకు కావాల్సినంత శక్తిని అందిస్తుంది మరింతసేపు మీ పని కొనసాగించేలా చేస్తుంది.

5. సరికొత్త విషయాల గురించి తెలుసుకోండి

సుదీర్ఘమైన రోజు తరువాత, మనలో చాలామంది స్క్రీన్‌ ముందు కూర్చుని మంచి సినిమా లేదా మంచి సిరీస్‌ ఎంచుకుని దానిని చూస్తూ అందులో లీనమైపోతారు. ఇది నిస్సారంగా గడిచిపోతున్న జీవితానికి విరామం ఇచ్చి నవ్వు, పులకరింతలు, డ్రామాతో నిండిన ప్రపంచంలోకి తీసుకెళ్లి మిగిలిన విషయాల నుంచి తప్పించుకునే వీలు కల్పిస్తుంది. మీరు తొంభై నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం చదివినప్పుడు, ఆసక్తికరమైనవి చూస్తూ కొత్త విషయాలను తెలుసుకోడానికి మీ స్ట్రీమింగ్‌ నెట్‌వర్క్‌కు మారడమనేది అద్భుతమైన మార్గం. కానీ అలా చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే నియంత్రించుకోండి విరామంలో మొదలుపెట్టిన చూడటాన్ని అందులో లీనమైపోయేలా చేసుకోకండి. మరి తక్కువ సమయంలోనే అనుకున్నవి చూడాలంటే మీకు వేగవంతమైన కనెక్షన్‌ ఉండటం ముఖ్యం, బఫరింగ్‌తో అది మీ సమయాన్ని వృథా చేయదు. ఎయిర్‌టెల్‌ డేటా కనెక్షన్‌ వేగంగా ఉండటమే కాకుండా, థ్యాంక్స్‌ ప్రోగ్రామ్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ మరియు 3 నెలల నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌ సభ్యత్వాన్ని సైతం అందిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Education"

  1. This one is good. Keep up the good work I also visit here: and I get lot of information. https://hocdot.com/giai-toan-8

    ReplyDelete