Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

TET, DSC announcement soon this year

 ఈఏడాదికి సంబంధించి త్వరలోనే టెట్, డీఎస్సీ ప్రకటన..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీకి చర్యలు..
 ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి..

ఈ ఏడాది టెట్ , డీఎస్సీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు . 2018 డీఎస్సీలో న్యాయ వివాదాలతో నిలిచిపోయిన నియామకాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు . ఆదివారం కృష్ణా జిల్లా తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు విచ్చేసిన మంత్రి విలేకరులతో మాట్లాడారు . గతంలో కొన్ని డీఎస్సీల్లో నెలకొన్న సమస్యలను కూడా సత్వరం పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు . రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు . గత ప్రభుత్వాలు కొత్త జూనియర్ కళాశాలలు మంజూరు చేసినా అధ్యాపక పోస్టులకు అనుమతి ఇవ్వలేదన్నారు . దీంతో తాత్కాలిక ప్రాతిపదికపై నియామకాలు జరిగాయని , కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం అనుసరిస్తోందన్నారు . కళాశాలల్లో అధ్యాపక పోస్టులను ఏ మేరకు భర్తీ చేయాలో పరిశీలించి త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "TET, DSC announcement soon this year"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0